విజయనగరం

గ్రామాల్లో రాజుకుంటున్న ఎన్నికల వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరకముడిదాం, ఫిబ్రవరి 14: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంటుంది. మెరకముడిదాం మండలం తెలుగుదేశం పార్టి ఆవిర్భాం నుండి పార్టికి కంచుకోటలా ఉండేది. మెరకముడిదాం మండలం తెర్లాం నియోజకవర్గంలో ఉన్నప్పుడు, నియోజకవర్గాల కుదింపు అనంతరం చీపురుపల్లిలో విలీనం అయినప్పటికీ అభ్యర్దుల గెలుపు ఓటమిలను నిర్దారించడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. అయితే గత కొనే్నల్లగా మారిన రాజకీయ సమీకరణాలు అయితేనేం స్థానిక నేతల పార్టి పిరాయింపులు అయితేనేం కాంగ్రెస్ ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు మండలంలో తమ ఉనికిని చాటు కున్నాయి. ఈ నేపద్యంలోనే గత రెండు పర్యాయాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి ఆ తరువాత వైకాపా ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం అతి కష్టం మీద తెలుగుదేశం పార్టి మండలాన్ని కైవసం చేసుకసుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుత రాజకీయ విశే్లషకుల అంచనాలకు అందుబాటులో ఓటరు నాడి లేన్నప్పటికి గ్రామాల్లో రాజకీయ అలజడి మాత్రం కనిపిస్తుంది. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు నియోజకవర్గం అభ్యర్ధులను ఎంపిక చేస్తే మండలంలో మరింత రాజకీయవేడి మొదలవుతుందని విశే్లషకుల అంచనా
దీక్షలపేరుతో ప్రజలకుదగా:వైకాపా
చీపురుపల్లి, ఫిబ్రవరి 14: తెలుగుదేశం ప్రభుత్వం దీక్షల పేరుతో ప్రజలకు దగా చేస్తోందని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంత్‌లు విమర్శించారు. గురువారం మండలంలోని పర్ల గ్రామంలో నిర్వహించిన బూత్ కమిటీ నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బిజేపీ ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీపై నవనిర్మాణదీక్ష అని, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని బీజేపీపై ధర్మపోరాటదీక్ష అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగిస్తూ నాలుగేళ్ల తొమ్మిదినెలల పాటు కాలయాపన చేసిందని ఎద్దేవాచేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు పట్టని అభివృద్ధి ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యే మృణాళిని హడావుడి చేస్తూ ఇంటింటికి కుళాయి కనెక్షన్‌లకు శంకుస్థాపనులు, ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజాసమస్యల పట్టించుకోని ఎమ్మెల్యేకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెబుతారని అన్నారు. తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలతో కుటుంబంలోని అందరికీ లబ్దిచేకూరనుందని, నవరత్నాలపై విస్త్రృత ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాము, పి జనార్ధన్, కామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
పాడిరైతుకు ధీమాతో ఆర్ధికంగా భరోసా
చీపురుపల్లి, ఫిబ్రవరి 14:ప్రభుత్వం అమలు చేస్తున్న 3పాడిరైతుకుధీమా2 పథకం పాడిరైతులకు ఆర్ధికంగా భరోసా లభించనున్నట్టు పశువైద్యశాఖ సహాయ సంచాలకులు, శిక్షణాధికారి కె వెంకటరమణ అన్నారు. స్ధానిక ప్రాంతీయ పశువైద్యశాల కార్యాలయ ఆవరణలో చీపురుపల్లి, మెరకముడిదాం మండలాల గ్రామస్థాయి సమన్వయకర్తలు, గోపాల మిత్రులు, పశుమిత్ర, పశు సభ్యులకు గురువారం నిర్వహించిన శిక్షణాకార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి వీటికి క్లస్టర్‌స్థాయి సమన్వయకర్తలను నియమించడం జరుగుతుందన్నారు. పశుసంవర్ధకశాఖ పలు పథకాలను ఒకేతాటిపైకి తీసుకువచ్చి 3పాడిరైతుకుధీమా2 పథకం ద్వారా అందించనున్నట్టు తెలిపారు. వీటిలో పశు ఆహారభద్రత, ఆరోగ్యభద్రత, పశుసంరక్షణ, పశుజాతుల అభివృద్ధి, పాడిపశువుల మరణానికి నష్టపరిహారం ఇవ్వడం ఉంటాయన్నారు. కిలో రూ.1కి పచ్చగడ్డి, రూ.2కి పాతరగడ్డి, రూ.3.50దాణామృతం, రూ.4కి సమీకృతదాణా, రూ.3కి ఎండుగడ్డి అందివ్వనున్నట్టు చెప్పారు. నట్టల నివారణ మందులు, ఎద ఇంజక్షన్‌లు వేయడం, మినీ గోకులాల నిర్మాణం వంటి అంశాలను అమలు చేయనున్నట్టు వివరించారు. విపత్తులవలన, ప్రమాదాలబారిన పడి, నయంకాని జబ్బులతో మరణించిన పాడిపశువులకు నష్టపరిహారం అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో పశువైద్య సహాయ సంచాలకులు డి శ్రీనివాసరావు, పశువైద్యులు టి మోహనరావు, శనపతి సతీష్, బాల సందీప్, పశువైద్య సిబ్బంది నవీన్, లక్ష్మీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికతో చదివితే లక్ష్యాలు సాధ్యం
పూసపాటిరేగ, ఫిబ్రవరి 14: విద్యార్థినులు భయం, ఆందోళన పడకుండా ప్రణాళికలతో చదివితే లక్ష్యాలను సాధించవచ్చునని ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ ఎ.వి. రాజశేఖర్ అన్నారు. గురువారం పూసపాటిరేగ కస్తూరీభా పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్టు రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థినులు ఇప్పటి నుంచే ప్రణాళికలతో చదివితే లక్ష్యాలను సాధించుకోగలుతారని అన్నారు. పరీక్షలు దగ్గర పడే కొద్దీ విద్యార్థినులకు భయం వెంటాడుతుందని, ధైర్యంతో, ఏకాగ్రతతో విద్యార్థినులు చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారని చెప్పారు. అంతకుముందు పరీక్షల్లో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పరీక్షలు రాసే విధానంలో కొన్ని సూచనలు, సలహాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయినులు పాల్గొన్నారు.