విజయనగరం

క్రమబద్ధీకరణ పేరుతో పాఠశాలల మూసివేత తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 17: రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరంచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జిఓ నెంబర్ 4102ను వెంటనే ఉపసంహరించక పోతే న్యాయపోరాటం చేసి ప్రభుత్వ విద్యను పరిరక్షించుకుంటామని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు స్పష్టంచేసారు. మంగళవారం పాతమహారాజా ఆసుపత్రి కూడలిలో ప్రభుత్వ జిఓ 4102ప్రతులను దగ్ధంచేసి నిరసన వ్యక్తం చేసారు. ఈ వసందర్భంగా మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను మూసి వేయడం వలన పేదవిద్యార్థులు కనీస విద్యకు దూరమై అందరు చదువుకోవాలనే విద్యాహక్కు చట్టానికి తూట్లుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యకు ఊతంగా పరిణమిస్తుందని అన్నారు. నాలుగు దశాబ్ధాలుగా గ్రామీణ విద్యార్ధులకు అందుతున్న ప్రభుత్వ విద్య కోల్పోయి ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోలేక డ్రాపౌట్లు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జిఓ వలన కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. పాఠశాలలు మూసివేయడం వలన ఉపాధ్యాయ పోస్టులు ఆ మేరకు రద్దవుతాయని తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన ఈ జిఓకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు మేల్కొని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. జిఓను వెనక్కితీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ సభ్యుడు రాంబాబు, పలువురు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.