విజయనగరం

రేషన్‌కార్డుల ధరఖాస్తుల సాధికారిక సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జనవరి 23: ఇటీవల నిర్వహించిన జన్మభూమి మావూరు కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్‌కార్డుకోసం చేసుకొన్న ధరఖాస్తులను ప్రజాసాధికారిక సర్వే చేపట్టడం జరిగింది. ఈమేరకు బుధవారం సి ఎస్ డిటి ఎన్.వి.వి. ఎస్.మూర్తి వచ్చిన 117 ధరఖాస్తులను పరిశీలించి వివరాలను ఆన్‌లైన్ చేయడం జరిగింది. ప్రజా సాధికారిత సర్వేలో ధరఖాస్తుదారుల వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే రేషన్‌కార్డులను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలవారీగా ధరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ధరఖాస్తుదారులకు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరించామని తెలిపారు.

ఫించన్లు పంపిణీ అట్టహాసంగా జరపాలి
గజపతినగరం, జనవరి 23: సామాజిక భద్రత పించన్లును రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసినందున పంపిణీ కార్యక్రమాన్ని పిబ్రవరి ఒకటినుంచి మూడు తేదివరకు గ్రామాలలో అట్టహాసంగా పండగ వాతావరణంలో పంపిణీ చేయాలని మండల పంచాయతీ విస్తరణ అధికారి జి.జనార్ధనరావు అన్నారు. స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వితంతు, వృద్ధాప్య పించన్లు రెండువేలు, దివ్యాంగులకు మూడువేలకు పెంచడం జరిగిందన్నారు. అలాగే ఆదరణ-2 పధకానికి సంబందించి పనిముట్లును ఈనెల 29న మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి పంపిణీ చేస్తామని తెలిపారు. అదే విధంగా బిసి కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లుకు రుణాలు మంజూరుకు సంబందించి మెగామేళా అదేరోజున నిర్వహిస్తామని చెప్పారు. లబ్ధిదారులను అక్కడకు తీసుకురావాలని సూచించారు. అలాగే గ్రామపంచాయతీ వీధిలైట్లుకు సంబందించిన బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన విద్యుత్ బిల్లు బకాయిలు జమచేయాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సామాజిక సేవకుడు పైడిపునాయుడుకు సత్కారం
గజపతినగరం, జనవరి 23: పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సీతారారంపురం గ్రామానికి చెందిన బి.పైడిపునాయుడును జిల్లా విద్యాశాఖ అధికారిణి జి.నాగమణి మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ, హైదరాబాద్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన లైఫ్ స్కిల్స్‌తోపాటు కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్ధులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న పలువురిని ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారిణి జి.నాగమణి సత్కరించారు. అందులో భాగంగా ఉపాధ్యాయుడిగా, రచయితగా, మోటివేటర్‌గా, సమాజ సేవకుడిగా పలు రకాల సేవలు అందిస్తున్న అబ్దుల్ కలాం సేవా సమితి సేవలు అందించడమే కాకుండా మరుపల్లి హైస్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న సీతారాంపురం గ్రామానికి చెందిన బి.పైడినాయుడును డి ఇవొ నాగమణితోపాటు నిర్మాణ్ ఆర్గనైజేషన్ సి ఇవొ మయరా, విజయనగరం రోటరీక్లబ్ ప్రతినిధులు మేకా కాశీ, డాక్టర్ వెంకటేశ్వరావు తదితరులు మెమెంటో అందించి సత్కరించారు.
న్యాయవాదులకు ఫించను అమలు చేయాలి
గజపతినగరం, జనవరి 23: న్యాయవాదులకు పించను విధానం అమలు చేయాలని గజపతినగరం న్యాయవాదుల సంఘం అధ్యక్ష,కార్యదర్శిలు కూరెళ్ల నాగభూషణరావు, కె.ఎన్.ఎం.శర్మలు కోరారు. బుధవారం స్ధానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుకు రక్షణ లేనందున పించన్ విదానం అమలు చేస్తే వారికుటుంబాలకు న్యాయం చేసిన వారవుతారని తెలిపారు. న్యాయవాదులకు మేచింగ్ గ్రాంటు మంజూరు చేస్తూ న్యాయవాదులపట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తంచేశారు. ఇంతవరకు న్యాయవాదులకు బార్ కౌన్సిల్ తరపున వస్తున్న నాలుగు లక్షలకు ప్రభుత్వం అదనంగా మరో నాలుగు లక్షలు మేచింగ్‌గ్రాంటు కింద మంజూరు చేయడానికి మంత్రివర్గ నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రంభ శివహరనాధరావు, కలిశెట్టి రామునాయుడు, తాడ్డి ముత్యాలనాయుడు, తొత్తడి దేవుడుబాబు, గండి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

అమరమాతకు సైనిక సంపర్క్ పరామర్శ
బొండపల్లి, జనవరి 23: మండలంలోని గొల్లుపాలెం గ్రామానికి చెందిన సైనిక వీరుడు తొత్తడి కృష్ణ తల్లి కొత్తమ్మ ఆకస్మిక మరణం ఆ కుటుంబానికి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. బుధవారం ఆమెను జిల్లా నాయకులు, సైనిక సంక్షేమ సంఘం ప్రతి ఏడాది సత్కరించేది. మాజీ సైనికుల కుటుంబాల పరామర్శలో భాగంగా వీరమాత ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర బీజేపీ మాజీ సైనికుల సెల్ అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు ఆకుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కొత్తమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటరావు, సత్యారావు లక్ష్మణరావు,బీజేపీ నాయకులు ఎం. ఎస్. ఎన్.రాజు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్ధులకు వివిధ రకాల పోటీలు
గజపతినగరం, జనవరి 23: గణతంత్ర వేడకులను పురష్కరించుకొని విద్యార్ధులకు వివిధ రకాలపోటీలు బుధవారం స్ధానిక మండల వనరుల కేంద్రంలో నిర్వహించారు. విద్యార్ధులకు వ్యాసరచన, క్విజ్, డిబేట్ పోటీలు జరిపారు. వ్యాసరచన సీనియర్స్ విభాగంలో ఎల్. సాయి ఈశ్వరి ప్రథమ, పి. కోమలి ద్వితీయ స్థానాలు సాధించగా జూనియర్స్ విభాగంలో సి.హెచ్. వౌనికకు ప్రథమ, డి. నవ్యశ్రీకు ద్వితీయ బహుమతులు లభించాయి. చిత్రలేఖనం పోటీలో కె. భవ్య ప్రథమ స్థానం, కె.శ్రీనివాస్‌కు ద్వితీయ స్థానం లభించింది. వకృత్వ పోటీలో ఎం. గణేష్ ప్రథమ, ఎన్. స్వాతికి ద్వితీయ స్థానం లభించగా పద్యాల పోటీలో వి. భవానీకి ప్రథమ, డి. ధరణిలకు ద్వితీయ స్థానం లభించింది. విజేతలకు గణతంత్ర వేడుకల్లో బహుమతులు అందజేస్తారు.

మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
విజయనగరం (్ఫర్టు), జనవరి 23: పట్టణంలో ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మెగా జాబ్‌మేళాకు విశేషస్పందన లభించింది. ఈ జాబ్‌మేళాకు 1596 మంది నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. వీరిలో 356 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక కాగా మరో 219 మందిని తదుపరి రౌండ్ల ఇంటర్వ్యూలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డి జిల్లామేనేజర్ టి.చాముండేశ్వరరావుమాట్లాడుతూ నిరుద్యోగ యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నైపుణ్యం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశం లభిస్తుందని, అందువల్ల ప్రతీ ఒక్కరూ సిల్క్ డవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వం కల్పిసున్న అవకాశాలను, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువతీయువకులు నిరాశ, నిస్పృహా చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు.