విజయనగరం

దశాబ్దాల కల-నెరవేరిన వేళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, మే 26: నిత్యం రాకపోకలకు అంతరాయం. పిహెచ్‌సికి వెళ్లాలంటే రోగులకు నరకయాతన. వర్షంపడితే అంతా బురద మయం. చీకటి పడితే భయంభయం. వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా పిహెచ్‌సికి వెళ్లాలంటే అనేక అవస్థలు పడాల్సిందే. అలాంటిది పాలక పుణ్యాన్నా బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎట్టకేలకు రహదారి మార్గం వేశారు. దశాబ్దాల కాలం నుంచి నిత్యం పీడిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్లితే బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 1995 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. గ్రీవెన్సీ ప్రారంభం నుంచి రోగులు, వైద్య సిబ్బంది వెళ్లేందుకు సరైన రోడ్డు వసతి లేదు. ప్రజాపదం, జన్మభూముల్లో వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. అయితే గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ. నాయుడు దృష్టికి పిహెచ్‌సి రహదారి సమస్యను స్థానిక నాయకులైన గజపతినగరం మార్కెట్ కమిటీ చైర్మన్ చంటిరాజు, జడ్పీటిసి బండారు బాలాజీలు తీసుకువచ్చారు.
పిహెచ్‌సికి సంబంధించి జిరాయితీ భూములను ఇవ్వవలసిన నేపథ్యంలో ఆ బాధ్యతను ఎఎంసి చైర్మన్ చంటిరాజుకు ఎమ్మెల్యే నాయుడు అప్పగించారు. ఈ నేపథ్యంలో చంటిరాజు స్థానిక కాంట్రాక్టర్ బుద్దరాజు వెంకట ప్రభూజీ అలాగే గ్రామానికి చెందిన బండారు సత్యం తదితరులతో మాట్లాడి జిరాయితీలో కొంత భాగాన్ని పిహెచ్‌సి రహదారికి ఇచ్చేందుకు ఒప్పించారు. ఈ పరిస్థితుల్లో పంచాయితీ ముందు సంబంధించిన పనులకు సుమారు 28లక్షల వ్యయంతో పిహెచ్‌సికి సిసికాలువ, సిమెంటు రోడ్డు యుద్ధ ప్రాతిపదికన వేయడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం జరగడంవలన ఎస్సీ బాలికల వసతి గృహం, పశువైద్య కేంద్రానికి కూడా ప్రయోజనం చేకూరింది. దీంతో స్థానిక ప్రజలతోపాటు పిహెచ్‌సికి వెళ్లే సిబ్బంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.