విజయనగరం

జిల్లాలో ఘనంగా యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 21: ప్రపంచ యోగా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం పట్టణాలు, పల్లెలు యోగాలతో సందడిగా కనిపించాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థినీ, విద్యార్థులు యోగాలో పాల్గొని వివిధ ఆసనాలు ప్రదర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని టిటిడి కల్యాణమండంలో జిల్లా యంత్రాంగం, ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, అదనపు కలెక్టర్ నాగేశ్వర్‌రావు, డిఆర్వో జితేంద్ర, ఎమ్మెల్యే కెఎ నాయుడు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, విజయనగరం ఆర్డీవో శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమీషనర్ నాగరాజు యోగసనాలు వేశారు. గురుకృప యోగ కేంద్రం ఆధ్వర్యంలో విజినిగిరి యోగాశ్రమ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకురాలు అరుణకుమారి పర్యవేక్షణలో యోగసాధన, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నాడిశోధన ప్రదర్శనలు నిర్వహించారు. కెజిబివి, ఫోర్ట్‌సిటీ విద్యార్థులు యోగా డ్యాన్సులు ప్రదర్శించారు. మలిచర్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జలనేతి, సూత్రనేతి ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతిరాణి మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతి లభిస్తుందని, జీవితం అనందమయంగా మార్చుకోవచ్చనన్నారు. వ్యాయామం చేస్తున్నామనే కారణంగా యోగాను నిర్లక్ష్యం చేయవద్దని, వ్యాయా మంతో శారీరక ధృడత్వం లభిస్తుందని, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. శరీరం, మనసు ఏకీకృతం చేసి శ్వాసపై ధ్యాసపెట్టి ధ్యానం చేస్తే మానసిక ఆరోగ్యం లభిస్తుందని, ఫలితంగా బిపి, షుగర్, కొలెస్ట్రాల్ ధీర్ఘకాలిక వ్యాధులు తగ్గేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతు పిల్లలకు చిన్నప్పటి నుంచే యోగా అలవాటు వలన ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించవచ్చన్నారు. యోగాను ఆచరించడానికి వయసుతో పనిలేదని, అన్ని వయసుల వారు యోగా సాధన చేయవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ చైతన్య, వైద్యాధికారి డాక్టర్ వెంకటరావు పాల్గొన్నారు.
పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో..
జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం ఎస్పీ కాళిదాసు ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకురాలు అరుణకుమారి పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రాణాయామం, సూర్యనమస్కారం, విశ్రాంతి పద్దతులు, ధ్యాన విధానాలు, ఆసనాలు చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ యోగాతో పోలీసు అధికారులలో, సిబ్బందిలో మానసిక ధైర్యం, స్థైర్యం పెరుగుతుందని, శారీరక ధృడత్వం ఏర్పడి సంపూర్ణ ఆరోగ్యానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీ అప్పలనాయుడు, డిఎస్పీలు, సివిల్, ఏఆర్ విభాగాల సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
బిజెపి కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు సమీప ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. యోగా శిక్షకుడు రాజు యోగాలోని వివిధ అంశాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు రాజు మాట్లాడుతూ మనిషి ప్రతిరోజు యోగాసనాలు వేస్తే అంతర్గత రుగ్మతలు తొలగి ప్రశాంతంగా, ఆనందమయంగా జీవించడానికి అవకాశం ఉంటుందన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రావు మాట్లాడుతూ యోగాతో మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతారని చెప్పారు. మాజీ అధ్యక్షుడు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించటంలో ప్రధానమంత్రి మోదీ పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముద్దాడ మధు, వేణుసింగ్, లక్ష్మీనరసింహం, విద్యాస్వరూప్, దేవకీనందనరావు, గండికోట శాంతి పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల ధర్నా
విజయనగరం (్ఫర్టు), జూన్ 21: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ భద్రతకు భంగం వాటిల్లే జీవో- 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్, ఎంపారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవా రం ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు జీవో-279ను రద్దు చేయాలని, బకా యిపడిన వేతనాలను చెల్లించాలని, స్ట్రీట్ లైటింగ్, విలీన ప్రాంత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిప ల్ అసిస్టెంట్ కమిషనర్ ఎంఎం నాయుడుకు వినతిపత్రాన్ని అందజేశారు. పట్టణంలో రోజురోజుకీ సమస్యలు పెరుగుతున్నాయని, ఫలితంగా తాము అ నేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోయారు. జీవో-279 రద్దుతోపాటు పారిశుద్ధ్య కార్మికులకు బకా యిపడిన మూడునెలల వేతనాలను చెల్లించాలని కోరారు. ముషిడిపల్లి, నెల్లిమర్ల పంపుహౌస్ కార్మికులకు గత కొ న్నినెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, తక్షణమే వేతనాలను చెల్లించాలని అసిస్టెంట్ కమిషనర్ నాయుడుకు విన్నవించుకున్నారు. 16మంది స్ట్రీట్ లైటింగ్ కార్మికులకు పని కల్పించాలని, విలీన పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. ఈ సమస్యలను ప రిష్కరించకపోతే ఆందోళన చేయక తప్పదని వారు హెచ్చరించారు.
గిరిజనులకు రహదార్ల సౌకర్యం కల్పనపై దృష్టి
కలెక్టర్ ఎంఎం నాయక్
పార్వతీపురం, జూన్ 21: గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు రహదార్ల సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ అన్నారు. మంగళవారం రాత్రి పార్వతీపురం ఐటిడిఎ కార్యాలయంలో వివిధశాఖల ఇంజనీరింగ్ అధికారులతో సబ్‌ప్లాన్ పరిధిలోని రోడ్ల అభివృద్ధిపై సమీక్ష చేశారు. రోడ్ల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు,సలహాలు అందించారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో నాయక్ మాట్లాడుతూ సబ్‌ప్లాన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులు(టిఎస్‌పి) రూ.15కోట్లు మంజూరయ్యాయన్నారు. అయినప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మండలానికి ఐదురోడ్ల వంతున 49గ్రామాలకు రహదార్ల సౌకర్యం కలిగే విధంగా 42రహదార్ల నిర్మాణానికి రూ.73కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పిఆర్ ఇంజనీరింగ్ అధికారులు అందించారన్నారు. ఈ రోడ్లకు నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి కింద గిరిజన ప్రాంతాల్లో డ్రిప్ ద్వారా గిరిజనులు జీడి,మామిడి అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. అంతర్ పంటలు సాగుకోసం గిరిజన రైతాంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ప్రస్తుతం జీడితోటలతోపాటు కొత్తగా మరో ఐదువేల ఎకరాల్లో జీడిపంటలు పండించడానికి ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా పార్వతీపురం ఐటిడిఎ పిఓ సబ్‌ప్లాన్ గ్రామదర్శిని చేపట్టడానికి ప్రత్యేకాధికారులను నియమించి ఆయాప్రాంతాల్లో అమలు జరుగుతున్న దోమల నివారణ స్రేయింగ్, జీడిపునరుద్ధరణకు రైతులకు అవగాహన, మాతృ, శిశుమరణాల నివారణ చర్యలు, డ్రాపవుట్స్ నిరోధించడం, తాగునీరు అంశాలపై పరిశీలనకి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు అగ్రికల్చర్ ఆఫీసర్, డిప్యూటీ డిఎం హెచ్‌ఒ పోస్టులు భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రసన్నవెంకటేష్, గిరిజన సంక్షేమశాఖ ఇఇ సుబ్బారావు, పిఆర్ ఎస్‌ఇ రమణమూర్తి, ఇఇ గజేంద్ర, డిఇఇ శ్రీనివాసరావు, డిఇఇ వెంకటరావు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంపై
అవగాహన కల్పించాలి
* కలెక్టర్ ఎంఎం నాయక్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూన్ 21: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరుగుదొడ్లతో ఉపయోగం, నిర్మాణం, వినియోగంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులకు సూచించారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని కోరారు. బుధవారం యూత్ హాస్టల్‌లో ఎంపిడిఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, సిఆర్‌పిలకు వాటర్ ఎయిడ్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం నిర్వహించారు. ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ నాయక్ మాట్లాడుతు బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనతో ప్రబలే అంటువ్యాధులపై ప్రజల్లో ప్రచారం చేయాలని, మరుగుదొడ్ల నిర్మాణం, తప్పనిసరి వినియోగం, నీరు అందుబాటులో లేని సమయంలో వాటి వినియోగం అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన నిర్మూలన, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంపై ప్రజలను చైతన్యపరచే కార్యక్రమాలు చేడుతున్నా ఆశించిన ప్రయోజనాలు రావటం లేదని చెబుతూ ప్రజల్లో మరింత విస్తృత ప్రచారం జరగాలన్నారు. ఇప్పటివరకు మండల పరిషత్ అధికారులు గ్రామస్థాయిలో పర్యటించి మరుగుదొడ్లపై ప్రజలకు అవగాహన నిర్వహించారని, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అన్ని శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో విస్తృత ప్రచారం, అవగాహన చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి వెంటనే మరుగుదొడ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ రాజకుమారి, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్‌ఇ రమణమూర్తి, వాటర్ ఎయిడ్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంతల్లో వౌళిక సదుపాయాలు కల్పించాలి
* పంచాయతీ అధికారులకు డిపిఓ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూన్ 21: జిల్లాలోని అన్ని సంతల్లో వౌళిక సదుపాయాలు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు ఆదేశించారు. మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ విస్తరణాధికారులు, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి సంతలో మంచినీరు, షెడ్లు, ర్యాంపు వౌళిక సదుపాయాలతోపాటు సిసి కెమెరాల ఏర్పాటుకు సంత వేలం పాటదారులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. ఈనెల 25వతేదీన పెదమానాపురం సంతను తనిఖీ చేస్తామని చెప్పారు. అదే విధంగా 27న అలమండ సంతలో కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. ఆరు ప్రధాన సంతలకు వారం రోజుల్లో కమిటీలు వేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంతల్లో ఏర్పాట్లు జరగాలన్నారు. ఏపి గో-సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిస రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో కేవలం పెదమానాపురం, అలమండ సంతల్లోనే గోవుల సంరక్షణకు మానటరింగ్ కమిటీ ఏర్పాటు కోసం సంతలకు నోటీసులు ఇచ్చారని, మిగిలిన సంతలు అచ్యుతాపురం, మోపాడ, కందివలస, బలిజపేట, అడ్డపుశీల కార్యదర్శులు కమిటీలు ఏర్పాటు చేయకుండా నోటీసులు ఇవ్వకుండా జాప్యం చేయటంపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరారు. దీనికి ఆయన సందిస్తూ ఈ సంతలకు వారంలో రోజుల్లో నోటీసులు జారీ చేసి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.

జ్యూట్, ఫెర్రో మిల్లులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
* వైకాపా అనుబంధ ట్రేడ్ యూనియన్ విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూన్ 21: ఉత్తరాంధ్రలో జ్యూట్ మిల్లు పరిశ్రమలు, ఫెర్ల్రో ఎల్లారుూస్ పరిశ్రమలు మూతపడినా ప్రభుత్వం, జిల్లా మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనేరు సురేష్, జిల్లా అధ్యక్షుడు వి.నాగరాజు విమర్శించారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జ్యూట్ పరిశ్రమ మూసివేతతో ఉత్తరాంధ్రలో 36వేలమంది కార్మికులు రోడ్డుపాలు అయ్యారని చెప్పారు. జిల్లామంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గం చీపురుపల్లి ప్రాంతంలో ఎనిమిది ఫెర్ల్రో అల్లారుూస్ పరిశ్రమలు మూతపడటంతో 15వేలమంది కార్మికులు వీధిపాలయ్యారని అన్నారు. కార్మికశాఖ మంత్రి కేవలం ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికి సమయం కేటాయిస్తున్నారే తప్ప కార్మికుల మంచిచెడులను ఆలోచించటం లేదని ఆరోపించారు. విమాన ఇంధనం ధరలపై 15శాతం పన్ను తగ్గించిందని ఆనందం వ్యక్తం చేస్తున్న కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజుకు ఓట్లు వేసిన సామాన్యుల సేవకు బదులు విమానంలో ప్రయాణం చేసే పెద్దలే ముఖ్యంగా భావిస్తున్నారని విమర్శించారు. జ్యూట్, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల మూతపడిన కారణంగా ఉపాధికోల్పోయి రోడ్డున పడిన కార్మికుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు తాకుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికులు, పంటలకు గిట్టుబాటు ధర లభించని రైతులు, ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. విలేఖరుల సమావేశంలో ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు తాట్రాజు కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నవాబ్‌ఖాన్ పాల్గొన్నారు.

రాయితీ లేని వరి విత్తనాలు మాకెందుకు?
* వరి విత్తనాల పంపిణీలో రైతుల నిరసన
కొత్తవలస, జూన్ 21: మండల కేంద్రంలో ఎట్టకేలకు ప్రభుత్వపరంగా వరి విత్తనాల పంపిణీ మంగళవారం అధికారులు చేపట్టారు. మండల వ్యవసాయ అధికారి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రైల్వేగేటు ప్రాంతంలోని ఎ.కోటపాడు రహదారిలో ప్రైవేటు ఏజెన్సీద్వారా విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాజన్న మాట్లాడుతు ప్రభుత్వం ముందస్తుగా ఏరువాక చేపట్టిందని, రైతులకు అవసరమైన వరి విత్తనాలు అన్ని మండల కేంద్రాల్లో సిద్ధం చేసిందన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను రాయితీపై తీసుకోవాలన్నారు. దీనికి రైతులు స్పందిస్తూ రైతులకు అవసరమైన విత్తనాలు ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారని, రాయితీ ఎత్తివేసి అధిక ధరల కు అమ్ముతున్నారని నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కువగా ఉపయోగిస్తున్న స్వర్ణరకం వరి విత్తనాలకు రా యితీ ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నించారు. సోనామసూరి రకాన్ని నేరుగా ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యవసాయ అధికారి స్పందిస్తూ రాయితీ వచ్చిన వెంటనే రైతులకు అందజేస్తామని తెలిపారు. ప్రైవేటు డీలర్ వద్ద లభిస్తున్న ధరలకన్నా ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరుస్తామని నాయకులు రైతులకు సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఎంపిటిసి సూరిబాబు, జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు తిక్కాన చినదేవుడు, మండల టిడిపి అధ్యక్షుడు కోళ్ల శ్రీను పాల్గొన్నారు.

నేరాల అదుపునకు సిసి కెమెరాల ఏర్పాటు
గజపతినగరం, జూన్ 21: జాతీయ రహదారులపై ప్రమాదాలతోపాటు నేరాల అదుపుచేయడానికి సిసి కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని గజపతినగరం సిఐ విజయనాథ్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలలు, రైస్‌మిల్లర్ల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ విజయనాథ్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరగటంవలన పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అదే విధంగా గుర్తు తెలియన వాహనాలు పాదచారులను, ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి వెళ్లిపోవటం వలన బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆధారం లేకుండా పోతోందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గజపతినగరం, బొండపల్లి, పెదమానాపురం, పోలీసు స్టేషన్ల పరిధిలో జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్లలో రెండు రోజుల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. దీనికి ప్రజల సహకారం అవసరమన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుకు సహకారం అందించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. సిసి కెమెరాల ఏర్పాటుతో ముఖ్యమైన కేసులలో సాక్ష్యాలు లభించే అవకాశం ఉందని, వాహనదారులు నిబంధనలు అతిక్రమించకుండా చూడవచ్చనని చెప్పారు. సమావేశంలో ఎస్సై వరప్రసాద్ పాల్గొన్నారు.

ట్రాక్టరు బోల్తా: డ్రైవర్ మృతి
బొండపల్లి, జూన్ 21: మండలంలోని గరుడుబిల్లి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ వసంత అప్పన్న (28) అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో దుక్కులు దున్ని అనంతరం గరుడుబిల్లి గ్రామంలో ట్రాక్టర్ పెట్టడానికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. డ్రైవర్ వసంత అప్పన్నది బొండపల్లి స్వగ్రామం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అప్పన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.

ఆటో, వ్యాను ఢీ.. ఇద్దరు మృతి
దత్తిరాజేరు, జూన్ 21: మండల పరిధిలోని కోరపు కొత్తవలస జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఆటో-వ్యాన్ ఢీ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కొత్తవలస నుంచి గజపతినగరం వైపు వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో ఏడుగురు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన విశాఖ, విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న మండలంలోని కొండ కొత్తవలసకి చెందిన కిలపర్తి సతీష్(19), విజయనగరం ఆసుపత్రులో చికిత్స పొందుతున్న ఒడిశాలోని టిట్లాఘర్‌కు చెందిన వ్యాన్‌డ్రైవర్ సాహు (30) మంగళవారం మృతి చెందారు. ఆటోలో ప్రయాణం చేస్తున్న మృతుడు సతీష్ తల్లికి కాలు విరిగింది. ఎస్.బూర్జవలస ఎస్సై బాబూరావు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.