విజయనగరం

ప్రాణాలతో బయటపడతామనుకోలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, జూలై 15: పగలంతా పోలీసుల భద్రతా వలయంలో గడిపాం, రాత్రిపూట ప్రయాణం సాగించాం. బతుకుజీవుడా అంటూ ఎలాగోలా బయటపడ్డాం అంటున్నారు అమర్‌నాథ్‌యాత్రకు వెళ్లివచ్చిన సాలూరు పట్టణవాసులు. కొద్దిరోజుల క్రితం పట్టణానికి చెందిన పూజ్యం రామకృష్ణ, అన్నపూర్ణ దంపతులతో పాటు 15 మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరారు. వీరు యాత్రకు బయలుదేరే సమయానికి జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు లేవు. కానీ వారు ఈ నెల 8వ తేదీన జమ్ము ప్రాంతానికి చేరేసరికి అక్కడి తీవ్రవాదులు, పోలీసుల మధ్య భీకరపోరాటం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ యాత్ర ఎలా సాగిందనేది రామకృష్ణ దంపతులు శుక్రవారం విలేఖర్లకు వివరించారు. భయాందోళన మధ్య కొంతమంది యాత్రికులు అమర్‌నాథ్‌కు వెళ్లకుండా జమ్ములోనే వైష్ణవిదేవి ఆలయాన్ని దర్శించుకొని వెనుదిరిగారు. అయితే రామకృష్ణ మాజీ ఆర్మీ ఉద్యోగి కావడం, గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉండడంతో అమర్‌నాథ్‌యాత్రను ఎలాగైనా పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు. ఈ నెల 8న జమ్ము ప్రాంతంలోని భగవతీనగర్ యాత్రా నివాస్‌కు చేరుకున్నామన్నారు. అప్పటికే అక్కడ తీవ్రవాదులు, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో, కర్ఫ్యూ విధించడంతో యాత్రికులను పూర్తి బందోబస్తుల మధ్య బస చేయించారన్నారు. అక్కడి నుంచి రాత్రిపూట బాల్తాల్ ప్రాంతానికి బయలుదేరామన్నారు. తాము ప్రయాణిస్తున్న ప్రతీ బస్సుకి ఒక సాయుధ పోలీసును అప్పగించారన్నారు. శ్రీనగర్ మీదుగా బాల్తాల్ చేరుకున్న సమయంలో హిజుబుల్ ఉగ్రవాది బూర్హాన్ పోలీసుల కాల్పుల్లో మరణించినట్టు సమాచారం అందిందన్నారు. దానికి ప్రతిగా ఉగ్రవాదులు ప్రతీకార దాడులు తీవ్రతరం చేశారన్నారు. బాల్తాల్ బేస్‌క్యాంపులో పూర్తి రక్షణ మధ్య తమను నిలిపివేశారన్నారు. 9వ తేదీన గుర్రాలు, డోలీలు ద్వారా అమర్‌నాథ్‌కు చేరుకున్నామన్నారు. ఆ రాత్రి అమర్‌నాథ్‌లోనే బస చేశామన్నారు. అయితే యాత్ర పొడవునా మార్గమధ్యంలో విశ్వహిందు పరిషత్, భజరంగ్‌దళ్ లాంటి హిందూసంస్థలు ఉచితంగా తినుబండారాలు, ఆహారాన్ని అందించాయన్నారు. హిందూధార్మిక సంస్థలు అందించిన సేవలు మరువలేనివన్నారు. 10వ తేదీ ఉదయాన తిరుగుప్రయాణం చేపట్టామన్నారు. జమ్ము, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో యుద్ధవాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 10 వరకు బాల్తాల్‌లో యాత్రికులను నిలిపివేశారన్నారు. 10న బయలుదేరడానికి అనుమతించారన్నారు. అక్కడి నుంచి తిరుగుప్రయాణంలో శ్రీనగర్ నుంచి 11వ తేదీ ఉదయం 4 గంటలకు బయలుదేరామన్నారు. అవంతీపూర్ వచ్చేసరికి కర్ఫ్యూ కారణంగా నిలిపివేశారన్నారు. అక్కడ ఉన్న గురుద్వార్‌లో రాత్రికి బసచేసి రాత్రి 12.30 గంటలకు బయలుదేరామన్నారు. పూర్తి రక్షణలో పోలీసులు 12వ తేదీ ఉదంపూర్‌కు చేర్చారన్నారు. అక్కడి నుంచి జమ్ము చేరుకొని ఇంటికి చేరామన్నారు. తిరుగుప్రయాణానికి సంబంధించి చేసుకున్న రిజర్వేషన్లు అన్నీ రద్దయ్యాయన్నారు. షెడ్యూల్ ప్రకారం కొనసాగకపోవడంతో అధికంగా నష్టం జరిగిందన్నారు. ఎలాగోలా బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని అక్కడి నుంచి బయటపడ్డామని రామకృష్ణ, అన్నపూర్ణ దంపతులు చెప్పారు.
అమర్‌నాథ్‌యాత్ర వల్ల 90 శాతం లబ్ధి ముస్లింలకే
ప్రతీఏటా అమర్‌నాథ్ యాత్రకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది హిందువులు వెళుతుంటారు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టుకొని పవిత్ర అమర్‌నాథ్‌యాత్రను దర్శించుకోవాలని భావిస్తుంటారు. ఇక్కడ యాత్రకు వెళ్లే భక్తుల నుంచి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయంలో 90 శాతం ముస్లిం కుటుంబాలకే చేరుతుందన్నారు. యాత్ర దారిపొడవునా వాహనాలు నడిపేవారు, దుకాణాలను నిర్వహించేవారు, గుర్రాలు, డోలీలు నడిపేవారు అత్యధికంగా ముస్లిం కుటుంబాలే అన్నారు. అలాంటి సందర్భంలో ఇటువంటి తీవ్రవాద ఆటంకాల వల్ల ముస్లిం కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం యాత్రికుల రక్షణకు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా ఆటంకాలు అడుగడుగునా తప్పడం లేదన్నారు. ముస్లిం తీవ్రవాద సంస్థల చర్యల వల్ల అధికశాతం ముస్లింల జీవనోపాధికి దెబ్బతీస్తున్నామనే విషయాన్ని గ్రహించకపోవడం దారుణమని రామకృష్ణ అన్నారు.