విజయనగరం

భూముల ఇ-పాస్ విధానంలో భారీ అవినీతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 28: రాష్ట్రంలో రైతుల భూములను ఇ-పాస్ విధానం పేరిట ఆన్‌లైన్ చేయటంలో ప్రభుత్వం, అధికారపార్టీ నాయకులు కుమ్మక్కై వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ అజయ్ ఆరోపించారు. రైతుల భూములను కొల్లగొట్టాలనే దురాలోచనతోనే ఇ-పాస్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దశాబ్ధాలుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొని అనేక ఏళ్లపాటు ఆందోళనలు కొనసాగించడం ద్వారా రైతులు పట్టాదారు పాసుపుస్తకాలను సాధించుకున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఈవిధానానికి స్వస్తి పలికి రైతులను రోడ్డుకు ఈడ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇ-పాస్ విధానంలో రైతులకు టైటిల్ డీడ్ వంటి పత్రాలు ఏవీ ఉండవని, కేవలం ఆన్‌లైన్‌లో భూమి వివరాలు ఉంటాయన్నారు. వ్యవసాయం కోసం రుణాలు కావాలన్నా, వివిధ కారణాలతో భూములు అమ్ముకోవాలన్నా ఇ-సేవ ద్వారా సర్ట్ఫికెట్లు తీసుకోవల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతుల భూములను ఆన్‌లైన్ చేయడంలో రెవెన్యూ అధికారులతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మక్కైన కారణంగా రైతుల భూములు ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు కావడం లేదని అన్నారు. ఒక రైతు భూమిని ఆ రైతుపేరిట కొంత, బినామీ రైతు పేరిట కొంత ఆన్‌లైన్‌లో నమోదుచేసేందుకు ప్రమాదం ఉందన్నారు.
ఇ-పాస్ విధానం అమలుకు ముందు రాష్ట్రంలో 1.80కోట్ల రైతులు ఉండగా, కొత్తవిధానం అమలుతో రైతుల సంఖ్య 2.40కోట్లకు పెరిగిందని తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో 60లక్షల మంది బినామీ రైతుల పేరిట భూములు ఉన్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఇ-పాస్ విధానం ద్వారా రైతులు నుంచి భూములను లాగేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇ-పాస్ విధానం పారదర్శకత కోసమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా రైతుల భూములను ఆన్‌లైన్‌లో నమోదుచేసే విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్లు, రెవెన్యూ అధికారులు, అధికారపార్టీ నాయకులు కుమ్మక్కయిన కారణంగా బినామీ రైతులు పుట్టుకొస్తున్నారని చెప్పారు. లక్షలాదిమంది రైతులకు సంబంధించిన ఈ అంశంపై ప్రభుత్వం రైతులతో, కనీసం రైతు సంఘాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ విధానం ఎన్‌ఆర్‌ఐలకు, ల్యాండ్ మాఫియాకు, రాజకీయ నాయకులకు ఉపయోగపడేదే తప్ప రైతుల ప్రయోజనాలను కాపాడేది కాదన్నారు. రాష్ట్రంలో 2013లో జారీ అయిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా అభివృద్ధి పేరిట విమానాశ్రయ నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రైతుల నుంచి ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తోందని విమర్శించారు. ఈ విపత్కర పరిస్థితులలో ఇ-పాస్ విధానాన్ని అమలుకోసం జారీచేసిన జీవో- 271ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ జీవో రద్దుకోసం ఆగస్టు 3వ తేదీన రాష్టవ్య్రాప్తంగా అఖిలపక్ష రైతుసంఘాల ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విలేఖరుల సమావేశంలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు, సత్యనారాయణ, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.