విజయనగరం

జడ్పీలో ఈ-హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 26: రాష్ట్రప్రభుత్వం పారదర్శక పాలనకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- హాజరు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా విజయనగరం జిల్లా పరిషుత్తులో అన్ని విభాగాల్లో గురువారం నుండి ఈ- హాజరు విధానం అమలులోకి వచ్చింది. జిల్లాలో ఇప్పటికే వెలుగు విభాగంలో ఈపద్ధతి అమలులో ఉండగా తాజాగా జడ్పీలో అమలులోకి వచ్చింది. జిల్లాపరిషత్‌లో మొత్తం అన్ని విభాగాల్లో సుమారు 60 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. కార్యాలయానికి ప్రతి ఉద్యోగి ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలి. అలాగే తిరిగి పనివేళలు ముగిసే సమయం సాయంత్రం ఐదు గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి. ఉదయం కార్యాలయానికి హాజరు అయ్యే సమయం, తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఖచ్చితంగా ఇ- హాజరు ద్వారానే ఉద్యోగులు లోపలికి, వెలుపలికి వెళ్లే వీలు ఉంటుంది. గైర్హాజరు అయ్యేందుకు వీలు లేకుండా పక్కాగా ఈ విధానం అమలు చేస్తున్నారు. నిక్ నెట్ అందించిన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఈ- హాజరు ప్రక్రియ ప్రవేశ పెట్టారు. జడ్పీలో పనిచేసే ప్రతి అధికారినుండి నాల్గవతరగతి ఉద్యోగి వరకు ఇది వర్తిస్తుంది. ఉద్యోగుల్లో సమయపాలనకు పెద్దపీట వేయడంతో పాటు ఫైళ్లక్లియరెన్స్, ఎవరు ఏసమయానికి వచ్చింది ఎక్కడనుండైనా తెలుసుకునే వెసులుబాటు ఇందులో ఉందని, అదే సమయంలో సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని జడ్పీ సి ఈ ఓ రాజకుమారి తెలిపారు. ఇదిలాండగా జిల్లాలోని 34 మండల పరిషత్తుకార్యాలయాల్లో కూడా గురువారం నుండే ఇ-హాజరు విధానం అమలులోకి వచ్చింది. ఉద్యోగి రాగానే కనుపాపను తీసుకుని ఐరిస్ పద్ధతిలో ఆధార్‌కార్డు చివరి నెంబర్ ఎంటర్ చేయగానే ఇ-హాజరు ప్రక్రియ పూర్తిఅవుతుందని కార్యాలయ పర్యవేక్షకులు వెల్లడించారు.