విజయనగరం

మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 23: మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని ఎఐటియుసి జిల్లాకార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు,జిపిఎఫ్ ఖాతాలను తెరవాలని డిమాండ్‌చేస్తూ ఈనెల 28 నుంచి వచ్చేనెల రెండవతేదీవరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలో అమర్‌భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో 151 అమలు చేయడంతోపాటు జీవోనెంబర్ 279 రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పుప్రకారం సమానపనికి సమానవేతనం చెల్లించాలన్నారు. కనీసవేతనం 18వేల రూపాయలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ చేయాలన్నారు. అలాగే హెల్డ్‌కార్డులు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లింపులు తదితర సమస్యలపై ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవ, యూనియన్ నాయకులు తుపాలకుల శ్రీను, దశమంతుల గణేష్, కల్యాణ శ్రీను, డి.రాజా, రొయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ,ఎస్టీ సమస్యలపై 25న కలెక్టరేట్ ఎదుట నిరసన
విజయనగరం (్ఫర్టు), జనవరి 23: ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఎస్సీ,ఎస్టీల బతుకులు మాత్రం మారడంలేదని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధానకార్యదర్శి గోకా రమేష్‌బాబు అన్నారు. ఈనెల 25వతేదీన కలెక్టరేట్ వద్ద తలపెట్టిన 3పోతారు మా ఉసురు తగిలి2 నిరసనకు సంబంధించిన వాల్‌పోస్టర్లను పట్టణంలో ప్రజాగ్రంథాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ జిల్లా అధికారులు పాలకులతో కుమ్మక్కై ఎస్సీ,ఎస్టీల నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమానికి తూట్లు పొడిచి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపప్రణాళిక నిధులతో పాలకులు, అధికారులు విలాసవంతమైన జీవితాలు గడపడానికి ఎస్సీ,ఎస్టీ నిధులను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. జిల్లా అభివృద్ధివేదిక అధ్యక్షుడు పుక్కాల షణ్ముఖరావుమాట్లాడుతూ భూమి కొనుగోలు పథకం బూటకమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సామాజిక హక్కుల పోరాటవేదిక జిల్లా ప్రధానకార్యదర్శి రాకోటి గోపాలరావు, దళితహక్కుల పోరాటసమితి విజయనగరం రూరల్ కన్వీనర్ దోసురి రామకృష్ణ, పూలే, అంబేద్కర్ విజ్ఞానకేంద్రం జిల్లాకన్వీనర్ ఆతవ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

తారు పరిశ్రమలో అగ్ని ప్రమాదం
బొబ్బిలి, జనవరి 23: స్థానిక గ్రోత్ సెంటర్‌లో ఉన్న ఐడబ్ల్యుఎల్ తారు పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో ఉన్న తారుపైపులైన్ హీటర్‌కు తగలడంతో ఒక్కసారిగా తారు డ్రమ్‌లకు నిప్పు అంటుకుంది. యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫైర్ అధికారి డీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపుచేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.

ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్పించుకోవాలి
తెర్లాం, జనవరి 23: మండలంలోని ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్‌ఐ ఏ నరేష్ అన్నారు. మండలంలోని గొలుగువలస, సతివాడ గ్రామాల్లో బుధవారం ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్పించుకున్నప్పుడే చైతన్యవంతులవుతారన్నారు. అలాగే గ్రామాల్లో బెల్ట్‌షాపులను నిర్మూలించేందుకు తమకు సహాయ సహకారాలు అందించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రజలు సహకరించాలన్నారు. దొంగతనాలు, దోపీడీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎటువంటి సంఘటనలు జరిగిన తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, గ్రామస్థులు, ఏఎస్‌ఐ సన్యాసిరావు, హెచ్‌సీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీ పరీక్షలు
తెర్లాం, జనవరి 23: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలోని జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు యుటీఎఫ్‌శాఖ ఆధ్వర్యంలో బుధవారం వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం తదితర పోటీలను నిర్వహించారు. ఈమేరకు గణతంత్ర దినోత్సవం అనే అంశంపై పోటీలను మండల రిసోర్స్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిబేట్‌లో నందబలగ పాఠశాలకు చెందిన కె చంద్రశేఖర్ ప్రథమ, వెలగవలస జడ్పీ పాఠశాలకు చెందిన జి వౌళి ద్వితీయ స్థానం, చిత్రలేఖనంలో వెలగవలస పాఠశాలకు చెందిన భానుభాస్కర్ ప్రథమస్థానం, డి గదబవలస పాఠశాలకు చెందిన జె చంద్రశేఖర్ ద్వితీయ స్థానాలను సాధించారు. అలాగే వ్యాసరచన పోటీలలో నందబలగ పాఠశాలకు చెందిన కె చంద్రశేఖర్, వెలగవలస పాఠశాలకు చెందిన జి వౌనికలు ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. యుటీఎఫ్ మండలశాఖ అధ్యక్షులు జి మునిస్వామి పోటీలకు పర్యవేక్షకులుగా వ్యవహరించగా ట్రెజరర్ వంగపండు శంకరరావు, నాయకులు మరిశర్ల సింహాచలంనాయుడు, నల్ల అజయ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.