విజయనగరం

సర్వ మతాల సారం ఒక్కటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 15: అన్ని మతాల సారం ఒక్కటేనని ప్రముఖ అధ్యాతిక గురువు బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా చెప్పారు. ఆదివారం పట్టణంలోని మెసానిక్ టెంపుల్‌లో శ్రీవిశ్వవిద్య ఆద్యాత్మిక పీఠం ఆధ్వర్యలో మతసామరస్య ఆధ్యాత్మిక సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అని చెప్పారు. మతం ఏదైనా ఈశ్వరుడు ఒక్కడే అన్నారు. జ్ఞానమనే నేత్రంతో భగవంతుని దర్శించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా పరామాత్మను సేవించాలని చెప్పారు. మానావాళికి ఉపయోగపడుతున్న మొక్కలను పెంచాలని అన్నారు. జీవరాసికి ప్రాణవాయువునిచ్చే నామొక్క-నాశ్వాస కార్యక్రమం ద్వారా మొక్కలను నాటేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు భక్తులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత పండితుడు దూసి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ బ్రహ్మతత్వం అర్థంచేసుకోవాలంటే గురువును దైవంగా భావించాలని చెప్పారు. వెలుగును దర్శించాలంటే అజ్ఞానాన్ని తొలగించుకోవాలని సూచించారు. ఆత్మ చైతన్యాన్ని గుర్తించిన వారికి పునర్జన్మ ఉండదని గీతలో కృష్ణుడు బోధించిన విషయాన్ని భక్తులకు ఉపదేశించారు. సంపూర్ణ శరణాగతి ద్వారా మాయను తొలగించుకోవచ్చునని తెలిపారు. సనాతన హిందూధర్మ, సూఫీ తత్వం చెప్పేవి ఒక్కటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మతబోధకుడు ఫాదర్ ప్రతాప్, షేక్ సయ్యద్, లక్ష్మణానందస్వామిలు భక్తులకు భగవంతుని బోధనల గురించి ఉపదేశించారు.