విజయనగరం

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 22: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, తదితర ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల ఉద్యోగులు, సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితర కేడర్ల ఉద్యోగులను రెగులర్ చేయాలని, 10వ పిఆర్‌సిని అమలు చేయాలని, ఈలోగా టైమ్‌స్కేల్ వర్తింపజేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపారు. డిఎ, హెచ్‌ఆర్‌ఎల విషయంలో కూడా స్పందన లేదని అన్నారు. తమ సమస్యలను సత్వరం పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని స్పష్టంచేసారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసులు ధర్నా చేస్తున్న సిబ్బందికి ఫోన్‌ద్వారా సంఘీభావం ప్రకటించారు. అదే విధంగా కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ స్వామినాయుడు, ప్రొఫెసర్ సరస్వతి, టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.కె.వలీ తదితరులు ధర్నా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల నాన్‌టీచింగ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేశవరావు, ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కార్యదర్శి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.