విజయనగరం

పోస్టుల భర్తీ అయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 14: వి జయనగరం మున్సిపాలిటీలో సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగాల పోస్టులు భర్తీ కావడం లేదు. ఫలితంగా పౌరసేవలు అందడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీతో ఇప్పటికైనా మున్సిపాలిటీలో ఖాళీ పో స్టులు భర్తీ అవుతాయానే ఆశతో పట్టణ ప్రజలు ఉన్నారు. గత కొనే్నళ్ల నుంచి మున్సిపల్ ఇంజనీర్, మున్సిపల్ ప్రజారోగ్యశాఖ, పట్టణ ప్రణాళిక విభాగంతోపాటు పరిపాలనా విభాగంలోనూ అనే క ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నా యి. మున్సిపాలిటీలో 2,44,598 జనా భా ఉండగా, 61,925 నివాస భవనాలు ఉన్నాయి. 40 వార్డులకు విస్తరించి ఉన్న మున్సిపాలిటీలో 72 నోటిఫైడ్ స్లమ్స్ ఉ న్నాయి. మున్సిపాలిటీలో తగినంతమ ంది అధికారులు, ఉద్యోగులు లేకపోవ డం వల్ల పౌరసేవలు సకాలంలో సక్రమ ంగా అందడంలేదు. ఒకవైపు జనాభా ..మరోవైపు పట్టణ విస్తీర్ణం పెరుగుతున్నా అధికారులు, ఉద్యోగుల సంఖ్య పెరగడం లేదు. ఈ విషయం పాలకవర్గానికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలకు ప్ర భుత్వం జీవో విడుదల చేయడంతో ఖా ళీ పోస్టులు భర్తీ అవుతాయనే గంపెడాశతో పట్టణ ప్రజలు ఉన్నారు. అయితే ఖాళీలను భర్తీ చేసే విషయంలో పాలకవర్గసభ్యులు ఇంతవరకు ఎటువంటి ప్ర యత్నాలు చేయలేదు. ఇప్పుడు ఖాళీల ను భర్తీ చేయకపోతే భవిష్యత్‌లో మ రిన్ని ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుందని, ఇప్పటికే పెరిగిన పని ఒత్తిడితో నానా అవస్థలు పడుతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులతోపాటు పలు మున్సిపాలిటీలకు బదిలీలపై వెళుతున్న ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని నియమించడం లేదు. సంవత్సరాల తరబడి ఇదే దుస్థితిని ఎదుర్కొనవల్సి వస్తుంది. మున్సిపాలిటీలో ఎస్టాబ్లిష్‌మంట్ విభాగంలో 132 మంది అధికారులు, ఉద్యోగులు ఉండవల్సి ఉం డగా, 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈనెల మొదటివారంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ నారాయణరావు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడటంతో ఆ పోస్టు ఖాళీ అయింది. మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి, పర్యావరణ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉం డగా, ఇక్కడ నియమితులైన టౌన్ ప్లా నింగ్ అధికారి శోభన్‌బాబు మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో డిప్యూటేషన్‌పై వెళ్లారు. కీలకమైన పోస్టులు కూడా భర్తీ కాకపోవడం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీలో అ త్యంత కీలకమైన మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి పోస్టు గత కొనే్నళ్ల నుంచి ఖా ళీగా ఉంది. ఈ పోస్టు ఖాళీగా ఉండట ంవల్ల పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయా రు కావడమే కాకుండా ఆ విభాగం అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరుపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ఈ విభాగంలో రెండు శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, నాలుగు హెల్త్‌అసిస్టెంట్, ఎనిమిది పిహెచ్‌సి మేస్ర్తి, 132 మంది పారిశుద్ధ్య కార్మికుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత కీలకమైన మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా చాలా పోస్టులు భర్తీ కావడం లేదు. రెండు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, మూడు బిల్డింగ్ ఓవర్‌సీపర్, 12 జూనియర్ అసిస్టెంట్, ఆరు రికార్డు అసిస్టెంట్, ఒక టిపి ట్రాసర్‌తో కలిపి 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.