విజయనగరం

అణువిద్యుత్ కేంద్రాలు పర్యావరణానికి ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరం, జూలై 3: అణువిద్యుత్ కేంద్రాలు పర్యావరణానికి, ప్రజల మనుగడకు ప్రమాదకరమని ప్రముఖ సామాజిక, పర్యావరణవేత్త ఇ.ఎ.ఎస్.శర్మ తెలిపారు. ఆదివారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభలో ముఖ్యఅతిధిగా శర్మ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు- ప్రమాదాలు- ప్రత్యామ్నాయ మార్గాలు అనే అంశంపై మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అణువిద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, సంభవించిన ప్రమాదాలను ప్రస్తావించారు. రష్యాలోని చెర్నోబిల్, అమెరికాలోని కాలిఫోర్నియ, మనరాష్ట్రంలో, జపాన్‌లోని పుకుషిమా అణువిద్యుత్ కర్మాగారాలలో సంభవించిన ప్రమాదాల నుండి గుణపాఠం నేర్చుకోవల్సిన పాలకులు దేశంలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అత్యుత్సాహం చూపుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నెలకొల్పనున్న అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయంలో ప్రజల భద్రతకు ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటైతే 300 కిలోమీటర్ల పరిధిలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. 1983లో చెర్నోబిల్ అణువిద్యుత్ కర్మాగారంలో ప్రమాదం సంభవిస్తే ఇప్పటికీ అణుధార్మిక వాయువులను, రేడియేషన్‌ను నియంత్రించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. కాలిఫోర్నియాలో 30ఏళ్ల కిందట ప్రమాదం జరగటంతో ఇప్పటివరకు అమెరికాలో కొత్తగా అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సాహసించలేదని చెప్పారు. జపాన్‌లోని పుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో సంభవించిన ప్రమాద విలువ ఐదులక్షల కోట్ల రూపాయలని చెప్పారు. మనదేశంలో ఐదువేల మెగావాట్ల అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయని, 60వేల మెగావాట్లకు ఈ సామర్థ్యం పెంచేందుకు మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసిందన్నారు. తమిళనాడులోని కుడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో సంభవించిన ప్రమాదాలను ఆయన వివరించారు. దక్షిణ కొరియాలోని అణువిద్యుత్ కేంద్రాలకు యూరోపియన్ దేశాలు సరఫరా చేసిన పరిజ్ఞానం సబ్‌స్టాండర్డ్‌తో ఉందని అక్కడి ప్రభుత్వం గ్రహించి ప్రజల మనుగడే ముఖ్యంగా భావించి దేశంలోని రెండు అణువిద్యుత్ కర్మాగారాలను మూసివేసిందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు వద్దనుకున్న అణువిద్యుత్ కేంద్రాలను మనదేశంలో ఏర్పాటుకి కారణం లాభాల కోసమేనని స్పష్టం చేశారు. కర్మాగారాలు ఏర్పాటుచేసే కంపెనీలకు ఇక్కడి ప్రజల సంక్షేమం, పర్యావరణ సమస్యలపై బాధ్యత ఉండదన్నారు. ప్రజలకు ప్రశ్నించే హక్కు లేనంతవరకు సమాజం ముందుకు పోదని చెప్పారు. ప్రమాదకరమైన అణు ఇంధన టెక్నాలజీని మనదేశంలో ఏర్పాటు చేయడం మంచిదికాదని హితవు పలికారు. న్యూక్లియర్ కర్మాగారాలు అరచేతిలో వైకుంఠం వంటివని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకటరావు, జిల్లా కార్యదర్శి రాజగోపాల్, సహకార్యదర్శి సత్యంనాయుడు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు శివానందకుమార్, రమణప్రభాత్ పాల్గొన్నారు.