విజయనగరం

వర్షాకాలం ప్రారంభంతోనే జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 3: వర్షాకాలం ప్రారంభంతోనే జిల్లాలో సీజనల్ వ్యాధులు తీవ్రతరం అవుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు హడలెత్తిపోతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు ఏర్పాట్లు చేశామని, వ్యాధిగ్రస్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా ఆసుపత్రులలో సీజనల్ వ్యాధులతో వస్తున్న రోజుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభంతోనే రోగుల సంఖ్య పెరుగుతుంటే ఇక జోరు వర్షాలు కురిస్తే జిల్లాలో సీజనల్ వ్యాధుల పరిస్థితి ఎలా ఉంటుందోనని కిందిస్థాయి వైద్య సిబ్బంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో డెంగ్యూ, డయేరియా బాధితులు ఆసుప్రతుల చుట్టూ తిరుగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో మలేరియా వ్యాధి లక్షణాలు ఇప్పుడిప్పుడే మొదలైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే కొందరు డెంగ్యూ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. కొత్తవలస ప్రాంతంలో డయేరియాతో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మరణించగా, మండలంలోని పలు గ్రామాల్లో డయేరియాతో జనాలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. జామి మండలంలోని పలు గ్రామాల్లో విషజ్వరాలు సోకటం మొదలైంది.
వర్షాకాలం ప్రారంభమైందంటే జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పార్వతీపురం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో మలేరియా ప్రబలటం సర్వసాధారణంగా మారింది. మలేరియా నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికార యంత్రాంగం చెబుతున్నా మొక్కుబడి చర్యగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా వ్యాధిసోకిన ప్రజలకు వైద్యసదుపాయం అందించడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి సమస్యగా మారింది. వ్యాధిసోకిన వెంటనే వైద్యం కోసం ఆసుత్రులకు రాకుండా జాప్యం చేయటం, వ్యాధి తీవ్రమైన తరువాత ఆసుపత్రులకు రావటంతో వ్యాధి నివారణ విషయంలో రోగులు, ఆసుపత్రి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాలకు వైద్యసిబ్బంది వెళ్లటం కూడా ఇబ్బందికరంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, గ్రామాలకు మధ్య దూరం బాగా ఉండటంతో రోగాలపై సమాచారం అందటం ఆలస్యమైతే, వైద్యం అందించటం కోసం సిబ్బంది అక్కడకు వెళ్లటం సమస్యగా మారింది. రవాణా సౌకర్యాలు లేక కొన్ని ప్రాంతాల నుంచి రోగులు ఆసుపత్రులకు రావాలన్నా, వైద్యసిబ్బంది అక్కడకు వెళ్లాలన్నా కాలినడకన వెళ్లవలసిన పరిస్థితి. కొన్ని ఆరోగ్య కేంద్రాలకు అంబులెన్సులు ఉన్నా డ్రైవర్ల కొరత కారణంగా ఉపయోగం లేకుండా పోయింది.
జిల్లాలో ఈ సీజన్‌లో విషజ్వరాలు ప్రబలటానికి పారిశుద్ధ్య లోపం ప్రధాన కారణమని చెప్పవచ్చు. వర్షాకాలం ప్రారంభానికి ముందు సీజనల్‌లో తీసుకోవల్సిన జాగ్రత్తలపై జిల్లా ఉన్నతాధికారులు సమీక్షలు, సమావేశాలు జరిపి కిందిస్థాయి అధికారులకు, సిబ్బందికి హెచ్చరికలు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. పట్టణ స్థాయిలో, గ్రామస్థాయిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవల్సిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పారిశుద్ధ్యంపై ప్రశ్నిస్తే నిధుల కొరత కారణమని చెబుతూ చేతులు ఎత్తివేస్తున్నారు. గోతులలో నీరు నిల్వ లేకుండా, మురికినీరు మంచినీటి పథకాలలో కలవకుండా, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా సీజన్ ప్రారంభంతోనే వ్యాధుల ప్రభావం మొదలై ప్రజలను హడలెత్తిస్తున్నాయి.