విజయనగరం

ప్రజాసాధికార సర్వేపై అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, జూలై 22: ప్రజా సంక్షేమం కోసం పటిష్టమైన విధానాలను అవలంభించేందుకు వీలుగా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సాధికార సర్వేపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు అపోహలు చెందాల్సిన పనిలేదని తహశీల్దార్ పద్మావతి స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన మండల సమావేశంలో బి.కె.ఆర్.పురం సర్పంచ్ ఎం. రామచంద్రుడు మాట్లాడుతూ మాన్యువల్, అడంగల్ విషయంలో, ప్రజాసాధికార సర్వేపైన రెవెన్యూ అధికారులు స్పష్టమైన విధానాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ఉందన్నారు. దీనిపై తహశీల్దార్ స్పందిస్తూ ఇకపై అడంగల్ కావల్సిన వారు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే పల్స్ సర్వేకు ప్రజలు సహకరించాలని, ప్రస్తుతం జిల్లాలో ఈ సర్వేపై మూడవ స్థానంలో ఉన్నామని చెప్పారు. మండల అధ్యక్షురాలు దాసరి లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధి హామీ ఎపిఓ చినప్పయ్య మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగా, బల్లంకి, బాణాది, వల్లంపూడి సర్పంచ్‌లు డి.ఎం.నాయుడు, బొంప వెంకటరావు, ఎస్.తాతారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది నాటిన మొక్కలు సంరక్షణ లేక చనిపోగా, ఈ ఏడాది కూడా మొక్కలను ఇస్తామని చెప్పడం తగదని ఖండించారు. మొక్కలు నాటడం గొప్పకాదని, సంరక్షించే బాధ్యత ఎవరిదని దుయ్యబట్టారు. ఈ ఏడాది మొక్కలు సంరక్షించిన వారికి కూలీ పెంచుతామని చెప్పడంతో సభ్యులు శాంతించారు. విద్యాశాఖకు సంబంధించి మండలంలోని 14 పాఠశాలలకు ట్యాబ్‌లు మంజూరు చేయగా వాటిని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఎంపిపి దాసరి లక్ష్మి, ఎండిఓ వి.లక్ష్మి, తహశీల్దార్ పద్మావతి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎఇఇ పైడిరాజు, వెలుగు ఎపిఎం రమణ, బొద్దాం, వేపాడ పిహెచ్‌సి వైద్యాధికారులు వర్మ, వీరభద్రరావు, ఇరిగేషన్ ఎఇ సాయిలక్ష్మి, డిఆర్‌ఓ చౌదరి, ఐసిడి ఎస్ సిడిపిఓ ఉషారాణి, ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్, అధికారులు పాల్గొన్నారు. కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అన్నారు. డిపో పరిధిలో బడిబాట బస్సులను విద్యార్థుల కోసం కండెక్టర్ లేకుండా నడుపుతామని అన్నారు. బల్లంకి-బాణాది బస్సు కోసం ఉన్నతాధికారులకు వివరిస్తామని చెప్పారు. 14మంది ఎంపిటిసిలకు సగం మంది హాజరు కావడం విశేషం.