విజయనగరం

పోలీసు సిబ్బందికి బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 23: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న ఎఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లకు బదిలీలు జరిగాయి. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కాళిదాసు బదిలీల కౌనె్సలింగ్ నిర్వహించారు. పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం మైదాన ప్రాంతాలలోని పోలీసుస్టేషన్లలో ఐదు సంవత్సరాలు, ఏజెన్సీ ప్రాంత పోలీసుస్టేషన్లలో మూడు సంవత్సరాలు పనిచేసిన ఎఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లకు బదిలీలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు గురువారం జరిగిన కౌనె్సలింగ్‌కు 44మంది ఎఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు హాజరయ్యారు. వీరు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఎస్పీ కౌనె్సలింగ్ నిర్వహించి వివిధ పోలీస్ స్టేషన్లలో కొత్త పోస్టింగులు ఇచ్చారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణ, డిఎస్పీలు త్రినాథ్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.