విజయనగరం

మామిడి రైతులలో ఆశలు రేపుతున్న పూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జనవరి 17: నియోజకవర్గంలో మామిడి పూత విరగకాసింది. దీంతో మామిడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పూత విపరీతంగా కాయడంతో ఈ ఏడాదైనా లాభాలు రావచ్చని మామిడి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మామిడిలో ముందుగా కాసే సువర్ణ, కలెక్టర్, తదితర రకాలు విరగకాశాయి. ప్రస్తుతానికి ఎటువంటి పొగమంచు కురియకపోవడంతో ప్రస్తుతానికి రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. బంగినపల్లి, రసాలు, పనుకులు తదితర రకాల మామిడి చెట్లుకు పూత రాలేదు. గత కొనే్నళ్లుగా మామిడి రైతులు లక్షాది రూపాయలు చెల్లించి లీజుకు తీసుకొంటున్నారు. అయితే పొగమంచు, వివిధ రకాల తెగుళ్లు సోకడంతో మామిడిపంటకు తీవ్రనష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎటువంటి పొగమంచు, తెగుళ్లు సోకకపోవడంతో ఈ ఏడాదైనా రైతులకు లాభాలు వస్తాయని ఆశిద్దాం.

మామిడిపూతకు మంచు దెబ్బ
పూసపాటిరేగ, జనవరి 17: మండలంలోని విస్తరించి ఉన్న మామిడితోటలకు మంచుదెబ్బ శరాఘాతంగా మారింది. 2,800 ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడితోటల్లో మామిడిపూత భాగా రావడంతో రైతులు ఒక పక్క ఆనందంగా ఉండగా మరోవైపు ఇటీవల కాలంలో విస్తారంగా కురిసిన మంచువలన మామిడిపూత మాడిపోవడం రైతులను నిరాశ పరచే విధంగా మారింది. మామిడితోటలకు దుక్కులు, వివిధ రకాల మందులు కొట్టినప్పటికీ మామిడిపూత మంచుకు మాడిపోవడంతో ఏంచేయాలో రైతులకు తెలియని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఉద్యానవన శాఖ అధికారులు ఎవరు రాకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మామిడిపూతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
సేవలో తేడాలు...ఖాతాదారులు బేజారు!
* గజపతినగరం ఎస్‌బిఐలో నిత్యం ఇదే తీరు
గజపతినగరం, జనవరి 17: గజపతినగరంలోని భారతీయ స్టేట్ బ్యాంకు కార్యాలయంలో ఖాతాదారులకు సేవలు అందించడంలో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది తేడాలు చూపించడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకులో నగదు జమ చేద్దామనుకునేవారు బ్యాంకుకి వెళ్తే గ్రీన్‌కార్డు తీసుకోవాలని సలహాలు ఇచ్చేస్తున్నారు. అయితే తమకు కావాల్శిన వ్యక్తులు మాత్రం ఎక్కడో ఏమూలన ఉంచిన ఓచర్లు తీసి ఇచ్చి అవసరమనుకుంటే సిబ్బందే వారికి సహకరిస్తున్నారు. అసలే గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చే బ్యాంకు ఖాతాదారులకు ఆధునిక సేవలపై అవగాహన లేక అవస్ధలు పడుతుంటే అటువంటివారికి సహకరించకపోగా చిరాకుగా సమాధానాలు చెప్పడంతో ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో అందరికి సమానంగా సేవలు అందించాల్శిన బ్యాంకు ఉద్యోగులు తేడా చూపడం సరికాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మారిన సేవలపై ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఖాతాదారులు కోరుతున్నారు. పనిచేయని ఏటిఎంలతో అవస్ధలు: అసలే పండగ ఆపై నగదు కొరతతో ఖాతాదారులకు అవసరమైన మేరకు నగదు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు ముందు ఏటి ఎంలో రెండు మిషన్లు ఉండగా అందులో ఒక మిషన్ పనిచేయక దిష్టిబొమ్మలా మిగిలింది. పనిచేస్తున్న ఒకటి అరకొరకొరగా పనిచేయడంతో గంటల కొద్ది నిరీక్షాల్శివస్తున్నది. అదే విదంగా ఎటి ఎంలలో నగదు కూడా సక్రమంగా ఉంచకపోవడంతో ఖాతాదారులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ఖాతాలలో డబ్బులు ఉన్నప్పటికీ ఎటి ఎంలలో నగదు లేకపోవడంతో పలువురు ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని అందరికి ఒకేలా సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు ఖాతాదారులు కోరుతున్నారు.