విజయనగరం

మీ-కోసం గ్రీవెన్స్‌లో సామాజిక సమస్యలపై వినతుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 30: మీ-కోసం గ్రీవెన్స్ సెల్‌కు సామాజిక సమస్యలపై వినతులు జిల్లా యంత్రాంగానికి అందాయి. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో మీకోసం కార్యక్రమానికి హాజరైన అర్జీదారుల నుండి కలెక్టర్ ఎం ఎం నాయక్ వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై అందిన వినతులను పరిశీలించి పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇచ్చారు. 13వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు వినతి పత్రం అందజేసారు. జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ సర్పంచ్‌లతోకలసి ఈమేరకు వినతి పత్రం అందిస్తూ 2014-15లో ఎకే విడతలో ప్రభుత్వం 1786 కోట్లు నిధులు స్థానిక సంస్థలకు విడుదల చేసిందని అయితే ఆంక్షల కారణంగా సుమారు 150కోట్ల రూపాయలు ఖర్చుకాక వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని తక్షణం ఆంక్షలు ఎత్తివేసి స్థానిక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం కల్పించాలని కోరారు. నీరు-చెట్టు పథకం పేరుతో ప్రభుత్వం దళితులు, ఆదివాసులు సాగుచేసుకుని జీవిస్తున్న చెరువులలో మట్టిపనులను నిలిపివేసి పెత్తందారుల ఆక్రమణలలోని చెరువులలో పనులు చేపట్టాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు వెలగాడ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మల్లిక్, ప్రగతిశీల మహిళా సంఘం కన్వీనర్ రమణిలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసారు. సీతానగరం మండలం ఆర్. వెంకంపేట గ్రామంలో పలు చెరువులు పెత్తందారుల ఆక్రమణలు ఉన్నాయని ఫిర్యాదు చేసారు. అయితే ఆదివాశీలు చెరువు గర్భాల్లో సాగుచేసుకుంటున్న భూములను నీరు-చెట్టు కింది జలసంరక్షణ పేరిట తొలగించడం కారణంగా జీవనాధారం కోల్పోతున్నారని ఫిర్యాదు చేసారు. జిల్లాలోని సంతల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని, సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం జి ఓ నెం. 23 జారీచేసినా పెదమానాపురం, మోపాడ, కందివలస, అచ్యుతాపురం, అలమండ సంతల్లో ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోవటంలేదని సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి పనస బంగార్రాజు, సభ్యుడు బాబూరావు ఫిర్యాదు చేసారు. సీతానగరం మండలం బగ్గందొరవలస గ్రామంలో అక్రమంగా నిర్మించిన రైస్ మిల్లు నుండి వెలువడుతున్న వాయువులు కారణంగా గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని గ్రామస్తులు శ్రీనివాసరావు, మీనాకుమారిలు ఫిర్యాదు చేసారు. ఈ గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, డి ఆర్ ఓ జితేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.