విజయనగరం

రూ. 20 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి (రూరల్), జూలై 8: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేపడుతున్న స్మార్ట్‌పల్స్ సర్వేను అధికారులు సక్రమంగా చేపట్టాలని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు కోరారు. ఈ మేరకు రాజదర్బార్‌లో శుక్రవారం స్మార్ట్‌పల్స్ సర్వేను ప్రారంభించి బయోమెట్రిక్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలన్నారు. ఇంటింటికి వెళ్లి సక్రమంగా సర్వే నిర్వహించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. ఎప్పటికప్పుడు సర్వేలను ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. సుమారు 20 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి పిల్ల కాలువల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఏ గ్రామంలోనైనా రక్షిత మంచినీటి పథకాలు లేనిపక్షంలో తక్షణమే మంజూరు చేస్తారన్నారు. అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో స్వచ్చమైన నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.