విజయనగరం

రామతీర్థం దేవస్థానం అభివృద్ధి పనులు శరవేగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, మే 16: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానం అభివృద్ధి పను లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తు తం 58.5 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆలయ ఇఓ బాబురావు తెలిపారు. తూర్పు రాజగోపురం, ఉత్తర రాజగోపురం, ప్లాస్టింగ్ పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా రామకోనేరు పూడికతీత పనులకు మొదటవిడతగా 9.8లక్షలు నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులు వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రెండు జెసిబిలు, పది ట్రాక్టర్లతో యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. దేవాలయ నిర్మాణ ఆనవాలు ఉండే విధంగా పనులు చేస్తున్నారు. ఉత్తర రాజగోపురం పనులు ఇప్పటికే పూర్తయినా కొన్ని హంగులు తెస్తున్నారు. తూర్పు రాజగోపురం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ పనులను కూడా త్వరలో చేపడతామని దేవస్థానం అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే సర్వాంగ సుందరంగా తయారవడం ఖాయం. ఇప్పటికే శ్రీరామ నవమి ఉత్సవాలకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. రామతీర్థాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిచేయడానికి దేవాదాయ శాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. రామతీర్థం దేవస్థానం పరిసర ప్రాంతంలో కోదండరాముని ఆలయం, బౌద్ధ ఆనవాలు ఉండడం వీటిని దర్శించడానికి కార్తీకమాసంలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు. రామకోనేరును అభివృద్ధిచేసి గట్టును చదునుచేసి పార్కులా తయారుచేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దేవస్థానం అభివృద్ధికి పంపించి ప్రతిపాదనలకు దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేస్తే రామతీర్థం సర్వాంగసుందరంగా మారే అవకాశాలు ఉన్నాయి.