విజయనగరం

నీరు-చెట్టు పనుల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),జూన్ 16: నీరు-చెట్టు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలోని పలు చెరువులను అభివృద్ధిచేసే పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ చెరువు పనులను ఎమ్మెల్యే మీసాల గీత గురువారం పరిశీలించారు. పట్టణ పరిధిలోని కె. ఎల్.పురం, కణపాక ప్రాంతాల్లోని చెరువులు గుడిబండ, బుగతచెరువు, శివన్నచెరువు, మాన్యాలచెరువు, సీతమ్మచెరువు, చాకలి చెరువు, మహంతి చెరువులను ఆమె పరిశీలించారు. వర్షాలు రాకముందే చెరువు పనులను త్వరతగతిన పూర్తిచేయాలని ఇరిగేషన్ సిబ్బందికి ఆమె సూచించారు. చెరువులు అభివృద్ధి అయితే భూగర్భ జలాలు పట్టణ పరిధిలో పెరిగి నీటి సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ కోండ్రు శ్రీనివాసరావు, పట్టణ సర్వే అధికారులు పాల్గొన్నారు.