విజయనగరం

ఎండిఎం సరఫరా కేంద్రం వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, డిసెంబర్ 13: ఎండిఎం సరఫరా కేంద్రం నవప్రయాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సిఐటియు, ఎఐటియుసిల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు గురువారం ఉదయం నవప్రయాస్ ఏజెన్సీ వద్దకు చేరుకుని ఎండి ఎం సరఫరా వ్యాన్లును అడ్డగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళన కారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ, ఎండిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుధారాణి, కిల్లంపల్లి రామారావు, ఎఐటియుసి నాయకులు వి.కృష్ణంరాజు, బుగత అశోక్, జీవాలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుంటుండగా నిర్వాహకులు గట్టిగా ప్రతిఘటించారు. తమ నాయకులను విడిచిపెట్టాలని పోలీసులను వారించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. నాయకులు మళ్ళీ ఆందోళన కొనసాగించారు. అనంతరం విజయనగరం రూరల్ సిఐ రమేష్, ఎస్సై రామకృష్ణ, గుర్ల ఎస్సై రవి, నెల్లిమర్ల ఎస్సై నారాయణరావు, కానిస్టేబుళ్ళతో ఆందోళనకారులను చెదరగొట్టారు. నాయకులను అదుపులోకి తీసుకుని గుర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే మధ్యాహ్న భోజన నిర్వాహకులను విజయనగరం రూరల్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ, ఎండిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సుధారాణిలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. 15 సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేస్తున్న నిర్వాహకుల నోటిలో మట్టికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే ఎండిఎంను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. నిర్భంధాలతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో సి ఐటియు నాయకులు టి.వి.రమణ, బి.సుధారాణి, కిల్లంపల్లి రామారావు, బి.సూర్యనారాయణ, బి.రమణ, ఎఐటియుసి నాయకులు వి.కృష్ణంరాజు, బుగత అశోక్, ఎ. అప్పలరాజు తదితరులు ఉన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
పార్వతీపురం, డిసెంబర్ 13: పార్వతీపురం నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్ నాటికి 20నుండి 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, ఈ ఏడాది ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు నుండి ధాన్యం ప్రారంభించలేదని వైకాపా నాయకులు గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ టి ఎస్ చేతన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైకాపా నియోజకవర్గం సీనియర్ నాయకుడు జె ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కేవలం 2,3కేంద్రాల్లో ప్రారంభించినా అక్కడ కూడా ధాన్యం సేకరణ జరగడం లేదని ఇందుకు కారణంగా గోనె సంచుల ఖాళీలేక ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు రైతాంగం తెలిపారు. ఈ ఏడాది తీవ్రమైన వర్షాభావం పరిస్థితులు కారణంగా రైతులకు పండిన కొద్దిపాటి పంట ధాన్యం కూడా పొలాల్లో ఆరుబయట ఉంటున్నందున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తక్షణమే తగు చర్యలు తీసుకుని రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ చేతన్ సంబంధిత సివిల్ సప్లయిస్ విభాగం అధికారులకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ మండల కన్వీనర్ బి.రామినాయుడు,, నాయకులు అక్కేన సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఏనుగులు రాకుండా శాశ్వత పరిష్కార మార్గానికి అనే్వషణ
సబ్ కలెక్టర్ టి ఎస్ చేతన్ వెల్లడి
పార్వతీపురం, డిసెంబర్ 13: ఏనుగుల గుంపు పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతం మార్గం నుండి రాకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కార మార్గం అనే్వషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్వతీపురం సబ్‌కలెక్టర్ టి ఎస్ చేతన్ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో వాటికి కావాల్సిన ఆహారం అందుబాటులో లేకపోయిన కారణంగానే మైదాన ప్రాంతాల్లో పంట పొలాల్లోకి సైతం తరతలివచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. అందువల్ల అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఏనుగుల ఆహారంగా దోహదపడే మొక్కల పెంపకం వంటివి చేపడితే బాగుంటుందని ఈవిషయమై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు వ్యూహరచన చేసే ఆలోచన ఉందన్నారు. ఈవిధంగా చేయడం వల్ల భవిష్యతులో ఏనుగల సంచారం మైదాన ప్రాంతానికి రాకుండా ఉంటాయని భావించారు.

మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణపై 19న ఛలో కలెక్టరేట్
పార్వతీపురం, డిసెంబర్ 13: మధ్యాహ్న భోజన పథకం ప్రైవేకరణను రద్దు చేయాలని కోరుతూ గురువారం స్థానిక సిపియం కార్యాలయంలో సిటూ నాయకుడు గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేసే యోజన రద్దు చేయాలని కోరుతూ ఈనెల 19వ తేదీన వంట బంద్ చేసి ఛలోకలెక్టరేట్‌ను మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని కేంద్రంలో మోడి, రాష్ట్రంలో బాబులు జోడిగా ఉన్నపుడు బిజెపి, ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థసంస్థలైన అక్షయపాత్ర, నవ ప్రయాస్, ఏక్‌తా ఫౌండేషన్లకు ధారాదత్తం చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
నాల్గవ రోజుకు చేరిన నిర్వాసితుల దీక్షలు
పార్వతీపురం, డిసెంబర్ 13: తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక కోర్టు ఆవరణలో చేపడుతున్న నిరాహారదీక్షలు గురువారం నాటికి నాల్గవ రోజుకు చేరుకున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా ఇళ్ల స్థలాలు పెండింగ్‌లో ఉన్నాయని, పునరావాస గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పన సమస్యలు కొంతమేరకు ఉన్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నందున వాటిని పరిష్కరించేవరకు తమ పోరాటం సాగుతుందని నిర్వాసిత సంఘ నాయకులు బంటుదాసు, రమేష్, సదానందం తదితరులు పేర్కొన్నారు.
భారీ వాహనాలను నిరోధించాలి
పార్వతీపురం, డిసెంబర్ 13: పార్వతీపురం పట్టణం మీదుగా భారీ వాహనాలు రాకుండా తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సిపియం జిల్లా కారద్యర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి, సిటూ నాయకుడు బి విరమణ తదితరులు గురువారం సబ్‌కలెక్టర్ టి ఎస్ చేతన్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం పట్టణంలో ఒకే ఒక ఇరుకైన రోడ్డు మార్గంలో అనేక వాహనాలు, పాదాచారులు, ద్విచక్రవాహనాలు వంటివి రాకపోకలు సాగించడం కష్టంగా ఉందన్నారు.దీనికి తోడు ఇటు విజయనగరం నుండి అటు ఒడిసా నుండి భారీ వాహనాలు ఇదే మార్గంలో రావడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీతానగరం నదిపై బ్రిడ్జి కూడా పాడైనప్పటికీ ఈమార్గంలోనే భారీ వాహనాలు అనుమతించడం వల్ల ఇటీవల బ్రిడ్జికి బీటలు వారి భయాందోళలు కల్గిస్తుందని,దీనిని మరమ్మతులు చేపట్టి మళ్లీ ఇదే బ్రిడ్జిపై నుండి భారీ వాహనాల రాకపోకలు అనుమతించడం శోచనీయమన్నారు. దీనిపై అధికారులకు ప్రశ్నిస్తే ఈబాధ్యత ఆర్ అండ్ బిది కాదని ఆశాఖ, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్‌కు తనది కాదని ఇలా ఒకరిపై ఒకరు చెబుతున్నారని సబ్‌కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎన్ సి ఎస్ సుగర్స్ రైతుల బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌ను శ్రీరామ్మూర్తి కోరారు.