విజయనగరం

9,600 ఖైనీ ప్యాకెట్ల బస్తాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జూలై 7: మండలంలోని బొండపల్లి జాతీయ రహదారి సముదాయానికి ఆనుకుని ఉన్న ముద్దూరు బి.టి.రోడ్డు వద్ద బుధవారం రాత్రి గజపతినగరానికి చెందిన మాటూరి ప్రకాశరావు వద్ద నుండి సుమారు 9,600 ఖైనీ ప్యాకెట్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నామని హెచ్‌సి పైడితల్లి తెలిపారు. ఒడిశా నుండి విజయనగరం వైపు మినీ వ్యాన్‌లో ఖైనీ ప్యాకెట్లు తీసుకువెళుతున్నారని, బొండపల్లి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ముద్దూరు గ్రామానికి వెళ్లే బి.టి.రోడ్డు వద్ద ఖైనీ ప్యాకెట్లను మరొక వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 50వేల రూపాయలు ఉంటుందని, ఈమేరకు ప్రకాశరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.