విజయనగరం

అవినీతిలేని పాలన బీజేపీతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, మార్చి 12: అవినీతిలేని పాలన బీజేపీతోనే సాధ్యమని బీజేపీ గజపతినగరం అసెంబ్లీ కన్వీనర్ దేవర ఈశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని ముద్దూరు, గొల్లలపేట గ్రామాలలో దేవర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదేవిదంగా వారసత్వం లేని పార్టీ తమ పార్టీ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పధకాలపై ప్రజలు అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగెత్తారని, ప్రధాని నరేంద్రమోదీ పాలన కోసం ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జాగరపు కృష్ణ, పోతల గున్నయ్య, ఇనుముల సింహాచలం, సత్యనారాయణ, ఎం ఎస్ ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానపార్టీల వైఖరితో ప్రమాదంలో ప్రజాస్వామ్యం!
* జనసేన నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్
గజపతినగరం, మార్చి 12: ప్రధాన పార్టీ వైఖరి కారణంగా ప్రమాదంలో ప్రజాస్వామ్యం పడిందని జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ అన్నారు. మంగళవారం స్ధానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో దొంగ ఓట్లు వేయడం, ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం జరిగేదని, ఇపుడు రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన ఓటు హక్కును తొలగించడం వంటి చర్యలు దిగడం దుర్మార్గమని అన్నారు. ప్రధాన పార్టీలతో ప్రజలు విసిగెత్తారని, కొత్త ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. జనసేనతోనే నీతివంతమైన పాలన సాధ్యమని అన్నారు. తాము ఇంతవరకు ఐదు ప్రచార రధాలు ద్వారా 80గ్రామాలలో పార్టీ మేనిపెస్టోను వివరించామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు యువత పార్టీలో చేరుతున్నారని చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ నెల 14వతేదిన రాజమహేంద్రవరం ఆర్ట్స్ మైదానంలో జరగనున్న సభకు విజయనగరం జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు యువత ముందుకు వస్తుందని చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గంలో సమస్యలను పవనకల్యాణ్ దృష్టికి తీసురావడం జరుగుతుందని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ఎన్నికలలో డబ్బు, మద్యానికి బానిసలు కాకుండా నీతివంతమైన పాలన అందించేందుకు ముందుకు వచ్చిన పవన్‌కల్యాణ్‌ను ఆశ్వీరదించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మిడితాన రవికుమార్, డోల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్శీగా ఒక్క అవకాశం కల్పించండి
* ఉత్తరాంధ్ర ఎమ్మెల్శీ అభ్యర్ధి ఆడారి కిషోర్‌కుమార్
గజపతినగరం, మార్చి 12: ఎమ్మెల్శీగా ఒక్క అవకాశం కల్పించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్శీ అభ్యర్ధి ఆడారి కిషోర్‌కుమార్ కోరారు. మంగళవారం మండలంలోని మరుపల్లి ఆదర్శ పాఠశాలతోపాటు గజపతినగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబందించిన సి పి ఎస్ రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇందుకోసం నిర్వహించిన పోరాటాలకు మద్దతు తెలిపానని అన్నారు. ఉమ్మడి సరీస్ రూల్స్‌పై కోర్టులో ఉన్న కేసులు తొలగించేందుకు గట్టిగా ప్రభుత్వం యత్నించాలని, పాతపద్దతిలో జె ఎల్ పదోన్నతులు కల్పించాడానికి కృషి చేస్తానని తెలిపారు. వారంలో ఐదు పనిదినాలు అమలు కోసం ఖచ్చితంగా పనిచేయడంతోపాటు ఉపాధ్యాయులు సమస్యలపై పోరాటాలు చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

యుద్ధప్రాతిపదికన దీర్ఘకాలిక రుణాలు!
* జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.వెంకటేశ్వరరావు
* ప్రత్యేక బృందాలతో మొండిబకాయిలు వసూలు
గజపతినగరం, మార్చి 12: జిల్లాలో యుద్ధప్రాతిపదికన దీర్ఘకాలిక రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్ధానిక కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రబీలో 30కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇంతవరకు కేవలం మూడుకోట్లు మాత్రమే అందించామని తెలిపారు. భూమి అభివృద్ధి పధకం, పౌల్ట్రీ, డెయిరీ, ట్రాక్టర్లకు, మైనర్ ఇరిగేషన్‌కు యుద్ధప్రాతిపదికన అందజేస్తామని చెప్పారు. అవసరమైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇందు కోసం తమను సంప్రదించాలని అన్నారు. స్వల్పకాలిక రుణాలు 130కోట్లు లక్ష్యం కాగా ఇంతవరకు 37,156మంది లబ్ధిదారులకు 114.32కోట్లు అందించామని చెప్పారు. ఎస్టీ అదర్స్ రుణాలు 150కోట్లు లక్ష్యం కాగా ఇంతవరకు 2226మంది లబ్ధిదారులకు 114కోట్లు రుణాలు అందించామని చెప్పారు. జె ఎల్ జి గ్రూపులకు సుమారు 12కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పాడిగేదెల కొనుగోలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 31కోట్లు మొండిబకాయిలు వసూలు చేయాలని లక్ష్యం కాగా ఇంతవరకు 11కోట్లు 24లక్షలు వసూలు అయ్యాయని, మిగిలిన బకాయిల వసూలకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మితిమీరిన బకాయిదారులకు లీగల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు చోట్ల ఎటి ఎంలు ఉన్నాయని, కొత్తగా శృంగవరపుకోట, గంట్యాడలలో ఎటి ఎంలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అదే విధంగా జిల్లాలో డెంకాడ, ఎస్.కోట, మొయిద విజయరాంపురం, కుమిలిలలో బహుళ ప్రయోజన సేవలు అందించేందుకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. కార్యక్రమంలో డిసిసిబి మేనేజర్ పి.వి.రమణ, గజపతినగరం బ్రాంచి మేనేజర్ హరికేశవరావు తదితరులు పాల్గొన్నారు.