విజయనగరం

వైద్యసేవలో అలసత్వం వహిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూన్ 9: వైద్య సేవలు అందించడంలో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి ఎం. కిషోర్ కుమార్ హెచ్చరించారు. గురువారం స్థానిక సిహెచ్ ఎన్‌సిలో గురువారం ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో 95శాతం పురోగతి ఉందని, లక్ష్యాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్‌లు అందించాలని సూచించారు. అర్హత గల పిల్లలకు సిహెచ్‌సి, పిహెచ్‌సిలలో వ్యాక్సిన్‌లువేయాలని అన్నారు. సిహెచ్‌సిలలో వ్యాక్సిన్‌లు భద్రపరచే ఐ ఎల్ ఆర్ మిషన్లు అందుబాటులో ఏర్పాటుచేసామని చెప్పారు. కార్యక్రమంలో సహాయ గణాంకాధికారిణి సంధ్యారాణి, జిల్లా ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమూర్తి, సిహెచ్ ఓ లక్ష్మణరావు, హెల్త్ ఎడ్యుకేటర్ గిరిబాబు పాల్గొన్నారు.