విజయనగరం

పార్లమెంటులో ప్రశ్నించే హక్కు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, ఏప్రిల్ 9: పార్లమెంటులో ఆంధ్ర ప్రదేశ్ తరపున ప్రశ్నించే హక్కును ప్రజలు కల్పించాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి జెడి లక్ష్మీనారాయణ ప్రజలను కోరారు. మంగళవారం సిపిఐ అభ్యర్థి పి.కామేశ్వరరావుతో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అభ్యర్థిగా నేను ముందుకు వచ్చానని, విలువైన ఓటుతో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించాలని ఆయన కోరారు. అదే విధంగా విశాఖ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని రాష్ట్రంలోనే ఆదర్శనగరంగా తీర్చిదిదుతానని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్రస్టు ద్వారా నిరంతర సేవలు అందిస్తున్నాం
కొత్తవలస, ఏప్రిల్ 9: మండలంలో మంగళపాలెంలోని శ్రీగురుదేవ చారిటబుల్ ద్వారా నిరంతర సేవలు అందిస్తున్నామని చారిటబుల్ ట్రస్టు అధినేత రాపర్తి సుబ్బలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కె.వి.పూర్ణచంద్రరావు నాల్గవ వర్థంతి సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసి వారికి సేవలు అందించారు. అదే విధంగా పేదలకు వస్త్రాలు, పప్పు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు దాతల సహకారంతో సుమారు 20వేల మందికిపైగా దివ్యాంగులకు ఉపకరణాలు అందించామని ఆమె పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

ఆఖరి రోజున హోరెత్తిన వివిధ పార్టీల ప్రచారాలు
* ప్రచారాలు సమాప్తం.. మూగబోయిన మైక్‌లు
బొబ్బిలి(రూరల్), ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రచారాలను హోరెత్తించారు. తెల్లవారు నుంచే వివిధ గ్రామాలతోపాటు పట్టణాల్లో కూడా విస్తృతంగా ప్రచారాలను నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి శంబంగి వెంకటచినప్పలనాయుడు తెర్లాం, బొబ్బిలి మండలాల్లో ప్రచారాలు నిర్వహించారు. అదేవిధంగా ఆయన సతీమణి చిన్నమ్మలు మల్లంపేట, గొల్లపల్లి, ఐటీఐ కాలనీ, తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుజయ్‌కృష్ణరంగారావు తెర్లాం మండలంలోను, ఆయన సోదరుడు ఆర్‌వి ఎస్‌కెకె రంగారావు(బేబీనాయన) బొబ్బిలి మండలం, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారాలు చేశారు. బిజెపీ అభ్యర్థి డాక్టర్ రామ్మోహనరావు బాడంగి, రామభద్రపురం మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్, జనసేన పార్టీల అభ్యర్థులు వెంగళ నారాయణరావు, గిరడ అప్పలస్వామిలు వివిధ ప్రాంతాల్లో ప్రచారాలు నిర్వహించి ముగించారు. వీటితోపాటు వివిధ పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసిన ప్రచార రథాలను ఉదయం నుంచి పట్టణంలో పోటాపోటీగా ఊరేగించి ఓటర్లను ఆకట్టుకునేవిధంగా ప్రయత్నాలు చేశారు. ఏదీ ఏమైన ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియడంతో ఎక్కడికక్కడ మైక్‌లు మూగబోయాయి. అలాగే ఓటర్లపై వివిధ పార్టీల నాయకులు దృష్టిసారించి రహస్య సమావేశాలు, మంతనాలు జరుపుకుంటున్నారు.