విజయనగరం

ఎసిబి దాడులతో ఉద్యోగుల్లో గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 2: విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ నారాయణరావులక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన మరుక్షణమే పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు కార్యాలయం నుంచి పరుగులు తీశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎసిబి డిఎస్‌పి లక్ష్మీపతి ఆధ్వర్యంలో సిఐలు ఎస్.లక్ష్మోజి, బి.రమేష్ రికార్డులను పరిశీలించారు. పట్టణానికి చెందిన బిల్డర్ మురళీకి చెందిన జి-ప్లస్ 4 భవన నిర్మాణానికి సంబంధించిన ఎండార్స్‌మెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్‌లో అన్ని రికార్డులతోపాటు ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలను కూడా పరిశీలించారు. ఈ సమయంలో టిపిఒ రాజేశ్వరరావుతోపాటు మిగతా అధికారులు, ఉద్యోగులు కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో రికార్డులను పరిశీలించడం ఎసిబి అధికారులకు కష్టమైంది. భవన నిర్మాణ అనుమతులు, ఎండార్స్‌మెంట్ వివరాలను రికార్డులలో నమోదు చేసే జి 1 గుమస్తా ఎం.అప్పలరాజు, జి 2 గుమాస్తా కోరాడ కిరణ్ అందుబాటులో లేకపోవడంతో వారి గురించి ఎసిబి అధికారులు ఆరా తీశారు. ఇక్కడ అధికారులతోపాటు ఉద్యోగులు కూడా భయపడి వెళ్లిపోవడంతో (మిగతా 2వ పేజీలో)
ఎసిబికి పట్టుబడిన నారాయణరావును కార్యాలయంలోకి తీసుకువచ్చి మురళీ భవన నిర్మాణానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు మున్సిపల్ కమిషనర్ నాగరాజుతో ఎసిబి డిఎస్‌పి లక్ష్మీపతి, సిఐ రమేష్ సమావేశమయ్యారు. ‘మీరు జారీ చేసిన ఎండార్స్‌మెంట్ రికార్డులను ఇవ్వాలని’ కమిషనర్‌ను కోరారు. అయితే టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఎవరూ అందుబాటులో లేకపోవడం, అధికారులు, ఉద్యోగులు సెన్‌ఫోన్‌ల స్విచ్ ఆఫ్ చేయడంతో చాలాసేపు కమిషనర్ కార్యాలయంలోనే ఎసిబి అధికారులు ఉండిపోవలసి వచ్చింది.