విజయనగరం

బాబుపై ప్రజలకు నమ్మకం పోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 17: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనలో అవలంభించిన అప్రజాస్వామ్య విధానాలు, అవినీతి, అవకతవకలతో ప్రజలు విసిగిపోయారని వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు విమర్శించారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వారిద్దరు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించి రాష్ట్ర ప్రజలను మోసగించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడితే తమ కుటుంబాలు బాగుపడతాయని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, పింఛన్లు ప్రయోజనాలు దక్కుతాయని రాష్ట్ర ప్రజలు ఆశించగా చంద్రబాబుపాలన అందుకు భిన్నంగా కొనసాగుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయడం లేదని, అప్పటిలో మంజూరు చేసిన పింఛన్లను కుంటుసాకులతో రద్దుచేస్తున్నారని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో అమలుచేసిన పథకాలకు పేర్లు మార్చి సొంత పథకాలుగా టిడిపి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్ల టిడిపి పాలనలో ప్రజల సమస్యలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు చేపట్టిన గడపగడపకూ వైకాపాకి జిల్లాలో విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. గడపగడపకూ వైకాపాలో భాగంగా పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళితే ప్రజలే తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారన్నారు. పార్టీ ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు బెల్లాన చంద్రశేఖర్, నెక్కల నాయుడుబాబు, జైహింద్‌కుమార్ పాల్గొన్నారు.