విజయనగరం

నెలాఖరులోగా రెండు చోట్ల 4జి సేవలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 18: ఈ నెలాఖరు నాటికి జిల్లాలో 4జి సేవలు ప్రారంభించనున్నట్టు టెలికాం జిల్లా జనరల్ మేనేజర్ ప్రభారామారావు తెలిపారు. శుక్రవారం ఆయన 3ఆంధ్రభూమి2తో మాట్లాడుతూ తొలి దశ కింద బొబ్బిలి, గుమ్మలక్ష్మిపురం ప్రాంతాల్లో 4జి సేవలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ నెలాఖరులోగా చీఫ్ జనరల్ మేనేజర్ చేతుల మీదుగా 4జి సేవలు ప్రారంభమవుతాయన్నారు. ఆ తరువాత అక్కడ ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి మిగిలిన చోట్ల 4జి సేవలు విస్తరిస్తామని తెలిపారు. 4జి సేవలు పొందేవారు సిమ్ కార్డులను కూడా మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ముందస్తుగా సమాచారం అందజేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం టెలిఫోన్ ఎక్చేంజీలు సి-డాట్ విధానంలో పనిచేస్తున్నాయని, వీటిని నెలాఖరు నాటికి నెస్ట్ జనరేషన్‌కు మార్పు చేయనున్నామన్నారు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా అమలు చేస్తున్న ప్లాన్‌ల వివరాలను ఆయన వెల్లడించారు. ప్లాన్ 1699 ద్వారా ఏడాదిపాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్‌తోపాటు రోజు 2జిబి డేటాతోపాటు రోజుకు 2.2జిబి డేటా ఎక్స్‌ట్రాతోపాటు రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపుకునే వెసులుబాటు ఉందన్నారు. అలాగే ప్రతిభ ప్లస్ 49 ద్వారా పది రోజులపాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, 1 జిబి డేటా, 200 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుకోవచ్చన్నారు. అలాగే ప్లాన్ 429తో 81 రోజులపాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ రోజు 1బిజి డేటా, వంద ఎస్‌ఎంఎస్‌లు రోజుకు 2.2జిబి డేటా ఎక్స్‌ట్రా ఉపయోగించుకోవచ్చన్నారు. అలాగే ప్లాన్ 485 కింద అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజు 1.5 బిజి డేటా, రోజు 2.2 జిబి డేటా ఎక్స్‌ట్రా పొందవచ్చన్నారు. అలాగే రోజుకు వంద ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ విధంగా ప్లాన్ 171, జీవిత 79, ప్లాన్ 186, అనంత్ ప్లాన్ 105, అనంత్ ప్లస్ ప్లాన్ 328, ప్లాన్ 666తోపాటు ఎస్టీవీ 9, ఎస్టీవీ 4, ఎస్టీవీ 99, ఎస్టీవీ 31, ఎస్టీవీ 29, ఎస్టీవీ 187, ఎస్టీవీ 399, ఎస్టీవీ 447, ఎస్టీవీ 7, డేటా సునామీ 98, ట్రిపుల్ ఎస్, ఎస్టీవీ 444 వంటి ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.

వ్యవసాయశాఖ జెడి లీలావతి బదిలీ

విజయనగరం, జనవరి 18: వ్యవసాయశాఖ జెడి లీలావతి విశాఖ జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమె స్ధానంలో నెల్లూరుకు చెందిన చంద్రనాయక్ ఇక్కడ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కాగా, జెడి లీలావతి జిల్లాలో పనిచేసిన కాలంలో ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతన్నలకు ఎప్పటికపుడు సమాచారం అందజేయడం, సిబ్బంది పనితీరు మెరుగుపరచడంలో ఆమె సఫలీకృతులయ్యారు. అంతేగాకుండా తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో రైతులు రెండో పంట వేసుకునేందుకు, సాగునీటి విస్తీర్ణం పెంపుదలకు ఆమె కృషి చేశారు. కొన్ని చోట్ల రైతులు మూడో పంట కూడా సాగుచేశారు. ఈ విధంగా రైతాంగం యాజమాన్య పద్ధతులు పాటించే విధంగా వారిలో మార్పు తీసుకురాగలిగారు.
డ్రమ్ సీడర్ పద్ధతిలోను, సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వ్యవసాయసాగును ఆమె ప్రోత్సహించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ వాటిపై అవగాహన కల్పిస్తూ సేంద్రీయ పద్ధతుల ద్వారా పంటల సాగును ప్రోత్సహించారు. ఏది ఏమైనప్పటికీ ఆమె జిల్లాలో పనిచేసిన కాలంలో ఉత్తమ సేవలు అందించి అందరి మన్ననలు అందుకున్నారు.

అందరి అభ్యున్నతికి పాటుపడిన అన్న ఎన్టీఆర్!
* టీడీపీ నేతలు డాక్టర్ నాయుడు, శివరామకృష్ణ, అరుణ
గజపతినగరం, జనవరి 18: అందరి అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ పాటుపడ్డారని స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ, మాజీ మంత్రి పడాల అరుణలు అన్నారు. శుక్రవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్ధంతి పురష్కరించుకొని గజపతినగరం జాతీయ రహదారి పక్కన గల ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ నిరంకుశ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్న తరుణంలో 1982లో టీడీపీని స్ధాపించారని తెలిపారు. నిరుపేద ప్రజలకు ఏమి అవసరమో పార్టీ పతాకంలో పొందుపరిచారని అన్నారు. పేద బడుగు బలహీనవర్గాల కోసం ప్రజలే దేవుళ్లు అనే బావంతో పార్టీని స్ధాపించి అన్నలు, అక్కలు, సోదరుల అనే మాటలు సంభోదించడం ప్రారంభమైందని అన్నారు. అన్న ఎన్టీ ఆర్ సినీ రంగానే్న కాకుండా రాజకీయ రంగంలో కొత్త ఒరవడిని సృస్టించారని కొనియాడారు. అదే స్పూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని రకాల ఫించన్లు రెండితలు చేసి పెద్దకొడకు కంటే తండ్రిలా బాధ్యత చేపడుతున్నారని చెప్పారు. నాటినుంచి దేశం పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, ఇదే స్పూర్తితో 2019 ఎన్నికలలో దేశం పార్టీ పతాకం రెపరెపలాడేలా ప్రజలు ఆశ్వీరదించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ తన స్వగృహవ వద్ద పలువురు నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీలు మక్కువ శ్రీధర్, బండారు బాలాజీ, మాజీ జెడ్పీటీసీ గంటా త్రినాధరావు, ఆత్మా కమిటీ చైర్మన్ అట్టాడ లక్ష్మునాయుడు, గజపతినగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుద్ధరాజు నరసింహమూర్తి, వైస్ ఎంపిపి కనకల పోలినాయుడు, సి హెచ్ సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకట రమణ, టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజు, రావి శ్రీధర్, గండ్రేటి అప్పలనాయుడు, వి.వి.ప్రదీప్‌కుమార్, కె.ఎ.ఎస్.ఎస్.గుప్త, కనిమెరక అక్కునాయుడు, నగర ప్రసన్నకుమారి, నరవ శంకర్, మాజీ సర్పంచ్ బలరాం, మహేష్, వెంకటరమణ, మజ్జి అప్పలనాయుడు, బాలి శ్రీహరి, చింతపల్లి నారాయణప్పలనాయుడు, మునకాల ఆదినారాయణ, న్యాయవాది చప్పా తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ శనివారం ప్రత్యేక కాంపెయిన్‌లు చేపట్టాలి
గజపతినగరం, జనవరి 18: ప్రతీ శనివారం ఓటరు ప్రత్యేక కాంపెయిన్‌లు చేపట్టాలని స్ధానిక తహశీల్ధార్ బి.శేషగిరిరావు ఆదేశించారు. శుక్రవారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కాంపెయిన్ నిర్వహించి కొత్త ఓటరు నమోదు, జాబితాలో తప్పు ఒప్పులు సరిచేయడం తదితర రకాలకు సంబందించి ధరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన క్యాలెండర్లును కొత్త ఓటర్లు అందించాలని సూచించారు. వి ఆర్వోలు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. కార్యమ్రంలో ఉపతహశీల్ధార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనాధ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
గజపతినగరం, జనవరి 18: మండలంలోని భూదేవిపేట గ్రామం పరిధిలో గల అనాధ వృద్ధ ఆశ్రమంలోని వృద్ధులకు దుపట్లు పంపిణీ చేశారు. విశాఖ పట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న మహదేవుకృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులు వృద్ధులకు దుప్పట్లు, పండ్లును శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆశ్రమం నిర్మాత కాళ్ళ అప్పారావు, న్యాయవాది చప్ప తిరుపతిరావు, మహదేవు ఫణీంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
విజయానికి అందరు సమన్వయంతో పనిచేయాలి
గజపతినగరం, జనవరి 18: ఎన్నికలలో విజయానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. శుక్రవారం స్ధానిక మార్కెట్‌యార్డులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనస్పర్ధలు విడనాడి ఏకతాటిపై నడవాలని సూచించారు. బూత్ కమిటీలలో ఏమైనా పేర్లు మార్చాలంటే మార్చుకోవాలని అన్నారు. ఇటీవల చేపట్టిన టీడీపీ సభ్యత్వంలో గజపతినగరం నియోజకవర్గాన్ని ప్రధమస్ధానంలో నిలిపినందుకు నేతలు, కార్యకర్తలను అభినందించారు. అదే విధంగా రాష్ట్రంలో మూడవస్ధానం సాధించిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న చంద్రబాబునాయుడుని మరలా ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్, టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజు, రావి శ్రీధర్, గండ్రేటి అప్పలనాయుడు, ఆత్మా కమిటీ చైర్మన్ అట్టాడ లక్ష్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో లక్ష ఆస్తినష్టం
బొండపల్లి, జనవరి 18: మండలంలోని దేవుపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లక్ష రూపాయల ఆస్తినష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దేవుపల్లి ఎస్సీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో రొంగలి రామస్వామి , పసుపురెడ్డి లక్ష్మినారాయణలకు చెందిన పూరిళ్లు కాలిపోయాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని గ్రామస్ధులు అంటున్నారు. ఈ ప్రమాదంలో రామస్వామి ఇంట్లో ఉన్న టీవి, బీరువా కాలిపోవడంతో 21వేల రూపాయలు నగదుతోపాటు దుస్తులు, వివిధ దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే లక్ష్మినారాయణకు చెందిన పూరిల్లులో వంటపాత్రలు, దుస్తులు కాలిబూడియ్యాయి. ప్రమాదం జరిగిన తరువాత సమాచారం అందించడంతో గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి మహేశ్వరరావు తన సిబ్బంది వెళ్లేసరికే ఇళ్లు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ సత్యనారాయణ గ్రామానికి వెళ్లి నష్టం వివరాలు సేకరించారు.
నయవంచుకునిపై కేసు నమోదు
గజపతినగరం, జనవరి 18: ప్రేమిస్తున్నానని నమ్మించి మోసగించిన యువకునిపై కేసు నమోదు చేశామని స్ధానిక ఎస్. ఐ హనుమంతు ఉపేంద్రరావు శుక్రవారం విలేఖరులకు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురంలో ఎం ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న మంతిన అశ్వని గత ఏడాది సెప్టెంబర్‌లో తన తండ్రి మృతి చెందడంతో గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో ఉన్న తన పిన్నిగారింటికి వచ్చేసింది. పక్కనే గల ఇసినిగిరి సతీష్‌తో ప్రేమలోపడింది. తనను ప్రేమిస్తున్నానని నమ్మబలికి శారీరకంగా అనుభవించాడని, ఇపుడు పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరిస్తున్నాడని పిర్యాదులో అశ్వని పేర్కొన్నది. ఈ మేరకు ఎస్ ఐ ఉపేంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్ సేవలు మరవలేనివి
* మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు
గుర్ల, జనవరి 18: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావురాష్ట్ర ప్రజల కోసం చేసిన సేవలు మరువలేనివని చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గద్దేబాబూరావు అన్నారు. శుక్రవారం ఎన్టీ ఆర్ వర్థంతి వేడుకలు ఎస్. ఎస్. ఆర్.పేట, అచ్యుతాపురం, చింతలపేట తదితర గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఎస్. ఎస్. ఆర్.పేట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గద్దేబాబూరావు, జడ్పీటీసీ తిరుమలరాజు పద్మిని, మండల పార్టీ అధ్యక్షులు వెనె్న సన్యాసినాయుడు, మండల విప్ సంచాన సన్యాసినాయుడు తదితర నేతలంతా పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలుగు, బలహీన వర్గాల అభ్యున్నతికోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు ఎంకావాలో తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేసిన నేత చంద్రబాబును మనందరం ఆదరించాలని కోరారు. జడ్పీటీసీ తిరుమలరాజు పద్మిని మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్ముపేట సొసైటీ అధ్యక్షులు చనుమళ్ళ మహేష్, మాజీ ఎంపీటీసీలు గొర్లిరామునాయుడు, కిలారి సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు కమ్మిండి శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ నేతలు పున్నపురెడ్డి శ్రీనివాసరావు, పిళ్లా అప్పలనాయుడు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
గుర్ల, జనవరి 18: తిరుమల ఆసుపత్రి ఆధ్వర్యంలో గుజ్జింగివలస గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గుండె, ఎముకులు, దంత వైద్యం, జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వాటికి ఈసిజి, ఆర్‌బిఎస్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరానికి 254మంది రోగులు వైద్యపరీక్షలు నిర్వహించుకున్నారు. రోగులకు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ శ్రీకాంత్, సత్యప్రసాద్‌లు రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొర్లిరామునాయుడు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
20 ఎకరాల్లో చెరకుతోట దగ్ధం
దత్తిరాజేరు, జనవరి 18: మండలంలో కె.కొత్తవలస గ్రామంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో చెరకుతోట దగ్థమైంది. ఐదు లక్షల రూపాయల వరకు ఆస్థి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పక్కనే ఉన్న రైతు చెరకు తొక్కును కాల్చివేసిన సమయంలో నిప్పు అంటుకోవడంలో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెప్పారు. రెడ్డి సింహాచలం, రెడ్డి అప్పలనాయుడు, సత్తెమ్మ, మరడ అరుణ, రామకృష్ణ, లక్ష్మునాయుడు, ఆదినారాయణ, రాములుతోపాటు మరో 20మంది రైతులకు చెందిన చెరకు తోట దగ్ధమైంది. ఈ విషయాన్ని గజపతినగరం అగ్నిమాపకాదళానికి స్థానికులు సమాచారం అందజేయడంతో గజపతినగరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

పెదమానాపురం ఎస్సైగా ఎ.వి.రమణ
దత్తిరాజేరు, జనవరి 18: పెదమానాపురం ఎస్సైగా ఎ.వి.రమణ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన క్రాంతికుమార్ ఎల్.కోట పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రమణ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో శాంతిభద్రతలను కాపాడతానని పెదమానాపురం స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.
నందమూరి ఆశయరథసారధ్యం మీదే
* ఎమ్యెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు
గంట్యాడ, జనవరి 18: తెలుగుజాతి గొప్పతనాన్ని నలుదిశలా చాటిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆశయాలను నెరవేర్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ వర్థంతిని నరవ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలువేసి నివాళులు అర్పించారు. దేశం పార్టీ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కె. ఎ.నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థిర స్మరణీయుడని, తెలుగువారి గుండెల్లో ఆయన శాశ్వత ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి అన్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తమపార్టీకి అఖండ విజయం చేకూర్చడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. అదే అన్న ఎన్టీఆర్‌కు మనమందరం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవుడమ్మ, జడ్పీటీసీ రమేష్‌కుమార్, వైస్ ఎంపీపీ రామునాయుడు, మండల దేశం పార్టీ అధ్యక్షుడు కె.్భస్కరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రశ్నిస్తేనే సమస్యలకు పరిష్కారం
గరివిడి, జనవరి 18: ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గసమన్వయకర్త రెడ్డివెంకటేష్ అన్నారు. మండలంలోని కోనూరు గ్రామంలో జనసేన పార్టీ జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మామాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వచ్చినపుడే అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తాయని, దీంతోపాటు ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వాలు పనిచేసే విధానం అలవడుతుందని అన్నారు. ప్రభుత్వం పనిచేసే పరిస్థితులు కల్పించబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధులు రమేష్,సంతోష్, గౌరి, రమణ, చంటి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలు ఆచరణీయం
గరివిడి,జనవరి 18:టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాలు ఆచరణీయమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ అన్నారు. ఇక్కడి ఎన్టీఆర్ గార్డెన్‌లో స్వర్గీయ ఎన్టీ ఆర్ వర్థంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే థ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌కే దక్కుతుంది. ఇప్పటికీ ఆయన అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయారని బలగం అన్నారు. ఎన్టీఆర్ ఏ విషయంపై అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాలను ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకు కొనసాగించారని అందువల్లనే ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉంటున్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ పైలబలరామ్, ఆర్‌ఇసిఎస్ మాజీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, ఆర్‌ఇసి వైస్ చైర్మన్ సురేష్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పందులు దాడిలో శిశువు మృతి
* ఆడ శిశువు అని విడిచిన మాతృమూర్తి
నెల్లిమర్ల, జనవరి 18: నెల్లిమర్ల యాతవీధి ప్రాంతంలో హృదయ విధారకమైన సంఘటన చోటుచేసుకున్నది. అప్పుడే జన్మించిన ఆడ శిశువుని యాతవీధి సివార్లులో గుర్తు తెలియని మాతృమూర్తి విడిచిపెట్టింది. స్థానికులు అందించిన వివరాల మేరకు రామతీర్థం జంక్షన్ శ్రీనివాస థియేటర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు, పందులు విచక్షణా రహితంగా పీక్కుతినడంతో స్థానికులు గుర్తించారు. శిశువు రోధన విన్న స్థానికులు అక్కడికి వెళ్లి పందులను, కుక్కలను వెళ్ళ గొట్టారు. శిశువు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో నాయుడు కాలనీ మీదుగా ఇద్దరు మహిళలు ఈ శిశువు వదిలి వెళ్ళారని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు ముసుగులు కప్పుకుని ఉండడంతో గుర్తించలేకపోయామని చెబుతున్నారు. శిశువు మృతదేహాన్ని స్థానికులు చంపావతినదిలో కననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటివారిపై కేసునమోదుచేసి దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఎన్టీ ఆర్ ఆశయసాధనకు కృషిచేయాలి
* ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు
నెల్లిమర్ల, జనవరి 18: టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, కీ॥ తారక రామారావు ఆశయసాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అన్నారు. శుక్రవారం ఎన్టీ ఆర్ 22వ వర్థంతిని పురస్కరించుకుని రామతీర్థం జంక్షన్, మొయిద జంక్షన్, జరజాపుపేట గ్రామాలలో వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పతివాడ నారాయణస్వామినాయుడు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాలు, వసతి గృహాలు నిర్మించడమేకాకుండా రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. అనంతరం సామాజిక పింఛన్లు రెట్టింపు చేసినందుకు హర్షిస్తూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సువ్వాడ వనజాక్షి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు గేదెల రాజారావు, నాయకులు లెంక అప్పలనాయుడు, పతివాడ తమ్మినాయుడు, గురాన అచ్చింనాయుడు, అవనాపుసత్యనారాయణ, కోతల రాజప్పన్న తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు
పూసపాటిరేగ, జనవరి 18: భోగాపురం మండల టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ పతాకావిష్కరణ నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షుడు కర్రోతు బంగారురాజు, జడ్పీటీసీ సభ్యురాలు పడాల రాజేశ్వరి, మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడుతో కలసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్టీఆర్ అభిమానులు, యువత స్వచ్చందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం సుందరపేట సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పేదలకు వస్త్రాలు పంపిణీ
పూసపాటిరేగ, జనవరి 18: మండలంలోని కుమిలి గ్రామంలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు సోమయారెడ్డి, కొండపల్లి లక్ష్మణరావు, గోపాలరెడ్డి, వెంకటరావులతో కలసి టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకుడు ముత్యాలరెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముత్యాల రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీకి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు.
కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ
పార్వతీపురం, జనవరి 18: పార్వతీపురం ఆర్టీసీ బస్టేషన్ నుండి ప్రయాణికుల రద్దీ శుక్రవారం కూడా కొనసాగుతోంది. విశాఖ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు డివిజన్ పరిధిలోని పార్వతీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టాం, కొమరాడ తదితర మండలాల నుండి పెద్ద ఎత్తున తరలిరావడంతో బస్సుల రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈరద్దీని నియంత్రించేందుకు ఆర్టీసీ డిపోమేనేజర్ డి.జాన్ సుందరం సారధ్యంలో ఛీప్ ఇనస్పెక్టర్ పి.శ్రీనివాసరావు, ఆర్టీసీ సిసి ఎస్ బోర్డు డైరక్టర్ మరిపి శ్రీనివాసరావులు దగ్గరుండి బస్సులను దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు డిమాండ్‌ను బట్టి ఆర్టీసీని మళ్లించడంతో రూరల్ సర్వీసులు కొన్నిప్రాంతాలకు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులు దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల నుండి పార్వతీపురం రావడానికి కూడా బస్సులు తక్కువగా ఉండడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రద్దీ శంబర జాతర వల్ల మరోపదిరోజులు పాటు కొనసాగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా పార్వతీపురం ఆర్టీసీ బస్సుస్టేషన్ ఆవరణలో టూవీలర్, ఇతర వాహనాలు ఎక్కడిబడితే అక్కడ పెడుతున్న వారిని నియంత్రించేందుకు తద్వారా వాహన ప్రమాదాలు జరగకుండా తగిన చర్యల్లో భాగంగా ఆర్టీసీ సెక్యూరిటీ అధికారి, హెడ్ కానిస్టేబుల్ ఆర్.రంగారావు పార్కింగ్ లేని ప్రాంతాల్లో వాహనాలను నిలుపుతున్న వారికి ఫైన్లు వేసి వసూలు చేస్తున్నారు. ఇది కంటిన్యూ కొనసాగించడం జరుగుతుందని రంగారావు తెలిపారు.
ఆర్ వో ఆర్ రికార్డుల్లో నమోదుకు వివరాలు అందించండి
పార్వతీపురం, జనవరి 18: అటవీ హక్కుల చట్టం కింద పాసుపుస్తకాలు పొందిన గిరిజన లబ్ధిదారుల వివరాలు ఆర్ వో ఆర్ రికార్డుల్లో నమోదు చేయడానికి వీలుగా పలు వివరాలకు జికార్సు కాపీలు ఈనెల 25తేదీలోగా సంబంధిత తహశీల్దారు కార్యాలయాలకు అందించాలని ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో కోరారు. గిరిజన లబ్ధిదారులు తమ పట్టాకు సంబంధించిన అడంగల్ కాపీ, 1బి, పాసుపుస్తకాల జిరాక్సు కాపీ, పాసుపోర్టు సైజు ఫొటో, ఆధార్ జిరాక్సు కాపీలు అందించాలని పీవో కోరారు. తహశీల్దార్లంతా అటవీ హక్కుల పాసుపుస్తకాలు పొందిన గిరిజన లబ్ధిదారుల నుండి పైన తెలిపిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో పొందుపరచడానికి ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి తీసుకుని రావాలని పీవోడాక్టర్ లక్ష్మీశ ఆ ప్రకటనలో ఆదేశించారు.

లీకులతో రక్షితమంచినీరు వృధా
కురుపాం, జనవరి 18: కురుపాం రక్షితమంచినీటి పథకం ద్వారా చేపడుతున్న నీటి సరఫరా కొన్ని చోట్ల వృధాగా పోతుండటంతో శివారుప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మెయిన్‌రోడ్డులోని పలు ప్రాంతాల్లో పైపులైన్ లీకవుతుండటంతో నీరు వృధాగా పోతుంది. బ్యాంకు రోడ్డు నుంచి మేదరవీధి జంక్షన్ వరకు ఉన్న పైపులైన్‌లో 4,5చోట్ల లీకులు అధికంగా ఉంటున్నాయి. ప్రక్కప్రక్కనే పైపుకనెక్షన్లు ఉండటం వలన కూడా నీరు వృధాగా పోతుంది. ఈమేరకు మంతినవీధి, తెలగవీధి, పోలీస్‌స్టేషన్ రోడ్డు, జీసీసీ కాలనీ, తదితర ప్రాంతాలకు నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. ప్రతీ ఇంటికి బిందెడు నీరు కూడా దొరకడం కష్టమవుతుంది. దీంతో ఈప్రాంత ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైపులైన్ మరమ్మతులు చేపట్టి లీకులను అరికట్టి అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు.
ఎన్‌టి రామారావుకు ఘన నివాళి
కురుపాం, జనవరి 18: రాష్టమ్రుఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావు 23వ వర్థంతిని టీడీపీ నాయకులు చేపట్టారు. శుక్రవారం టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కన్వీనర్ అంధవరపు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులైన ఎన్‌టి ఆర్ కీర్తి మరువరానిదన్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి ఎన్‌టిఆర్ అని కొనియాడారు.

అతనో ఎన్‌టిఆర్ వీరాభిమాని
కురుపాం, జనవరి 18: కురుపాంనకు చెందిన విశ్రాంత ఉద్యోగి గెంబలి నీలకంఠం ఎన్‌టి ఆర్‌కు వీరాభిమాని. చిన్నప్పటి నుంచి ఎన్‌టిఆర్ సినిమాలు చూస్తు అభిమానాన్ని మనసులో నిలుపుకున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఎన్‌టిఆర్ జయంతి, వర్థంతి వేడుకలను తన ఇంటి వద్దనే చేపట్టి ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈయన్ను గ్రామస్థులంతా అసలు పేరు వదిలి ఎన్‌టిఆర్‌గానే పిలుస్తుంటారు. శుక్రవారం ఎన్‌టిఆర్ వర్థంతి సందర్భంగా ఇంటి ముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్‌టిఆర్
పాచిపెంట, జనవరి 18: బడుగు,బలహీనవర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారకరామారావుఅని ఎమ్మెల్సీ జి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం పాచిపెంటలో ఎన్‌టిఆర్ వర్థంతిని టీడీపీ మండల అధ్యక్షులు పిన్నింటి ప్రసాదబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తెలుగుదేశంపార్టీని స్థాపించిన ఎన్‌టిరామారావు పార్టీ స్థాపించిన 9నెలలకే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారని గుర్తుచేశారు. అనేక సంక్షేమపథకాలను అమలుచేసి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగా ఎదిగి అందరి మన్ననలు పొందారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్ మాట్లాడుతూ ఎన్‌టిఆర్ స్థాపించిన పార్టీని ముందుకు తీసుకువెళుతున్న చంద్రబాబునాయుడుకు ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 300మంది వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు, మాజీ జడ్పిటీసీ సభ్యురాలు మంచాల పారమ్మ, నాయకులు పూసర్ల నరసింగరావు, బి మదు, సీతారాం, దత్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

గిరిజన యవత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి
పాచిపెంట, జనవరి 18: గిరిజన యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్‌ఐ సన్యాసినాయుడు కోరారు. శుక్రవారం మండలంలోని బంగారుగుడ్డి, చేరుకగుడ్డి, గుచ్చంపాడు, కాట్రగుడ్డి, అడారుపాడు, మెట్టగుడ్డి, తదితర గ్రామాలను ఆయన సందర్శించి గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల్లో అధికంగా నిరక్షరాస్యులు కావడంతో అన్నివిధాలా వెనుకబడి ఉన్నారన్నారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల అభివృద్ధిలో యువత ముందడుగు వేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వపథకాలపై అవగాహన కల్పించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈమేరకు 30 వాలీబాల్ కిట్లును పంపిణీ చేయగా ఆయాగ్రామాల గిరిజనులకు భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటుచేశారు.
ఎన్‌టి ఆర్ సేవలు మరువలేనివి
జియ్యమ్మవలస, జనవరి 18: ఎన్‌టిఆర్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు అన్నారు. శుక్రవారం మండలంలోగల చినమేరంగి గ్రామంలో ఎన్‌టిఆర్ 24వ వర్థంతి సందర్భంగా ఎన్‌టి ఆర్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ 2 రూపాయలు బియ్యాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారన్నారు. పేదల సంక్షేమానికి ప్రత్యేక పథకాలను అమలుచేసి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్థన థాట్రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దత్తి లక్ష్మణరావు, కురుపాం ఏఎంసీ మాజీ ఛైర్మన్ రామకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మృతి
జియ్యమ్మవలస, జనవరి 18: సీపీఐ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ దాసరి చిన్నంనాయుడు(70) శుక్రవారం మృతిచెందారు. సీపీఐ పార్టీలో చురుకైన పాత్ర వహించిన చిన్నంనాయుడు ఆపార్టీ సహకారంతోనే 3 పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, మండల కార్యదర్శి సూరయ్య చిన్నమ్మనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎన్‌టిఆర్ యుగపురుషుడు
సీతానగరం, జనవరి 18: తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు యుగపురుషుడని ఆ పార్టీ నాయకులు కొమ్మినేని కిశోర్‌కుమార్, తెంటు వెంకటప్పలనాయుడు, కొల్లి తిరుపతిరావులు కొనియాడారు. ఈమేరకు సీతానగరంలో ఎన్‌టిఆర్ 23వ వర్థంతి సభను శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతీ యుగంలో కూడా సమ సమాజ స్థాపనకు ఒక్కరే పుడతారని, అటువంటి యుగపురుషుడు ఒక్క ఎన్‌టి రామారావేనన్నారు. నటనతో ప్రేక్షకులను ఊర్రూతలూగించడంతోపాటు రాజకీయాల ద్వారా ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. ఎన్‌టిఆర్ చూపిన బాటలో ప్రతీ ఒక్కరూ నడుచుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేలా పనిచేయాలన్నారు. ఈ సందర్భం