విజయనగరం

జానపద కళలను కాపాడండి..కళాకారులను ఆదుకొండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: కనుమరుగువుతున్న జానపద కళలను కాపాడాలని, సాంస్కృతిక జానపద కళాకారులను ఆదుకోవాలని నవ్యాంధ్ర జానపద వృత్తి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పుక్కెళ్ల షణ్ముఖరావుడిమాండ్ చేశారు. జానపద కళాకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ మూడులాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరికోవెల, కంటోనె్మంట్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావుకు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షణ్ముఖరావుమాట్లాడుతూ జిల్లాలో 50 సంవత్సరాలు దాటిన డప్పు కళాకారులకు ఇస్తున్న మాదిరిగానే జానపద కళాకారులకు కూడా మూడువేల రూపాయల పింఛన్ ఇవ్వాలని కోరారు. జానపద కళాకారుల పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా కార్పోరేట్ విద్య, వైద్యం అందించాలన్నారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధానకార్యదర్శి గోకా రమేష్‌బాబు మాట్లాడుతూ జానపద కళాకారులకు స్వంత ఇళ్లు, బంజరు భూములు, తెల్లరేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీ గ్రామంలో ఉన్న మందిరాలు, దేవాలయాల్లో భజన కార్యక్రమాలను ప్రభుత్వమే ఏర్పాటుచేసి జానపద కళలను, వృత్తిని కాపాడాలని కోరారు. జానపద కళాకారుడు మద్ది పోలయ్య మాట్లాడుతూ కళాకారులకు దుస్తులు, గజ్జెలు, మువ్వలు ఇవ్వాలన్నారు. బేతా సత్యనారాయణ మాట్లాడుతూ కళాకారులకు గుర్తింపుకార్డులు, ఉచిత బస్సుపాసులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర జానపద వృత్తికళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సరబోయిన శంకరరావు, సామాజిక హక్కుల పోరాట వేదిక జిల్లా ప్రధానకార్యదర్శి రాకోటి గోపాలరావు, నాయిబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టివి దుర్గారావు, ఎస్‌కే భాషా, బీటా శంకరరావు, రెడ్డి రామునాయుడు, మక్కువ మారినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఒకేసారి బకాయిమొత్తాన్ని చెల్లిస్తే
ఆస్తిపన్ను చెల్లింపులో వడ్డీ రద్దు
* అసిస్టెంట్‌ కమిషనర్ కనకమహాలక్ష్మి వెల్లడి

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: పట్టణంలో ఆస్తిపన్ను చెల్లింపునకు సంబంధించి పాతబకాయిలతో కలిపి ఒకేసారి చెల్లిస్తే అపరాద రుసుం (వడ్డీ)ను ప్రభుత్వం రద్దు చేసిందని మున్సిపల్ అసిస్టెంట్‌కమిషనర్ కొట్టేడ కనకమహాలక్ష్మి అన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించిందని చెప్పారు. సంవత్సరాల తరబడి ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లించని బకాయిదారులకు ప్రభుత్వం కల్పించిన వడ్డీ మాఫీ ఒక వరంలా ఉపయోగపడుతుందని చెప్పారు. బుధవారం తన ఛాంబర్‌లో విలేఖరులతో ఆమె మాట్లాడుతూ 2018-2019 అర్థసంవత్సరం వరకు చెల్లించవలసిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను పాత బకాయిలతో సహా ఒకే మొత్తంలో చెల్లించినవారికి అపరాదరుసుం (వడ్డీ)ను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పట్టణంలో సంవత్సరాల తరబడి ఆస్తి, ఖాళీస్థలాల పన్నులను చెల్లించని బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. లక్షరూపాయలకు పైబడిన ఆస్తిపన్ను చెల్లింపుదారుల జాబితాలను సిద్ధం చేశామన్నారు. ఇంతవరకూ పట్టణంలో 20 కోట్ల రూపాయల మేరకు ఆస్తిపన్ను వసూలు చేశామన్నారు. మార్చినెలాఖరు నాటికీ వందశాతం ఆస్తిపన్ను వసూలు చేస్తామన్నారు. ఆస్తి, ఖాళీస్థలాల పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కనకమహాలక్ష్మి కోరారు.