విజయనగరం

వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్), జూలై 19: పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలను మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. సాయిబాబా ఆలయాలు సాయినామ స్మరణతో మారుమ్రోగాయి. వేకువ ఝాము నుండి భక్తులు షిరిడిసాయి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాబామెట్టలోని శివపంచాయతన ఆలయంలో కొలువైన షిరిడిసాయిబాబాకు వేకువ ఝామున ప్రత్యేక పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం జరిపారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. పవిత్రమైన రోజు కావడంతో బాబాను దర్శించుకున్న భక్తులందరు పాలతో బాబాకు అభిషేకం జరిపారు. రింగ్‌రోడ్డులోని సాయిబాబా ఆలయం, పాత బస్టాండ్ వద్ద సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.
గజపతినగరంలో..
గజపతినగరం: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో గురుపౌర్ణమి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. గజపతినగరం పంచాయితీ శివారు ఎం. వెంకటాపురంలోగల షిరిడి సాయి మందిరం, పురిటిపెంట మారుతీ నగర్‌లో గల షిరిడి సాయి మందిరాలలో భక్తులు పోటెత్తారు. ఉదయం ఆరు గంటలకు హారతి, ఏడు గంటల నుండి షిరిడి సాయి విగ్రహానికి పాలాభిషేకం భక్తులచే నిర్వహించారు. అనంతరం సాయి విగ్రహానికి వివిధ రకాల పూలతో అలంకరణ జరిపారు. భక్తులు దేవాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అదే విధంగా సాయిమందిరం ఆవరణలో గల గురుదత్త ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. మిగిలిన దేవాలయాలు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులు సందర్శించి పూజలు చేసారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలోని షిరిడి సాయి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసారు.
వేపాడలో...
వేపాడ: మండలంలో వేపాడలో షిరిడిసాయి మందిరంలో మంగళవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కాగడ హారతి అనంతరం పాలాభిషేకం, పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శతనామాలతో పూజలు జరిపారు. వేపాడ, వల్లంపూడి, వి. ఎన్.పేట, వావిడిపేట తదితర గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12గంటల నుండి భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు సంధ్యాహారతి, రాత్రి ఎనిమిది గంటలకు శేష హారతి అనంతరం ప్రసాద వితరణ జరిపారు. ఈ సందర్భంగా భక్తులు భజనా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సాయి సేవకులు బుల్లబ్బాయి, గోవింద, వేపాడ, వల్లంపూడి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.