విజయనగరం

సిలెండర్ పరిశ్రమను తెరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),జూలై 25: అక్రమంగా మూసివేసిన సాహువాలా సిలెండర్ పరిశ్రమను వంటను తెరిపించేందుకు జిల్లా యంత్రాంగం జోక్యంచేసుకోవాలని కోరుతూ సి ఐ టి యు జిల్లాకార్యదర్శి టివిరమణ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా టి.వి.రమణ మాట్లాడుతూ బొండపల్లి మండలంలో గరుడుబిల్లి గ్రామంలో సాహూవాలా సిలిండర్స్ కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారని పరిశ్రమ మూత వల్ల వీరంతా వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు. 20 ఏళ్లుగా ఈ పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికుల కుటుంబాలకు పనిచేసిన కాలానికి జీతం ఇప్పించాలని, పరిశ్రమను తెరిపించేవరకు లే- ఆఫ్ మంజూరు చేయాలని కోరారు. రిటైర్ అయిన కార్మికులకు చట్ట ప్రకారం గ్రాట్యూటీ మంజూరు చేయాలని కో రారు. పరిశ్రమను అక్రమంగా మూసివేయడంపై కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో సాహూవాలా సిలిండర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గజపతిరావు, కార్మికులు పాల్గొన్నారు.

వనం-మనంలో కోటి మొక్కలు
* ఆర్థిక ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదేశం
విజయనగరం(టౌన్), జూలై 25:రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ హరితాంధ్ర ప్రదేశ్ కింద కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నదని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సివి రమేష్ తెలిపారు. సోమవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా మాట్లాడుతూ ఆయన 29న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షతన మిషన్ హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనకు కమిటీలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు అందరి సహకారం తీసుకుని విజయవంతం చేయాలని చెప్పారు. పర్యావరణానికి మేలు కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వనం-మనం కార్యక్రమం రోజున 20 నుండి 25వేల మొక్కలు మండలాలలోనాటాలని తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి వేణుగోపాలరావు మాట్లాడుతూ జిల్లాలో వనం-మనం కింద ఎనిమిది లక్షల 36వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధంచేసామని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని మొక్కల పంపిణీ కార్యక్రమం రెండురోజులలో పూర్తవుతుందని తెలిపారు. నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టెరిటోరియల్ అటవీశాఖ అధికారి రమణమూర్తి, డ్వామా పిడి ప్రశాంతి, డి ఆర్‌డి ఎ పిడి ఢిల్లీరావు, జడ్పీ సిఇఓరాజకుమారి, విద్యాశాఖ అధికారులు అరుణకుమారి, అప్పారావు, డి ఎం అండ్ హెచ్‌ఓ అధికారులు పాల్గొన్నారు.