విజయనగరం

మైదాన ప్రాంత గిరిజనుల కోసం ‘మాడా’ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 9: జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం మోడిఫైడ్ ఏరియా డవలప్‌మెంట్ అప్రోచ్ (మాడా) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మైదాన ప్రాంత గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గేదెల లక్ష్మణ్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రఘుపతుల శశిభూషణ్ కోరారు. ఈ మేరకు ఎస్సీఎస్టీసెల్ చైర్మన్ కారెం శివాజీకి గురువారం ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదాన ప్రాంత గిరిజనుల కోసం మాడా ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, ఎస్సీఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు, విద్యార్థులకు ఎస్టీ కులధృవీకరణ పత్రాల మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక మైదాన ప్రాంతాలలో వౌలిక సదుపాయాలు లేవని అన్నారు. అదేవిధంగా ఐటిఎడి ఇస్తున్న రుణాలను పొందేందుకు బ్యాంకు అధికారలు విల్లింగ్ ఇవ్వడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైదాన ప్రాంతం గిరిజన సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కొల్లాన పైడితల్లి, సహాయ కార్యదర్శి జమ్ము బంగారి పాల్గొన్నారు.