విజయనగరం

పరుగందుకోని పల్స్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 15: రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న స్మార్ట్ పల్స్ సర్వే జిల్లాలో నత్తనడక నడుస్తోంది. మొదట్లో అవసరాల మేరకు ట్యాబ్‌లు సరఫరా జరగకపోవటం, ఆ తరువాత ఎన్యుమరేటర్లకు ఇచ్చిన 2-జి సిమ్‌లతో సర్వే సాగకపోవటంతో మొదటి రెండు, మూడురోజులు నిలచిపోయిన సర్వే జిల్లాయంత్రాంగం తీసుకున్న చర్యలు, ఇన్‌చార్జ్‌ల ఒత్తడితో ఆ తరువాత కొంతమేరకు సర్వే మొదలైనా సర్వర్ సమస్య కారణంగా మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. 45రోజుల్లో జిల్లావ్యాప్తంగా సర్వే పూర్తిచేయాలని జిల్లాయంత్రాంగం లక్ష్యంగా తీసుకోగా ఇప్పటికే పదిరోజులు కావస్తుండగా పదిశాతం సర్వే కూడా పూర్తికాలేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాను 1850 బ్లాకులుగా విభజించి స్మార్ట్ పల్స్ సర్వే చేపట్టాలని జిల్లాయంత్రాంగం నిర్ణయించింది. దీనికోసం రెండువేలమంది ఎన్యుమరేటర్లు, మరో రెండువేల మంది అసిస్టెంట్లను నియమించి వీరికి విడతల వారీగా శిక్షణా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. ఈనెల ఎనిమిదిన లాంఛనంగా సర్వే ప్రారంభమయింది. కానీ మొదటినుంచి సర్వే కార్యక్రమం బాలారిష్టాలు ఎదుర్కుంటూ వస్తోంది. సర్వే ప్రారంభం నాటికి ఎన్యుమరేటర్లకు పూర్తిస్తాయిలో ట్యాబ్‌లు అందించలేకపోయారని సమాచారం. దాంతో జిల్లాయంత్రాంగం 2-జి సిమ్‌ల స్థానంలో 3-జి సిమ్‌లు ఇవ్వాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించింది. సిమ్‌ల సామర్థ్యం పెరిగినా సర్వే ముందుకు కదలటం లేదని అధికార వర్గాల సమాచారం. చాలాచోట్ల సర్వర్లు పనిచేయకపోవటంతో ఎన్యుమరేటర్లు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచలేకపోతున్నారు.
రోజుకు 14మంది సమాచారాన్ని సేకరించవలసిన ఎన్యుమరేటర్లకు సాంకేతిక ఇబ్బందుల కారణంగా నలుగురు, ఐదుగురి సమాచారాన్ని సేకరించటం గగనంగా మారింది. విజయనగరం పట్టణంలో 175మంది ఎన్యుమరేటర్లతో వారం రోజులుగా సర్వే జరపగా, ఇప్పటి వరకు కేవలం 22ఇళ్లలో మాత్రమే సర్వే పూర్తిచేయడాన్ని గమనిస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. కలెక్టర్ ఎంఎం నాయక్ స్వయంగా రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ట్యాబ్‌లు పూర్తిస్థాయిలో పనిచేసి, నెట్‌వర్క్, సర్వర్ల పనితీరు మెరుగుపడి సర్వే పూర్తిస్థాయిలో ప్రారంభం కావటానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందో, సర్వే ఎప్పుడు పూర్తిచేస్తామోనని ఇటు ఎన్యుమరేటర్లు, దిగాలు పడుతున్నారు.