విజయనగరం

కోటమ్మను దర్శించుకున్న భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, జూన్ 12: మండలంలోని కొట్టాం శ్రీకోటమ్మ అమ్మవారిని అధి క సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రతి మంగళ, ఆదివారాలలో అమ్మవారిని వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి ద ర్శించుకుంటారు. ఆదివారం అమ్మవారిని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధితోపాటు మూడు జి ల్లాల్లో అమ్మవారికి తమ పాడిపంట, వ్యాపార, ఉద్యోగాలు చల్లగా ఉండాల ని భక్తులు మొక్కుకుంటూ ఉంటారు. వీరం తా ఆలయానికి వచ్చి అమ్మవారికి చీర, పసుపుకుంకుమలతో తమ మొక్కలు తీ ర్చుకున్నారు. పూజలు అనంతరం ఆల యం చుట్టూ ఉన్న తోటల్లో వంటలు చే సుకొని విందుభోజనాలు ఆచరించారు. నూతన వాహనాలు కొనుగోలు చేసుకు న్న వారు అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించారు.

కోటసత్తెమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం
విజయనగరం (పూల్‌బాగ్), జూన్ 12: పట్టణంలోని రామానాయుడు రోడ్డులోని కోటసత్తెమ్మ త ల్లి ఆలయంలో ఆదివారం అమ్మవా రి పండుగ ప్రారంభమయ్యాయి. ముందుగా వినాయకపూజను ని ర్వహించారు.అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకం, దుర్గాగణ పతి హోమం, 108 కలశాలతో పూజలను జరిపారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయపూజారి సంతోష్‌కుమార్ శర్మ పూ జాదికాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వెంకటరమణమూర్తి, భా రతి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలతో పూజలు జరిపారు.