విజయనగరం

రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 23: పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆదేశించారు. గంటస్తంభం జంక్షన్ నుంచ్ పాత బస్‌స్టాండ్ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా కల్వర్టు పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎటువంటి లోపాలు లేకుండా నిర్మాణపనులు చేపట్టాలని తెలిపారు. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం, ప్రకాశం పార్కు తదితర ప్రాంతాలలో వర్షం నీరు నిలిచిపోతోందని, కాలువలు, కల్వర్టుల నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మూడు కోట్ల రూపాయలతో రోడ్డు, కల్వర్టు, కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వీటిని త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజల రాకపోకలకు మార్గం సుగమం ఏర్పడుతుందని అన్నారు. వుడా అసిస్టెంట్ ఇంజనీర్ వి.రవిశంకర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా నిర్మాణపనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే విజయనగరం పైడితల్లి జాతర నాటికీ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు పాల్గొన్నారు.