విజయనగరం

దూరవస్థ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (టౌన్): జిల్లాకేంద్రంలో తల్లిపిల్లల వైద్యసేవల కోసం వందేళ్లకిందట ఘోషా ఆసుపత్రిని ఏర్పాటు చేసారు. కాలక్రమంలో ఈ ఆసుపత్రి వైద్యసేవలు జిల్లా తో పాటు సమీప పొరుగు జిల్లా విశాఖకు చెందిన మండలాలకు కూడా విస్తరించాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన గర్భిణీలకు ఈ ఆసుపత్రి విశేషంగా తన వైద్య సేవలను ప్రసవ సమయంలో అందిస్తున్నది. నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉన్నంతలో మాతా శిశువులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఇపుడు ఆసుపత్రి పడకల స్థాయి దాదాపుగా 150వరకు అందుబాటులో ఉన్నాయి. కానీ రోజూ 200మంది వైద్యసేవలకోసం జిల్లా నలుమూలల నుండి వస్తుంటారు. సమీప పద్మనాభం మండలం, ఏజెన్సీ నుండి కూడా ఇక్కడకే గర్భిణీలు వస్తారు. ఈనేపథ్యంలో ఈ ఆసుపత్రికి ఇటీవల కాలంలో గర్భిణుల సంఖ్య పెరిగింది. వైద్యులు సంఖ్య పెరగలేదు కానీ ఒపి , ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం మాతా శిశు ఆరోగ్యం, ఆసుపత్రి ప్రసవాలకు పెద్దపీట వేస్తూ 108 ఉచిత వైద్యసేవలు గర్భిణీలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ప్రసవం తరువాతగర్భిణీలు పుట్టింటికి పసికందుతో వెళ్లేందుకు ఇష్టపడక పోని కారణంగా ప్రభుత్వం ఇటీవల 102 వాహనాలను ఇందుకు ప్రవేశపెట్టింది. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌గా వీటికి పేరు పెట్టి ఇటీవల ఈ వాహన సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకు వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. జిల్లాకు దాదాపు 10 వరకు వాహనాలను మంజూరు చేసారు. ఇందులోభాగంగా ఘోషా ఆసుపత్రికి మూడు వాహనాలు ఇచ్చారు. రెండు మారుతీ , ఒక బొలేరో. అయితే రోజుకు కనీసం 200 మంది ఒపి ఉండే ఈ ఘోషా ఆసుపత్రిలో కనీసం 10 ప్రసవాలు అవుతున్నాయి. వీరిని క్షేమంగా ఇంటికి తీసుకు వెళ్లడానికి ప్రస్తుతం ఉన్న మూడు వాహనాలు ఎటూ చాలడంలేదు. తల్లి,బిడ్డను ఇంటివద్ద దిగబెట్టి రావడానికి దూరాన్ని బట్టి సమయం తీసుకుంటుంది. అంటే తరువాత మహిళను దింపడానికి సమయం పడుతోంది. సాయంత్రం 5 గంటల తరువాత ఇంటికి దింపడానికి నిబంధనలు అంగీకరించవు. ఈకారణంగా ఒకో సారి ప్రసవం అయిన బాలింతలు వారి స్వగ్రామాలు ఒకే దారిలో ఉన్నపుడు నలుగురు బాలింతలను తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించుకుని దింపవలసి వస్తున్నదని వాహనాలకు డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చెబుతున్నారు. రెండు రోజుల కిందట మెరక ముడిదాం మండలానికి ఇదేవిధంగా నలుగురుని తల్లులను దిగబెట్టారు. జిల్లా కేంద్రంలో ఎక్కడికయినా వారిని దింపిరావాలని , అయితే ఇందుకు తమకు అవసరమైన వాహనాలు ఉంటే మరింతగా సేవలు అందిస్తామని సిబ్బంది చెబుతున్నారు. మరో రెండు వాహనాలు ఉంటే కొంతవరకు సమస్యను అధిగమించ వచ్చని అంటున్నారు. త్వరలో ఆసుపత్రి స్థాయి 300 పడకలకు పెరగబోతున్నది. కొత్త బిల్డింగ్ పనులు పూర్తికావస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత ఆసుపత్రి అభివృద్ధి కమిటీపై ఉంది. ఇటీవల జిల్లా యంత్రాంగం మాతా శిశుసేవలపై నిర్వహించిన సమీక్షలో 102 వాహనాల సేవలపై ప్రజల్లో ఇంకాపూర్తిగా అవగాహన అంతగా లేదనే విషయం చర్చకు వచ్చింది. కాగా జిల్లా కేంద్రంలోని ఘోషాసుపత్రిలో రోజుకు కనీసం 10వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు చాలవని, అదనపు వాహనాలకోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఆసుపత్రి అభివృద్ధికమిటీ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తెలిపారు.

కాపుల రిజర్వేషన్లపై
ప్రభుత్వానికి చిత్తశుద్ధి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 3: కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తెలిపారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు అధికారికంగా కమిషన్‌ను ఏర్పాటు చేసారని అన్నారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులను అన్ని విధాలుగా ఆదుకునే క్రమంలోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించారని చెప్పారు. కానీ కాపుల రిజర్వేషన్లను రాజకీయం చేసి ప్రయోజనం పొందేందుకు వై ఎస్సార్ కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జి ఓ 30కి 20 సంవత్సరాలు గడిచిపోయిందని, అప్పటి నుంచి జి ఓ అమలుపై నోరుమెదపని ప్రతిపక్షాలు ఇప్పుడు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్‌పై ఏ వర్గం నుంచి వ్యతిరేకత రాకుండా చూసే ప్రయత్నంలో రిజర్వేషన్ల అమలుకు సమయం పడుతుందే తప్పా ప్రభుత్వానికి మరో ఉద్దేశ్యం లేదని చెప్పారు. కాపు రిజర్వేషన్ అమలు కోసం శాంతియుత పద్ధ్దతిలో ఆందోళన చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదని, కానీ రిజర్వేషన్ల అమలు పేరిట హింసాత్మక చర్యలకు దిగడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విలేఖరులు సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్ చైర్మన్ మురళీమోహన్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడు పాల్గొన్నారు.

దుర్గంధభరితం!
విజయనగరం (టౌన్), ఫిబ్రవరి 3: విజయనగరం పట్టణంలో పలు శివారు కాలనీలు అనేక సమస్యలతో సతమత మవుతున్నాయి. పంచాయతీలనుండి మున్సిపాల్టీలోకి విలీన మైన గ్రామాల్లో ఇప్పటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగా తిష్టవేసాయి. 2006లో విజయనగరం మండలంలోని కణపాక, గాజులరేగ, ధర్మపురి, కెఎల్ పురం ,జమ్ము వంటి గ్రామాలు పురపాలికలోకి విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీలుగా ఉన్నపుడు నిర్మించిన కాలువలు, మురికి నీరుపోయే డ్రైనులు పూడుకు పోయి మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఇదిలా ఉంటే కణపాక ఆర్టీసీ కాలనీలో ఉడా ఫేజ్ -1ని ఆనుకుని ఉండే ఆర్టీసీ కాలనీలో నీళ్లట్యాంకునుండి కిందకు సగం వరకే మురికి నీరు పోయే కాలువలను నిర్మించి మిగిలిన భాగాన్ని అసంపూర్తిగా వదిలేసారు. ఆర్టీసీ కాలనీనుండి వెళ్లే ఈ మురుగు కాలువ గుండానే ఉడా కాలనీ ఫేజ్ -1 కాలనీ వాసులు వినియోగించే వాడుక నీరు పోతోంది. పైనుంచి వచ్చే నీరు పోయే సరైన విధంగా కాలువ సిసి నిర్మాణం కాకపోవడంతో మురికి కంపు దుర్వాసన వెదజల్లుతూ దుర్గంధ భరితంగా మారి సమీప నివాసులకు ఇబ్బంది కరంగా పరిణమించింది. దీనికి తోడు నిత్యం పందులు , కుక్కలు ఈకాలువలో స్వైరవిహారం చేస్తుంటాయి. పైనుండి కాలువలో కొట్టుకు వచ్చే చెత్త ఎక్కడి కక్కడ నిలబడి వర్షాకాలంలో కురిసే వానలకు కాలువ పొంగి రహదారిపైకి ప్రవహించడం జరుగుతున్నా కనీసం పట్టింపులేదు. వానాకాలంలో చెరవునీరు, వాడుకనీరు కలిసి చుట్టుపక్కల నివసించే వారి ఇళ్లల్లోకి అపుడపుడూ పామలు లోపలికి వస్తున్న సందర్భాలు అనేకం. దీంతో మహిళలు ఈపాములతో సహవాసం చేయలేక భయంతో బితుకు బితుకు మంటూ జీవిస్తున్నారు. రాత్రిపూట ఈభయం మరీ ఎక్కువగా వారికి ఉంటున్నది. ఆర్టీసీ కాలనీనుండి అసంపూర్తిగా వదిలేసిన ప్రదేశంనుంచి బరియల్ గ్రౌండువరకు పక్కా మురికి కాలువ నిర్మించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ రామకృష్ట వార్డు పర్యటనలకు వచ్చిన సందర్భంలో చూడటం మినహా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కనీసం పూడుకు పోయిన కాలువలో పూడికను తొలగించిన దాఖలాలు లేనేలేవు. పంచాయితీ నుండి పురపాలనలోకి వచ్చినా, ఇపుడు నగర పాలికగా మారినా ఈసమస్య ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

విద్యాసంస్థల బంద్
విజయనగరం (టౌన్), ఫిబ్రవరి 3: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం పట్టణంలో వివిధ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ప్రెవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కాలేజిలు , ప్రభుత్వ పాఠశాలలను బంద్‌కు సహకరించాలని విద్యార్థి సంఘాలు ర్యాలీగా పట్టణంలో తిరుగుతూ ఆయా పాఠశాలలను, విద్యాసంస్ధలను మూసివేయించారు. కొందరు ప్రెవేట్ పాఠశాల యాజమాన్యాలు ముందుగానే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరికొన్ని సంస్థలు సెలవు ఇవ్వకుండా తరగతులు నిర్వహించాయి. ఆయాపాఠశాలల వద్దకు, కాలేజిల వద్దకు వెళ్లి విద్యార్ధి సంఘాలు బంద్‌కు సహకరించాలని విద్యార్ధులను తరగతులను బహిష్కరించాలని కోరారు. పిఎస్‌ఆర్ కాంప్లెక్స్, మయూరి కూడలి, మహారాజా విద్యాసంస్థలు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని విద్యాసంస్థల వద్దకు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘం నాయకులు వెళ్లి మూసివేయించారు. విద్యార్ధుల బంద్ నేపథ్యంలో పట్టణ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఆయా విద్యాసంస్థల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తునిర్వహించి విద్యార్ధి సంఘ నాయకులతో పాటే అనుసరించారు. మొత్తం మీద బంద్ ప్రశాంతంగా జరిగింది.

ఉపాధి పనులు పరిశీలన
నెల్లిమర్ల, ఫిబ్రవరి 3: మండలంలోని మొయిద గ్రామంలో బుధవారం నిర్వహిస్తున్న ఉపాధిపనులను డ్వామా పిడి ప్రశాంతి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ఉపాధి పనులు చేపడితే వేతనదారులకు కూలీ గిట్టుబాటు అవుతుందని చెప్పారు. చెరువుల్లో నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో తోటలు, కాలువల్లో పనులు చేపట్టాలని అన్నారు. రోజుకు ఎనిమిది గంటలు పనులు నిర్వాహిస్తే వేతనదారులుకు కూలీ గిట్టుబాటు అవుతుందని చెప్పారు. వేతనదారులు, మేట్లు వీధిగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టుకోవాలని కోరారు. జాబ్‌కార్డులు ఉన్నవారు అందరికీ క్షేత్రసహాయకులు పనులు కల్పించాలని అన్నారు. జాబ్‌కార్డులేని వారు దరఖాస్తు చేసుకుంటే 15రోజుల్లో జాబ్‌కార్డు అందజేస్తామని తెలిపారు. గ్రామాల్లో ప్రాధాన్యతను బట్టి ఉపాధిపనులు నిర్వహించుకోవాలని అన్నారు.
చేపల వ్యాపారంతో ఆర్థికాభివృద్ది
గజపతినగరం, పిబ్రవరి 3: చేపల వ్యాపారంతో గ్రామైఖ్య సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలని ఎన్ పి ఎం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఆదయ్య కోరారు. బుధవారం మండలంలోని లోగిస గ్రామంలోని బలభద్రసాగరం చేపల చెరువును డిపి ఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్సశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పెద్ద చేపలను తీసి విక్రయించుకోవాలని సూచించారు. ఏప్రిల్ వరకు సమయం ఉన్నందున చిన్న పిల్లలను పెంచుకోవాలని సూచించారు. వెలుగు ఎపి ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ చెరువులో 33 వేల చేపపిల్లలు పెంచుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్ ఎఫ్ ఐ ధర్నా విజయవంతం
చీపురుపల్లి, ఫిబ్రవరి 3: ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా విజయవంతం అయ్యింది. పట్టణంలో గల అన్ని విద్యాసంస్థలు అన్ని మూత పడ్డాయి. ఈ సందర్భంగా పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. రోహిత్ మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. ఎస్ ఎఫ్ ఐ పిలుపుమేరకు రవీంద్రభారతి, సిద్ధార్థ తదితర కళాశాలలు మూసి వేసారు. కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ ప్రతినిధులు శ్రీను, రాంబాబు, సీతారం తదితరులు పాల్గొన్నారు.
మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు
* ఆంధ్రభూమి వార్తకు స్పందన
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 3: నగరంలో మంచినీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం కొత్త అగ్రహారం వాటర్ ట్యాంకును పరిశీలించారు. మంచినీటి సరఫరాపై ఆరా తీశారు. ఈ నెల ఒకటో తేదీన ‘పట్టించుకోకుంటే అవస్థలే’ అనే శీర్షికతో ఆంధ్రభూమిలో వచ్చిన వార్తపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ముషిడిపల్లి, నెల్లిమర్ల, రామతీర్థం వాటర్ వర్క్స్ నుంచి నగరానికి మంచినీటి సరఫరా జరుగుతోందని అన్నారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చంపావతి నది ఎండిపోవడంతో నెల్లిమర్ల, రామతీర్థం వాటర్‌వర్క్స్‌లో నీటి మట్టాలు పడిపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలో మంచి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముషిడిపల్లి వాటర్‌వర్క్స్ నుంచి కంటోనె్మంట్ వాటర్ ట్యాంకు ద్వారా కొత్తఅగ్రహారం వాటర్ ట్యాంకు మీదుగా కొత్తపేట నీళ్ల ట్యాంకుకు నీటి పంపింగ్ చేసేందుకు ప్రధాన పైపులైన్లను అనుసంధానం చేస్తామని తెలిపారు. దీనివల్ల కొన్ని వాటర్‌వర్క్స్ పరిధిలో నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడే మిగతా వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేయవచ్చునని చెప్పారు.

శంబర మారుజాతర ఆదాయం లెక్కింపు
మక్కువ, ఫిబ్రవరి 3: శంబర శ్రీపోలమాంబ మారు జాతరకు సంబంధించి ఆదాయం 10,12,686 రూపాయలు వచ్చినట్టు దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి రోణంకి నాగార్జున తెలిపారు. శంబర ప్రధాన ఆలయంలో మారుజాతర ఆదాయంను బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక దర్శనం 10 రూపాయల టిక్కెట్ల ద్వారా రూ.1,29,870లు, శీఘ్రదర్శనం 30 రూపాయల టిక్కెట్టు ద్వారా రూ. 2,01, 270లు, కేశఖండన ద్వారా రూ.8,950లు, ప్రధాన ఆలయం, వనంగుడి హుండీల ద్వారా రూ.4, 33,815లు, లడ్డు ప్రసాదం అమ్మకం ద్వారా రూ.1,48,510లు, పులిహోర ద్వారా రూ. 67,145లు, అన్నదానం డొనేషన్లు ద్వారా రూ.23,126ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
చిత్తడినేలలను కాపాడుకోవాలి
విజయనగరం (పూల్‌బాగ్),్ఫబ్రవరి 3: ఈరోజుల్లో మానవాళి అనేక సమస్యలను ఎదుర్కుంటుందని , చిత్తడి నేలలను కాపాడుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చునని శ్రీకాకుళం అగ్రికల్చర్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ పి.గురుమూర్తి అన్నారు.పట్టణంలోని పూల్‌బాగ్‌లో ఉన్న మహారాజా పిజి కళాశాలలో ప్రపంచ వెట్‌ల్యాండ్ డేను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల సంచాలకులు ప్రొఫెసర్ సాగి సన్యాసిరాజు, ప్రొఫెసర్ డిఆర్‌కె రాజు, డాక్టర్ కృష్ణకిశోర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సైనిక్‌స్కూల్‌లో క్రాస్ కంట్రీ పోటీలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 3: కోరుకొండ సైనిక్‌స్కూల్‌లో క్రాస్‌కంట్రీ కార్యక్రమంలో భాగంగా బుధవారం తొమ్మిది, పది, ఇంటర్ విద్యార్థులకు ఏడు కిలోమీటర్ల పరుగుపందెం, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు ఐదు కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ప్రతిఏటా మూడుసార్లు ఈ పోటీలు నిర్వహిస్తారు. కళాశాల క్రీడమైదానం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం కొమరం గ్రామం మీదుగా తిరిగి పాఠశాలకు చేరుకుంది. ఈ పోటీల్లో విద్యార్థులు కిరణ్‌కుమార్ మొదటి స్థానం, బాదల్‌కుమార్ రెండవ స్థానం, గోపాల్ చరణ్ మూడవస్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలకు ప్రశంసాపత్రాలు అందచేసిన సందర్భంగా ప్రిన్సిపల్ గ్రూప్ కెప్టెన్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైన కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. క్రీడలవలన మానసిక స్థైర్యం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రవీణ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

చీపురుపల్లి, ఫిబ్రవరి 3: గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ( ఆర్ ఇ సి ఎస్) అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంతి అన్నారు. బుధవారం స్థానిక ఆర్ ఇ సి ఎస్ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అభివృద్ది, బిల్లుల ఆమోదంపై సంస్థ కార్యవర్గ సభ్యులతో చర్చించారు. సంస్థ పరిధిలో 147 మంది రైతులు వ్యవసాయం కోసం విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్నారని గుర్తించామని చెప్పారు. అక్రమ వినియోగదారులు డబ్బుచెల్లిస్తే వారికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నవారికి కనెక్షన్ మంజూరు చేస్తామన్న రైతులు ఎందుకు ముందుకు రావడం లేదని ఎండి సభ్యులను ప్రశ్నించారు. సంస్థ పరిధిలో ఎంతో కాలంగా పనిచేస్తున్న సిబ్బందిని సిజె ఎల్ ఎంగా పదోన్నతి కల్పించాలంటు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అన్నారు. సిబ్బందికి 15 శాతం పిట్‌మెంటును తక్షణమే పెంచుతామని చెప్పారు. సంస్థ పరిధిలో విద్యుత్ చౌర్యంతో విజిలెన్స్ పర్యవేక్షణ కోసం ట్రాన్స్‌కోని సంప్రదించగా సాంకేతిక పరమైన అడ్డంకులు వచ్చాయని అన్నారు. విజిలెన్స్ ఏర్పాటుకు సంస్థ పరిధి అటంకంగా మారిందన్నారు. ఎపి ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులు ఆర్ ఇసి ఎస్ పరిధిలో కేసులు రాస్తే చెల్లవని చెప్పారు. ఇందుకోసం కో- ఆపరేటివ్ రిజస్టర్ అనుమతి పొంది విజిలెన్స్ అధికారులు నియామకం చేసుకోవాలని అన్నారు. సంస్థను మోనటరింగ్ చేసే హక్కు అధికారం ఎవరికీ లేదన్నారు. సంస్థ పరిధిలో పెండింగ్ లో ఉన్న బిల్లులు బకాయిలు వేగవంతానికి కృషి చేయాలని అన్నారు. అన్ని రంగాల్లోను సంస్థను ముందుకు నడిపిస్తే సభ్యులకు మరిన్ని మెరుగైన సేవలు అందించగలమని చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ దన్నాన రామచంద్రుడు, వైస్‌చైర్మన్ సారిపాక సురేష్ సభ్యులు పైడితల్లి, నాగరాజు, రామారావు, శ్రీ్ధర్ మేనేజర్ సుధాకర్ , ఎడి వర్మ తదితరులు పాల్గొన్నారు.