విజయనగరం

ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని ఉపాధి కూలీల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 30: ఉపాధిహామీ నిధుల్లో అక్రమాలకు పాల్పడిన నెర్లిమర్లమండలం చినబూరాడపేట ఫీల్లుడ అసిస్టెంట్‌ను విధలునుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీలు పెద్దసంఖ్యలో సోమవారం కల్టెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఈకార్యక్రమానికి నాయకత్వం వహించిన గ్రామ మారుతీ యువజన సంఘం అధ్యక్షుడు బెల్లానరామారావు మాట్లాడుతూ సుమారు లక్షానలభైవేల రూపాయలవరకు ఉపాధినిధులు అక్రమానికి ఫీల్డు అసిస్టెంట్ పాల్పడిందని సామాజిక తనిఖీలో వెల్లడిఅయిందని అన్నారు. సహచట్టం ద్వారాకూడా సేకరించి ఆమె అవినీతిని బయట పెట్టామని దీనిపై విచారణ అనంతరం అధికారులు ఆమెను విధులనుండి సస్పెండ్ చేసి ఇటీవల ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇవ్వడం వలన తమకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేసారు. ఆమెను పూర్తిగా విధులనుండి తొలగించాలని కలెక్టర్ ను కోరారు. ఈమేరకు సోమవారం గ్రీవెన్స్‌లో గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ డ్వామా పిడి ప్రశాంతికి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.