విజయనగరం

టిడిపితో అందరికీ సమన్యాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 16: విభజ న అనంతరం రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యదక్షతతో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమరీతిలో అమలుచేస్తున్నారని ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. సోమవారం ఐఎంఎ హాలుల్లో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సైలాడ త్రినాథ్ అధ్యక్షతన విజయనగరం నియోజకవర్గ మినీ మహానాడు సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లి, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఎన్టీ ఆర్ భరోసా, చంద్రన్న బాట, రేషన్‌కార్డులు, అర్హులకు ఇళ్లు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా సామాజిక వర్గాలకు చేయూత వంటి సంక్షేమ కార్యక్రమాలను గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. గత పాలకులు పదేళ్లు నిద్రపోయి ఇపుడు తెలివితెచ్చుకుని పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని అన్నారు. విజయనగరం మంచినీటి సమస్య పరిష్కరించడానికి రామతీర్థ సాగర్ ప్రాజెక్టు వేగవంతంగాపూర్తిచేయాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. నియోజకవర్గ సమస్యలను ఆయా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి అనుక్షణం ప్రజాసమస్యల పరిష్కారం కోసం పారదర్శకంగా పాలన అందిస్తున్నామని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బిజెపి నాయకత్వం తొందరపాటు మాటలు విడనాడి ఐదేళ్లుకాదు పదేళ్లు ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన మాటపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో జూట్ కార్మికులు పరిశ్రమలు మూతపడి ఇబ్బందులు పడుతున్నారని మిల్లు తెరిపించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. స్థానిక ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఏపార్టీ బాగుంటే ఆపార్టీలో చేరి అక్రమ సంపాదనను కాపాడుకోవడమే వారి ధ్యేయమని ప్రజల బాగోగులు వారికి పట్టవని అన్నారు. పురపాలక సంఘంలో 60కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని, ఏడు కోట్ల రూపాయల పనులు పూర్తిచేసామని మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ తెలిపారు. అయితే పనులు కొంచెం నత్తనడకగా ఉన్న విషయాన్ని అంగీకరిస్తూ ప్రజల సహకారంతో అమృత్ పథకం కింద 16వేల కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు. అనాధరైజ్‌డ్ కుళాయిలు క్రమబద్ధీకరించుకునేందుకు 16,17,18తేదీలలో అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ మినీ మహానాడులో పార్టీ నాయకులు ఎస్‌ఎన్‌ఎం రాజు, ముత్యాలరావు, విజ్జపు ప్రసాద్, ఎంపిపి ధనలక్ష్మి, జడ్పీటీసీ రమణ, మండల పార్టీ అధ్యక్షుడు బొద్దుల నరిసింగరావు, మైనార్టీ విభాగం నాయకుడు భాషా, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కన్వీనర్ పేరి రామయ్య, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.