విజయనగరం

ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 16: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల కే సుల్లో బాధితులకు సత్వర న్యాయం జ రిగేలా, నిందితులకు శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎంనాయక్ ఆదేశించారు. కేసుల ప రిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కేసుల ధ్రువపత్రాలను అందించడంలో రెవెన్యూ అధికారులకు, సాక్షులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ న్యాయవాదులకు సూచించారు. కలెక్టరేట్ మీ టింగ్ హాలులో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం కలెక్టర్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష తగదని, ఈ విషయంలో ప్రజల్లో విస్తృత ప్ర చారం జరపాలన్నారు. కుల వివక్ష ఎక్కువగా ఉన్న గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పా రు. ప్రతినెల 30వ తేదీన పౌరహక్కుల దినంగా పాటిస్తూ రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అ ట్రాసిటీ కేసుల్లోని బాధితులకు తగిన పరిహారం అందించేందుకు, అవసరమై న రుణాల మంజూరుకు అధికారులు చ ర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 52 అట్రాసిటీ కేసుల్లో 11.17లక్షల రూపాయల పరిహా రం అందజేశామని, మరో 34కేసులలో 52 మంది బాధితులకు 27.67లక్షల రూ పాయల పరిహారం చెల్లించవల్సి ఉం ద ని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ సంవత్సర మొదటి మూడునెలల బడ్జె ట్ విడుదల కాగానే బాధితులకు పరిహారం అందజేస్తామని చెప్పారు. రామభద్రాపురం మండలం కోటసిర్లాం గ్రా మంలోని ఎస్సీ కాలనీలో కనీస వౌలిక వసతులు కల్పించడం లేదని దళిత సం ఘాల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తగిన చర్యలు తీసుకుంటామ ని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని దళిత వాడలలో అన్ని వౌలిక వసతుల ఏర్పాటుకు చర్య లు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో అవసరమైన కులధృవీకరణ పత్రాలు సకాలంలో అందజేయని కారణంగా కేసులు వీగిపోతున్నాయని ఎస్పీ కాళిదాసు సమావేశంలో తె లిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం సకాలం స్పందించాలన్నారు. సమావేశంలో అదనపు జెసి యుసిజి నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, విజయనగరం, పార్వతీపురం ఆర్‌డి ఓ లు శ్రీనివాసమూర్తి, గోవిందరావు, సాం ఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజు పాల్గొన్నారు.