విజయనగరం

భారతీయ మహిళలకు అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 12: భారతీయ సంస్కృతిలో మహిళలకు అగ్రస్థానం ఉందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు ఉంటారన్నారు. సమాజానికి మహిళలు వెనె్నముక వంటి వారని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని సిఎంఆర్ అధినేత ఎంవి రమణ నెలకొల్పిన కంచికామాక్షి షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలకు ఒక ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. ఇక్కడ మహిళలకు సంప్రదాయ వస్త్రాల కోసం మావూరి వెంకట రమణ ప్రత్యేకంగా షోరూం ఏర్పాటు చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తాము కూడా మహిళలకు విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే దేశంలో ఎనిమిది లక్షల మందికి వీటిపై అవగాహన కల్పించామన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్య వంతంగా ఉంటుందని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, ఎమ్మెల్యే మీసాల గీత, ఎంపీ ఝాన్సీలక్ష్మి, ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ శోభా హైమవతి తదితరులు పాల్గొన్నారు.

మరో 50వేల ఎకరాలకు సాగునీరు
*త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలి

విజయనగరం, డిసెంబర్ 12: జిల్లాలో అదనంగా మరో 50వేల ఎకరాలకు సాగునీరందించేందుకు త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ద్వారా చేపడుతున్న మేజర్ నీటిపారుదల ప్రాజెక్టులు, మైనర్ నీటిపారుదల ప్రాజెక్టులు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పనులు పూర్తయిన వాటికి బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. విజయనగరం డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తే 27500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే పార్వతీపురం డివిజన్‌లో 34వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొన్ని ప్రాజెక్టులకు భూ సమస్య ఉన్నందున పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని సాగునీటి పారుదల అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని జెసికి సూచించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత భూమి సేకరించాలో సంబంధిత వివరాలను జెసికి అందజేయాలన్నారు. అధికారుల వారీగా ప్రతి వారం ర్యాంకు ఇస్తున్నామని, తక్కువ ర్యాంకులో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెక్‌డ్యామ్‌లు, పర్క్యులేషన్ ట్యాంకులు ఎక్కడ అవసరమైతే అక్కడ నిర్మించాలన్నారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నదీ, మిగిలిన భూమికి ఏ విధంగా సాగునీరు అందజేస్తామన్నదీ ప్రణాళిక రూపొందించి తనకు అందజేయాలన్నారు. ఎఇల వారీగా చేపట్టిన పనులు, సాధించిన లక్ష్యాలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో జెసి కెవి రమణారెడ్డి, జెసి-2 సీతారామారావు, ఎస్‌ఇ, ఇఇ రమణ, డిఇ గోవర్దనరావు, డిఇ సురేష్, జెఇఇలు, ఎఇఇలు పాల్గొన్నారు.