విజయనగరం

అక్రమ కబేళాపై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, జూన్ 14: సాలూరు నియోజకవర్గ పరిధిలో పాచిపెంట మండలంలోని కోస్టువలస, బుట్టిగానివలస సమీపాన నిర్వహిస్తున్న అక్రమ కబేళాపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. 50 పశువులను, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సిఐ రామకృష్ణ మంగళవారం విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశాలో సిమిలిగూడ నుంచి అక్రమంగా తరలిస్తున్న పశువులను బుట్టిగానివలస వద్ద కబేళా నిర్వహించి పశువులను వధించే కార్యక్రమం చేపట్టారన్నారు. దాడిచేసిన సమయానికే 40 పశువులను వధించారని, బతికి ఉన్న 50 పశువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. సామర్లకోటకు చెందిన అబ్దుల్ ఖురేషీ నాయకత్వంలో 10 మంది వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నారని, వారిని అరెస్టు చేశామన్నారు. పశువులను వధించి మాంసాన్ని వాహనాల్లో తరలించడానికి వ్యాపారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసిందన్నారు. చట్టరీత్యా ఇటువంటి కార్యక్రమాలు నేరమని, నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, రూరల్ ఎస్‌ఐ షణ్ముఖరావు, పాచిపెంట ఎస్‌ఐ జిడి.బాబులు పాల్గొన్నారని చెప్పారు.