విజయనగరం

తీరు మారదు.. పాలన సాగదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 9: మున్సిపల్ పాలనా వ్యవహారాల్లో ఒకవైపు పాలకవర్గం, మరోవైపు అధికార యంత్రాంగం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతోంది. మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణ పౌరులకు అందవలసిన సేవలు కూడా సకాలంలో సక్రమంగా అందడంలేదు. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. అన్ని విభాగాలలోను నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వారంరోజుల క్రితం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సిహెచ్‌వి నారాయణరావురెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులకు దొరికిపోయారంటే ఇక్కడ అవినీతి ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ కార్యాలయంలో ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత కూడా అధికారులు, ఉద్యోగుల పనితీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా అభివృద్ధి, పాలనా వ్యవహారాలలో అధికారులు, పాలకవర్గ సభ్యులు అనుసరిస్తున్న తీరుతెన్నుల వల్ల పాలన ముందుకు సాగడం లేదు.‘ఎవరికి వారే యమునాతీరే’ అనే విధంగా వ్యవహరిస్తుండటంతో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, ఇందులో 32 వార్డులలో తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్సిపల్ కౌన్సిల్‌లో చెక్కు చెదరని మెజార్టీ ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకున్న సమయాలలో అభాసుపాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరేనని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. గతనెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మహాకవి గురజాడ అప్పారావుకుటుంబీకులకు స్థలాన్ని కేటాయించకుండా అజెండాలో పొందుపర్చిన అంశాన్ని తిరస్కరించడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. చైర్మన్ రామకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కౌన్సిల్ ముత్తం సాహితీవేత్తల ఆగ్రహానికి గురికావలసి వచ్చిందని వారంటున్నారు. అదేవిధంగా చాలా విషయాలలో ఇదే పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుందని వారు వాపోతున్నారు. ఇక నుంచి ఎటువంటి బేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమన్వయంతో వ్యవహరించాలని రెండురోజుల క్రితం కేంద్రమంత్రి అశోక్ బంగ్లాలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మీసాల గీత కౌన్సిల్‌సభ్యులకు హితబోధ చేశారు. మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ తీరుతెన్నులు, వ్యవహారశైలిపై ఆ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులలో చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమంజంగా లేదని వారు నిలదీశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఛాంబర్‌లో గురువారం జరిగిన ప్రీ కౌన్సిల్ సమావేశంలో కూడా కౌన్సిల్ సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు బయటపడ్డాయి. అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల విడుదలలో పక్షపాత ధోరణితో చైర్మన్ వ్యవహరిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు నిలదీశారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ప్రీ కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో సభ్యుల వ్యవహరించవలసిన తీరుతెన్నులపై చర్చించారు.