విజయనగరం

గుర్తింపుకార్డులతో వీధి వ్యాపారులకు గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: గుర్తింపుకార్డులతో వీధి వ్యాపారులకు సమాజంలో గౌరవం లభిస్తుందని మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. పట్టణంలో మెప్మా కార్యాలయంలో బుధవారం వీధి వ్యాపారులకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుర్తింపుకార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ వీధి వ్యాపారులు ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వ్యాపారులు చేసుకోవాలని సూచించారు. గుర్తింపుకార్డులు కలిగిన వ్యాపారులు సంఘంగా ఏర్పడితే బ్యాంకుల ద్వారా రుణాలను పొందవచ్చునని అన్నారు. బ్యాంకులు కల్పిస్తున్న ముద్ర తదితర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, కెనరాబ్యాంకు మేనేజర్ ప్రభాకరరావుతదితరులు పాల్గొన్నారు.

కొత్త కమిషనర్‌కు పాత సమస్యల స్వాగతం
* కమిషనర్‌గా వర్మ నేడు బాధ్యతల స్వీకరణ
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: జిల్లా కేంద్రమైన విజయనగరం మున్సిపల్ కమిషనర్‌గా నియమితులైన ఎస్‌ఎస్ వర్మ గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. విశాఖపట్టణం మున్సిపల్ రీజనల్‌డైరెక్టర్‌గా పనిచేస్తున్న వర్మను విజయనగరం మున్సిపల్‌కమిషనర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వర్మకు అనేక సమస్యలు స్వాగతం పలకనున్నాయి. మందకొడిగా జరుగుతున్న అభివృద్ధిపనులు, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా తదితర సమస్యలు సవాల్‌గా మారనున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలో పలు విభాగాల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ రెవెన్యూ, ప్రజారోగ్య విభాగాల్లో అధికారుల పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. ఆయా విభాగాల్లో అధికారులు తమకేమిపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దీనికితోడు అన్ని విభాగాల్లోను అవినీతి బెడద ఎక్కువగా ఉంది. మామూళ్లు ఇస్తేనే పనులు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. దిగువస్థాయి ఉద్యోగుల పనితీరు కూడా ఏమాత్రం బాగోలేదనే విమర్శలు ఉన్నాయి. కొత్తగా నియమితులైన కమిషనర్ వర్మ కార్యాలయ పనితీరుపై ప్రత్యేక శ్రద్ద కనబర్చవలసిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

నాళంవారి భూములకు అన్నదాత సుఖీభవా వర్తించేనా!
గజపతినగరం, ఫిబ్రవరి 20: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అన్నివిదాలా ఆదుకొని ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసం చేసే ఉద్దేశ్యంతో ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పధకం అందరి రైతలకు వర్తించేలా కనిపించడంలేదు. పధకంలో అనేక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకులలో రుణాలు తీసుకున్న రైతులకు పట్టాదారు ఖాతాలు, ఆధార్‌తో భూములు అనుసందానం అయినా రైతులు వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద వివరాలు ఇలా ఉన్నాయి. డి.పట్టా భూములు, అసైన్డ్ భూములు, ఇనాం భూములు, గ్రామ కంఠాలు సాగు చేస్తున్న రైతులకు ఈ పధకం అమలు చేస్తారో లేదో స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదు. దీనితో ఈ భూములను ఏళ్ల తరబడి సాగుచేస్తున్న వందలాదిమంది రైతులు ఆందోళనలో ఉన్నారు. మండలంలోని పురిటిపెంట గ్రామంలో 543 ఎకరాలు నాళంవారి భూములు దేవస్ధానంకు చెందిన 60 ఎకరాలు గ్రామ కంఠం మరో 20 ఎకరాలు మొత్తంగా 600 ఎకరాల వరకు రైతులు ఏళ్ల తరబడి 250మంది వరకు సాగు చేస్తున్నారు. 1970ముందు వరకు నాళంవారికి చెందిన ఈ భూములు రైతులు హైకోర్టును ఆశ్రయించగా రైతులకు అనుకూలంగా పట్టాలు ఇవ్వాల్శిందిగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పు ఇచ్చి దాదాపు 40 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మారుతున్నా వారికి మాత్రం పట్టాలు మాత్రం మంజూరు కాలేదు. దీంతో 2004, 2009 సంవత్సరాలలో ఆయా ప్రభుత్వాలు రైతురుణ మాఫీ ప్రకటించినా రైతులకు పట్టాలు లేక బ్యాంకులలో రుణాలు అందలేక మాఫీ లేని పరిస్ధితి ఏర్పడింది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నీలం, పెధాయ్, హుదుద్ వంటి తుపాన్లు భీభత్సం వలన పంటలు నష్టపోయినా ఒక్కపైసా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి పొందని పరిస్ధితి. ఇపుడు తాజాగా ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు రైతలకు 15వేలు, దాటిన రైతులకు పదివేలు అన్నదాత సుఖీభవ పధకం కింద ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ భూములకు సంబందించి పట్టాలు రైతులకు రాకపోవడంతో పధకం వర్తిస్తుందా లేదా స్పష్టత అన్నది కరువైంది. మరో పక్క ప్రభుత్వం కూడా విధి విదానాలలో ఇలాంటి భూములపై పధకంలో ఒక స్పష్టత ఇవ్వకపోవడం అధికారులు వద్దకూడా స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో గందరగోళం నెలకొన్నది. మరో పక్క ఈ భూములు సాగు చేస్తున్న రైతులను కౌలు రైతులుగా అయినా గుర్తించుదామంటే ఆగుర్తింపు కార్డులు కూడా అరకొరగా కొంతమంది రైతులకు మాత్రమే ఉన్నాయి. 600 ఎకరాలలో వంద ఎకరాలకు కౌలు రైతులకు గుర్తింపుకార్డులు లేవు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
గజపతినగరం, ఫిబ్రవరి 20: విద్యాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్ధానిక ఎంపిపి గంట్యాడ శ్రీదేవి అన్నారు. బుధవారం మండలంలోని మరుపల్లి గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలోని బాలికలకు సైకిళ్ళను ఎంపీపీ శ్రీదేవి పంపిణీ చేశారు. బాలికల డ్రాపౌట్స్‌ను నివారించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. బాలికలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత పౌరులుగా ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ బి. ఇందిరాస్వాతి తదితరులు పాల్గొన్నారు.