విజయనగరం

లాకౌట్ ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మార్చి 21: జూట్ పరిశ్రమ యాజమాన్యాల తీరువలన మూతపడిన జూట్ మిల్లులను వెంటనే తెరిచే విధంగా చర్యలు తీసుకుని కార్మిక కుటంబాలను ఆదుకోవాలని ఇఫ్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇఫ్టూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం జూట్ మిల్లు ల అక్రమలాకౌట్‌లను ఎత్తివేయాలని కోరుతూ రైల్వేస్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూట్ యాజమాన్యాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. జిల్లాలోని పలు జూట్ మిల్లులు ఇటీవల కాలంలో మూతపడటం మూలంగా వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారని ఆవేదన ఆవ్యక్తం చేసారు. కొత్తవలసలో ఉమాజూట్ మిల్లు, సాలూరు జీగిరాం జూట్ మిల్లుల యాజమాన్యాలు అక్రమంగా మిల్లును మూసివేసి నెపం కార్మికులపై,నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కార్మికశాఖ, యూనియన్ సమక్షంలో ఏర్పాటు చేసే సంయుక్త సమావేశాలకు యాజమాన్యం హాజరు కాకుండా హక్కులను హరించివేస్తున్నదని అన్నారు. పట్టించుకోవాల్సిన కార్మికశాఖ చేతులెత్తేసిందని ఆవేదన వక్తం చేసారు. పనిచేసిన కాలానికి వేతనం చెల్లించకుండా ఆయా యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలను ఆయన ఖండించారు. అక్రమలాకౌట్‌లు ఎత్తివేసి, వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జిల్లా యంత్రాగం జోక్యం చేసుకుని కార్మికులకు న్యా యం చేయాలని కోరారు. ఈ ఆందోళనలో ఇఫ్టూ జిల్లా కార్యదర్శి సన్యాసిరావు, మల్లిక్ , రమణి, కార్మికులు పాల్గొన్నారు.