విజయనగరం

జిల్లాలో వెయ్యి కోట్లతో ఇంటింటికి కుళాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), ఫిబ్రవరి 15: జిల్లాలో వెయ్యి కోట్లతో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర భూగర్భ గనులశాఖామంత్రి ఆర్‌వి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న 36 గ్రామాలకు స్వజల్ పథకానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పూర్తిస్థాయిలో ప్రజలకు మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఇంటింటికి కుళాయిలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల నిదులను కూడా మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లో ఉన్న 36గ్రామాలకు స్వజల్ పథకం ద్వారా రక్షిత మంచినీటి పథకాలకు 8కోట్ల 69లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమపథకాలను అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అదేవిధంగా రాముడువలస, శివడవలస గ్రామాల మధ్యలో ఉన్న ముత్తాయివలస వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు శంకుస్థాపన చేశారు. 37లక్షల రూపాయలతో పనులను చేపట్టడం జరుగుతుందని, తద్వారా ఆయాగ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరందేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్, నియోజకవర్గం ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ గుర్తించుకునేవిధంగా వివిధ సంక్షేమపథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ తెలుగుదేశం ప్రభుత్వానికే చేయూతనందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ సభ్యులు తూముల భాస్కరరావు, మాజీ ఎంపీపీ తమ్మిరెడ్డి దామోదరరావు, మండల టీడీపీ అధ్యక్షులు అల్లాడ భాస్కరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ డీఇ పీఎంకె రెడ్డి, జెఇ పప్పల శంకరరావుతోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన
బొబ్బిలి(రూరల్), ఫిబ్రవరి 15: ఈవీఎంలపై ఎప్పటికప్పుడు ఓటర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరి అన్నారు. మండలం జె రంగరాయపురం గ్రామంలో శుక్రవారం ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఏవిధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. వృద్ధులకు కూడా వీటిపై ముందుగా అవగాహన కల్పిస్తే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసుకునేందుకు సులువుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా ఆయా గ్రామాల్లో దండోరా ద్వారా ప్రజలకు సమాచారం అందించడం జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేయరాదన్నారు. యువతీయువకులకు కూడా వీటిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వీటిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈమెతోపాటు వీఆర్‌ఓ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అమర జవాన్లకు జోహార్లు
బొబ్బిలి(రూరల్), ఫిబ్రవరి 15: ఉగ్రవాదులను ఉరితీసేంతవరకు ప్రతీ ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఎంతైన ఉందని నారాయణప్పవలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెసి రాజు అన్నారు. జమ్మూకాశ్మీరులోని పుల్వమ జిల్లాలో అవాంతిపుర వద్ద సీ ఆర్‌పీ ఎఫ్ కాన్వయ్‌పై ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిని నిరసిస్తు గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేసి అందుకు కారకులైన ఉగ్రవాదులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తు వౌనం పాటించారు. కేంద్ర ప్రభుత్వం జవాన్ల కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అర్హులైన గిరిజనులకు పింఛన్ల మంజూరెప్పుడు?

బొబ్బిలి(రూరల్), ఫిబ్రవరి 15: అర్హులైన గిరిజనులకు పింఛన్లు ఎప్పుడు మంజూరుచేస్తారని మండలం మోసూరువలస గ్రామానికి చెందిన గిరిజనులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈమేరకు మండల పరిషత్ కార్యాలయం వద్ద పింఛన్లు మంజూరుచేయాలని శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. ఈసందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ అనర్హులకు ప్రభుత్వ పథకాలను మంజూరుచేస్తున్నారని, అర్హులకు ఎప్పుడు పింఛన్లు మంజూరుచేస్తారని ప్రశ్నించారు. పాలకులు, అధికారులు గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కనిపిస్తారే తప్ప మిగిలిన రోజుల్లో గ్రామాలవైపు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్న ఎవరికి తెలియజేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొందని వాపోయారు. 50 సంవత్సరాలు ఉన్న గిరిజనులకు పింఛన్లు మంజూరు చేయమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అధికారులు ఎందుకు తాత్సర్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంతోపాటు అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమపథకాలను అందించాలని డిమాండ్ చేశారు.

బొత్స, చినశ్రీను అవినీతి చక్రవర్తులు
*గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణ తీవ్ర ఆరోపణ

రామభద్రపురం, ఫిబ్రవరి 15: జిల్లాలో అవినీతి చక్రవర్తులుగా ముద్రపడిన బొత్స సత్యనారాయణ, చిన శ్రీనులు వేరొకరిపై అవినీతి ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని రాష్ట్ర భూగర్భ గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు ఎద్దేవా చేశారు. మండల పరిధిలోని ఎస్ సీతారాంపురం గ్రామంలో ఎస్సీ సొసైటీ ద్వారా 56మంది రైతులకు 44.5 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్నివిధాలా దోచుకోవడమే కాకుండా ఓక్స్‌వేగన్ వంటి విదేశీ సంస్థల నుంచి కూడా ముడుపులు అందుకున్న బొత్స కుటుంబం వేరొకరిపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాలో వీరు చేసిన అవినీతి వలన జిల్లాకే చెడ్డపేరు వచ్చిందని, ఇటువంటి వ్యక్తులు జిల్లాలో ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎంతో పారదర్శకంగా షెడ్యూల్డ్ కులాలకు భూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దానిని కూడా రాజకీయం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ కూలీలను రైతులుగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సుమారు 6కోట్ల రూపాయలు విలువ చేసే ఆయిల్‌పామ్ తోటలను షెడ్యూల్డ్ కులాలకు అప్పగించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి తాము కంకణం కట్టుకున్నామన్నారు. ఈమేరకు లబ్ధిదారులు ఈ ఆయిల్‌పామ్ తోటలను అభివృద్ధి చేసి తద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలన్నారు. భూములకు సాగునీరు, తదితర సమస్యలను పరిష్కరించేందుకు లబ్ధిదారులందరినీ ఒక సొసైటీగా ఏర్పాటుచేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసి రీజనల్ ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ అణగారిన వర్గాలను అభివృద్ధి చేయాలన్న ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతైన అవసరమన్నారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి సుజయ్‌కృష్ణరంగరావుకు ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఎస్సీ సొసైటీ ఇడీ సునీల్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సొసైటీ ద్వారా అందించిన భూములను లబ్ధిదారులు ఎవరికీ విక్రయించరాదన్నారు. ఇందులో వచ్చే ఫలసాయంతో అభివృద్ధి సాధించాలన్నారు. 56మంది లబ్ధిదారులను సొసైటీగా ఏర్పాటుచేసి విద్యుత్, మంచినీటి బోర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా మంత్రి సుజయ్‌కు మండల టీడీపీ అధ్యక్షులు కర్రోతు తిరుపతిరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికి హారతులందించారు. అదేవిధంగా భూసాయవలస గ్రామంలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని మంత్రి సుజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తూముల భాస్కరరావు, చింతల వసుంధర, బోయిన లూర్థమ్మ, ఎం తిరుపతిరావు, సిహెచ్ రామకృష్ణ, మమ్ముల తిరుపతిరావు, అల్లాడ భాస్కరరావు, లక్ష్మునాయుడు, ఎంపీడీఓ మురళీకృష్ణ, పీఆర్‌ఏఇ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం

తెర్లాం, ఫిబ్రవరి 15: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలుచేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు కోరారు. మండలం లోచర్ల గ్రామ సమీపంలో శుక్రవారం లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుంచే లోచర్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఏర్పాటు చేయాలని, రైతుల కోరిక మేరకు ఈ పథకాన్ని మంజూరుచేశామన్నారు. ఈ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి రైతులకు సాగునీరందించేలా కృషి చేస్తామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే లోచర్ల, కవిరాయునివలస, ఆమిటి, సతివాడ, తదితర గ్రామాలకు చెందిన వ్యవసాయభూములకు సాగునీరు అందుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరుచేశారని, ఇందుకు ప్రజలంతా టీడీపీ ప్రభుత్వాన్ని బలపర్చాలన్నారు. తమ నియోజకవర్గంలో పరిధిలో సుమారు 70కోట్ల రూపాయల నిదులను మంజూరుచేశారన్నారు. వీటన్నింటికీ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ ఇతర పార్టీలు ఎరవేసిన వాటిని తిప్పికొట్టాలని, వారి ప్రలోభాలకు ఎవరూ లోనుకాకుండా ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు నర్సుపల్లి వెంకటినాయుడు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో కంటే రానున్న ఎన్నికల్లో అధిక మెజార్టీలో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. తెర్లాం మండలానికి మంత్రి చొరవతో 7కోట్ల రూపాయలకు పైగా నిదులు మంజూరుచేయడం ఎంతో హర్షణీయమన్నారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమపథకాలను అర్హులైన వారందరికీ అందజేస్తున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాజకీయాలకతీతంగా అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రెడ్డి గౌరీశ్వరి, టి రాములమ్మ, సీనియర్ నాయకులు ఎం యుగంధర్, ఎస్ శశిభూషణరావు, ఎం శంకరరావుతోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మరిశర్ల సేవలు మరువరానివి
తెర్లాం, ఫిబ్రవరి 15: మండలం కుమ్మరిపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసి బదిలీపై వెళుతున్న మరిశర్ల సింహాచలంనాయుడు విద్యా సేవలు మరువరానివని ఎంఇఓ లక్ష్మణరావు కొనియాడారు. మరిశర్ల సింహాచలంనాయుడు జాతీయస్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయిలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందారని, ఈయన్ను ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు కూడా సింహాచలంనాయుడు సేవలను కొనియాడారు. అనంతరం సింహాచలంనాయుడును దుస్సాలువాతో కప్పి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సింహాచలంనాయుడు మాట్లాడుతూ తనను ఇంత ఘనంగా సన్మానించి సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, మీరు చూపిన ఆదారాభిమానాలను ఎప్పటికీ మరువనన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలి

తెర్లాం, ఫిబ్రవరి 15: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు కోరారు. మండలం పెరుమాళి ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూడా తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించానన్నారు. అనంతరం మండలంలోని పలు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఓటువేయాలని కోరారు. ఈమేరకు 9 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు నిర్వహించే వీడ్కోల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శపాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ కాలనీలో దశలవారీగా అభివృద్ధి పనులు చేస్తాం

బొబ్బిలి, ఫిబ్రవరి 15: పట్టణ పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. సిమెంట్ కాలువల నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలువ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కాలనీలో పలు సమస్యలున్నట్లు కాలనీవాసుల నుంచి పలు వినతిపత్రాలు అందాయని, దశల వారీగా వాటిని పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే ప్రధాన రహదారులు, కాలువల ఏర్పాటుతోపాటు వీధి దీపాలను వేశామన్నారు. మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలాజీ ప్రసాద్‌తోపాటు డీఇ మహేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి

బొబ్బిలి, ఫిబ్రవరి 15: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ఛైర్‌పర్సన్ అచ్యుతవల్లి కోరారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ ప్రవచన మండపంలో మహిళా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు మహిళలు తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఒక్కరిలోను భక్త్భివాలను పెంపొందించాల్సిన ఆవస్యకత ఉందన్నారు. గ్రామాల్లో మహిళలంతా పూర్తిస్థాయిలో హిందూ ధర్మాలను బోధించి విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ 3జిల్లాల సంయోజకులు నరసింహాచార్యులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం ధర్మప్రచారాన్ని మరింత ఉదృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మత మార్పిడిలను, అన్యమత ప్రచారాలను అడ్డుకునేందుకు మహిళలు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమరసత సేవాఫౌండేషన్ జిల్లా బాధ్యులు ముట్నూరు వేణుగోపాలరావుతోపాటు మండల ధర్మప్రచారక్‌లు దూపం వాసు, నర్సింగరావు, ఆదినారాయణ పాల్గొన్నారు.

సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడికి నిరసనగా
ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు
* పాకిస్థాన్ ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాలి

బొబ్బిలి, ఫిబ్రవరి 15: భారతమాత ముద్దుబిడ్డలైన సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మహుతి దాడికి నిరసనగా బొబ్బిలిపట్టణంలో ముస్లిం సోదరులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిదులు భారీస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జాతీయ జెండాతో మానవహారం నిర్వహించారు. అలాగే ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వుత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆద్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిదులు రమేష్, పుల్లెల శ్రీనివాసరావు, జామియా మసీదు కమిటీ సభ్యులు మహ్మద్ రఫీ, హజీ, ఖాన్‌తోపాటు ఏఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్ నాయకులు కోట అప్పన్న, నాగభూషణం, జనజాగరణ సమితి ఇన్‌ఛార్జి మాదవ్‌లు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు భారత జవాన్లపై ఈ విధంగా దాడి చేయడం దారుణమన్నారు. దేశానికి రక్షణ కల్పిస్తున్న వారిపై ఇటువంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ధీటైన సమాధానం చెప్పాలన్నారు. వీర మరణం మృతిచెందిన జవాన్లకు ప్రతీ ఒక్కరూ అశ్రునివాళి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు భారతమాతాకు జై.. అంటూ వేలాదిమంది విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలు చేశారు.

పురపాలక కమిషనర్‌గా బాలాజీ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
బొబ్బిలి, ఫిబ్రవరి 15: పురపాలక సంఘం కమిషనర్‌గా బాలాజీ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ప్రజలంతా పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. ప్రధానంగా అపారిశుద్ధ్యం నిర్మూలన, ప్లాస్టిక్ నిషేదం, ఇంటింటి చెత్తసేకరణకు సహకరించాలన్నారు. స్వచ్ఛ్భారత్‌ను సక్రమంగా అమలుచేయడంతోపాటు ఆరుబయట మలమూత్ర విసర్జనకు స్వస్తిపలకాలని కోరారు.

పీఏసీఎస్ అధ్యక్షునిగా మల్లినాయుడు
గరుగుబిల్లి, ఫిబ్రవరి 15: మండల కేంద్రం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా చింతల మల్లినాయుడును శుక్రవారం డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గడిచిన కొద్దిరోజులుగా ఉన్న పీఏసీఎస్ అధ్యక్షులు బోను అప్పలనాయుడు మృతిచెందడంతో ఎన్నికను పీఏసీఎస్ కార్యాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఎం సంతోష్‌కుమార్, సూపర్‌వైజర్ చొక్కాపు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డైరెక్టర్లు పెద్దిరెడ్డి సింహాచలంనాయుడు, జనార్థన నాయుడుల పేర్లును అధ్యక్షునిగా ప్రతిపాదించగా మిగిలిన డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు, రౌతు రామినాయుడు, ఎన్ శ్రీరాములనాయుడు, తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఇఓ ఎన్ గుంపస్వామి, తదితరులు పాల్గొన్నారు.
తోటపల్లి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా: ఎమ్మెల్సీ శతృచర్ల
గరుగుబిల్లి, ఫిబ్రవరి 15: ఉత్తరాంధ్రాలో చినతిరుపతిగా ప్రసిద్ధి చెందిన తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు అన్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం దాదాపు 83లక్షల రూపాయల మేర నిదులు మంజూరుచేసిందన్నారు. అదేవిధంగా తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలన్నారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమీషనర్ ఎన్‌విఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ పునః నిర్మాణానికి ప్రభుత్వం 83లక్షల రూపాయలు నిదులు మంజూరుచేసిందని, ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టనున్నామన్నారు. ఈమేరకు అభివృద్ధి పనులకు సంబంధించిన మ్యాప్‌ను ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విటి జనార్థన థాట్రాజ్, జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ విజయకుమార్, డీఇ సైదా, ఏఇ చినప్పలనాయుడు, ఇఓ ప్రకాశరావు, అంబటి రాంబాబు, ఆవాల కన్నయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంలపై అవగాహన
గరుగుబిల్లి, ఫిబ్రవరి 15: మండల పరిధిలోని చినగుడబ, తదితర గ్రామాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్స్‌పై ఓటు వేసేవిధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆర్‌ఐ గాడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈవీఎంలపై ఓటు వేసేవిధానంపై గడిచిన రెండు రోజులుగా మండల పరిధిలోని ఆయాగ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రోజుకు రెండు గ్రామాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే మండల పరిధిలోని గరుగుబిల్లి, పెద్దూరు, ఉద్దవోలు, తదితర గ్రామాల్లో అవగాహన కల్పించామన్నారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భవాని, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి నిధులతో డంపింగ్‌యార్డుల నిర్మాణం

గరుగుబిల్లి, ఫిబ్రవరి 15: ఉపాధి హామీపథకం నిదులతో గ్రామపంచాయతీలలో డంపింగ్‌యార్డుల నిర్మాణం చేపడుతున్నామని వైస్ ఎంపీపీ ద్వారపురెడ్డి ధనుంజయరావు అన్నారు. మండల పరిధిలోని దళాయివలస, ఉద్దవోలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన డంపింగ్‌యార్డులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని తడిచెత్త, పొడిచెత్తలను సేకరించేందుకు ఇప్పటికే చెత్తబుట్టలను పంపిణీ చేశారని, సేకరించిన చెత్తను మోడల్ డంపింగ్‌యార్డులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి పార్వతి, ఇఓపీఆర్‌డీ ఎంవి గోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు చింతల వెంకటకూర్మినాయుడు, జి సురేష్‌కుమార్, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే
ప్రభుత్వం లక్ష్యం: మంత్రి సుజయ్

బాడంగి, ఫిబ్రవరి 15: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనందిస్తు వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే టీడీపీ ప్రభుత్వం లక్ష్యమని గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు విద్యార్థినులకు ప్రభుత్వం మంజూరుచేసిన సైకిళ్లును పంపిణీ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు భూ పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కోట్లాది రూపాయలు వ్యయంతో భూములను కొనుగోలుచేసి వారికి పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పిండ్రంగివలస, వీరసాగరం గ్రామాలకు చెందిన 25 కుటుంబాలకు భూములను కొనుగోలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశామన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. విద్యార్థులు బడి మానివేయకుండా ఉండేందుకు సుమారు 8 కోట్ల వ్యయంతో జిల్లాలో 18,830మంది విద్యార్థినులకు సైకిళ్లును పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో 2,393మందికి పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 250కోట్ల రూపాయల వ్యయంతో పలు రోడ్లును నిర్మిస్తున్నామని, గజరాయునివలస రోడ్డుకు 80లక్షల రూపాయలు మంజూరుచేశామన్నారు. ఇదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అలాగే రైతులకు సాగువనరులు అందించాలన్న లక్ష్యంతో ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకం నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అనంతరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ ప్రజాసంక్షేమపథకాలను చేపడుతున్న చంద్రబాబునాయుడుకు ప్రజలంతా అండదండలు అందించాలన్నారు. అభివృద్ధితోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ సభ్యులు తూముల భాస్కరరావు, ఎస్సీ కార్పోరేషన్ ఏడీ ప్రసాద్, విద్యాశాఖ అధికారిణి నాగమణి, ఎంపీపీ అధికార ప్రతినిది బి జగన్నాథం, ఎంపీడీఓ రత్నం, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి ప్రత్యామ్నాయం మా మూడు పార్టీల కూటమే..

కురుపాం, ఫిబ్రవరి 15: రాబోయే ఎన్నికల్లో రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యామ్నాయ మార్గంగా చూపించగలిగేది జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీల కూటమేనని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. శుక్రవారం కురుపాంలో మూడు పార్టీల ప్రత్యామ్నాయ రాజకీయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ నుంచి సభా స్థలి వరకు ఎర్రదండు కవాతు చేస్తు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, వైకాపాలు రాష్ట్రంలో అధికారం కోసం మరలా ఎందుకు రావాలని ప్రశ్నించారు. తెలుగుదేశంపార్టీ శతశాతం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చి తాయిలాలకు ప్రజలకు లొంగిపోరన్నారు. నాలుగున్నరేళ్లపాటు రాష్ట్రానికి అన్యాయం చేసి ఎన్నికలు వస్తున్నప్పుడు మాయమాటలు చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైకాపా అసెంబ్లీకి వెళ్లకుండా మరలా ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ఎందుకు అడుగుతున్నట్లో అర్థం కావడం లేదన్నారు. ప్రజల అభివృద్ధి కోసం అండగా ఉండేది కమ్యూనిస్టులు ఒక్కరేనన్నారు. ఉపాధి హామీపథకం అటవీ, హక్కుల చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించినప్పటికీ వాటిని అమలుచేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ తమకు తోడు కావడంతో రాష్ట్ర ప్రజల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యిందన్నారు. కోట్లాది రూపాయలు అవినీతికే తప్ప అభివృద్ధికి కాదని ఆరోపించారు. స్థానికంగా రాజులు తమ కోటలలో కూర్చొని పదవులు అనుభవించడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. ప్రముఖ రాజకీయ వేత్త, స్వార్థంలేని కిశోర్‌చంద్రదేవ్ టీడీపీలోకి చేరడం వలన పరువుపోతుందే తప్ప ప్రయోజనం ఉండదన్నారు. రాబోయే ఎన్నికల్లో గిరిజనులంతా ఏకమైన తమ ప్రభుత్వానికి తీసుకురావల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, సీపీఎం నాయకులు కోలక లక్ష్మణమూర్తి, సీపీఎం నాయకులు కామేశ్వరరావు, ఒమ్మి రమణ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడులు
కురుపాం, ఫిబ్రవరి 15: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖ గుమ్మలక్ష్మీపురం ఏడీ లక్ష్మణబాబు అన్నారు. శుక్రవారం దురిబిలి గ్రామంలో సేంద్రీయ ఎరువుల తయారీ, వాడకంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్, రబీ పంటలలో సేంద్రీయ ఎరువులు, ఘన జీవామృతాలను వాడటం వలన పంట దిగుబడితోపాటు అధిక ఆదాయం లభిస్తుందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సేంద్రీయ ఎరువులతో పండించే పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈమేరకు వ్యవసాయశాఖ సిబ్బంది దండుసూర గ్రామంలో ఘనజీవామృతాన్ని తయారుచేసేవిధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీపంటలో జీడి మొక్కలకు పూతగా వేసినట్లయితే మంచి దిగుబడి లభిస్తుందని, ఎటువంటి తెగుళ్లు సోకవన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

గిరిజనాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత: మంత్రి సుజయ్

సాలూరు, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. ఈమేరకు శుక్రవారం 100పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ఆసుపత్రి ద్వారా నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చునన్నారు. ముఖ్యంగా 100 పడకల ఆసుత్రి వలన గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే స్థానిక డిగ్రీ కళాశాలలో కళాశాల ఆధునీకరణకు 4కోట్ల రూపాయలు వెచ్చించనున్నామన్నారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం వలన ప్రజలకు ఎక్కువగా సేవ చేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ హరిజవహార్‌లాల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో తగదాలకు దిగవద్దు
సాలూరు, ఫిబ్రవరి 15: రానున్న ఎన్నికల దృష్ట్యా పట్టణ ప్రజలు ఎటువంటి గొడవలు, తగాదాలకు దిగరాదని సీఐ ఇలియాజ్ మహ్మద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని చిన హరిజనపేటలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు ఎవరైన విఘాతం కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీలకు మద్ధతుగా ఎటువంటి దౌర్జన్య కార్యక్రమాలు చేపట్టిన క్షమించబోమన్నారు. మద్యం మత్తులో వివాదాలు సృష్టిస్తే కేసులు నమోదుచేస్తామన్నారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా రక్షక్, వృద్ధమిత్ర సేవలను వినియోగించుకోవాలన్నారు. దొంగతనాలు, గొలుసు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అప్పారావు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

సాలూరు, ఫిబ్రవరి 15: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జీ కృష్ణసాయితేజ కోరారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రశ్నించగలుగుతారన్నారు. విద్యార్థి దశలో సామాజిక దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయసాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

కిశోర్‌దేవ్ టీడీపీలోకి చేరడం సిగ్గుచేటు

సాలూరు, ఫిబ్రవరి 15: 125 సంవత్సరాల చరిత్రకలిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ వాది వైరిశర్ల కిశోర్‌చంద్రదేవ్ అవినీతి కూపంలో కూరుకుపోయిన టీడీపీలోకి చేరుతాననడం సిగ్గుచేటని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన నాయకులు కిశోర్‌చంద్రదేవ్ గల్లీరాజకీయాలకు నిలయమైన పార్టీలో చేరడం తగదన్నారు. ఇంతవరకు రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కేవలం పదవుల కోసం కుంభకోణాల పార్టీలో చేరడం ఆయన స్థాయిని తగ్గించుకున్నట్లేనన్నారు. మేథావిగా, రాజనీతి విజ్ఞనిగా కిశోర్‌దేవ్‌కు పేరున్నప్పటికీ ఎంపీ పదవి కోసం దిగజారడం తగదన్నారు. అటువంటి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్నదొర కోరార