విజయనగరం

నిధులున్నా.. పనులు చేయరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మే 27: మున్సిపల్ పాలకుల నిర్లక్ష్యం.. అనాలోచిత నిర్ణయాల వల్ల బిఆర్‌జిఎఫ్ నిధులు మూలుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం విడుదల అయిన ఈ నిధులను ఖర్చు చేయకపోవడంతో నిధుల వినియోగంపై ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ నిధులను ఎందుకు వినియోగించలేదనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నాయి. బిఆర్‌జిఎఫ్ ద్వారా అభివృద్ధిపనులు చేపట్టేందుకు నాలుగేళ్ల క్రితం రూపొందించిన ప్రతిపాదనలను ఏడాది కిందట మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ తిరస్కరించడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఫలితంగా పట్టణ ప్రజలు నరకయాతన పడుతున్నారు. రోడ్లు, కాలువలు, కల్వర్టుల వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో అల్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా శాసనసభలో ఉపపక్షనేతగా ఉంటూ పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదంటూ తరచూ విమర్శలు చేసేవారు. మున్సిపల్ పాలకవర్గం పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడంలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నా, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కూడా పట్టించుకోకపోవడం దారుణమని పట్టణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గళం విప్పిన అశోక్‌గజపతిరాజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు గుర్తుకు రాకపోవడం శోచనీయమని వారు వాపోతున్నారు. పట్టణంలో 2013-2014లో బిఆర్‌జిఎఫ్ ద్వారా 2.34 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులు చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. కేవలం 25.78లక్షలతో ఏడుపనులు మాత్రమే పూర్తయ్యాయి. అయితే అప్పట్లో రాష్టవ్రిభజన ఉద్యమం జరుగుతున్నందున మిగతా 43 అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాష్టవ్రిభజన జరగడం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, విజయనగరం మున్సిపాలిటీలో ఆపార్టీ పాలకవర్గమే ఎన్నిక కావడం జరిగింది. అయితే మున్సిపాలకవర్గం రద్దు చేసిన 262 పనులలో బిఆర్‌జిఎఫ్ ద్వారా ప్రతిపాదించిన 43 అభివృద్ధి పనులు ఉన్నాయి. వీటిని గత ఏడాది మే 25వతేదీన మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ తిరస్కరించారు. ఇందులో టెండర్లు ఖరారైన 1.23 కోట్ల రూపాయల విలువైన 35 పనులు ఉన్నాయి. అదేవిధంగా 2012-2013లో 1.99 కోట్ల రూపాయలతోప్రతిపాదించిన 25 పనులలో 18పనులు మాత్రమే పూర్తి చేశారు. వీటిలో 54లక్షల రూపాయల విలువైన మిగతా ఏడుపనులను రద్దు చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఎంతో శ్రమించిన రూపొందించిన ఈ ప్రతిపాదనలను తిరస్కరించడంతో మున్సిపల్ పాలకవర్గం అప్పట్లో పలు విమర్శలకు గురైంది. అప్పటి నుంచి కొత్తగా పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఒకవైపు నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, మరోవైపుఅభివృద్ధిపనులు చేయాలనే ధ్యాస మున్సిపల్ పాలకవర్గానికి లేకపోవడం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.