విజయనగరం

నత్తనడకే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 1: పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల బాధ్యతారాహిత్యం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కొట్లాది రూపాయల అభివృద్ధి పనులు మందకొడిగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఒకవైపుఎమ్మెల్యే మీసాల గీత, మరోవైపు జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా వారిలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. పట్టణంలో రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి జోరుగా శంకుస్థాపనలు చేస్తున్న మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కూడా పనులు ప్రారంభంపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే అభివృద్ధిపనులు నిలిచిపోతున్నాయి. గత రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో 26.40 కోట్ల రూపాయల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టణం మొత్తం మీద 270 అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు 253 పనులకు వర్కు ఆర్డర్లను ఇచ్చారు. ఇందులో కేవలం 20 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. కొన్నిచోట్ల ప్రారంభించిన పనులను సగంలోనే నిలిపివేసినా మున్సిపల్ పాలకవర్గం కూడా పట్టించుకోవడంలేదు. సకాలంలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఇంజనీరింగ్ అధికారులు చేస్తున్న హెచ్చరికలను కాంట్రాక్టర్లు బేఖాతరు చేస్తున్నారు. పట్టణంలో 40 వార్డులు ఉండగా, పట్టణ పరిధి 52.46 కిలో మీటర్లు ఉంది. ఇందులో ఎక్కువశాతం మట్టిరోడ్లే ఉన్నాయి. చాలా చోట్ల గతుకులమయంగా తయారయ్యాయి. మరికొన్ని చోట్ల రాళ్లు తేలిపోయి నడవడానికి కూడా వీలులేని విధంగా ఉన్నాయి. ఇలాంటి రోడ్లను అభివృద్ధి చేయాలని పట్టణ ప్రజలు గత రెండేళ్ల నుంచి కోరుతున్నా మున్సిపల్ పాలకులుగాని, అధికారులుగాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలో నిధులు పుష్కలంగా ఉన్నా నిష్ప్రయోజనమే కనిపిస్తుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన వార్డులకు 60 లక్షల రూపాయలు, మిగతా వార్డులకు 40 లక్షల రూపాయల చొప్పున కేటాయిస్తూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన పనులకు కూడా మోక్షం లభించలేదు.అదేవిధంగా మున్సిపాలిటీలో సాధారణ నిధులు 14 కోట్లు, నాన్‌ప్లాన్ గ్రాంట్లు 3.16 కోట్లు, ఇతర గ్రాంట్లు 1.16 కోట్లు, 13వ ఆర్థిక సంఘం నిధులు 7.60 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ నిధులను ఖర్చు చేయడంలేదు. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం నుంచి 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5.6కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. దీనికి తోడు మిగతా గ్రాంట్లు కింద మరో 50 కోట్ల రూపాయల మేరకు నిధులు మున్సిపాలిటీలో ఉన్నాయి. అయితే నిధులకు కొరత లేకపోయినా ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం: మున్సిపల్ కమిషర్
పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.

కాపుపాలెంలో
అగ్ని ప్రమాదం
* రూ. 15 లక్షల ఆస్తి నష్టం
శృంగవరపుకోట, ఏప్రిల్ 1: మండలంలోని శివరామరాజుపేట పంచాయతీకి చెందిన కాపుపాలెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో వెయ్యిబస్తాల ధాన్యం, పది వరి కుప్పలు, ఐదు పశువుల పాకలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చునని, రైతులు ఏరువాక ఎర్నాయుడు, ముత్యాలనాయుడు, వెంకటసత్యం, కృష్ణ, రాములు ఆస్తి నష్టపోయారని, ఆస్తినష్టం రూ. 15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ పంటను ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి అంది కూడా తాము అనుభవించలేకపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థికసా యం అందజేయాలని రైతులు కోరా రు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎంపిపి రెడ్డి వెంక న్న సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను పరామర్శించారు.

ఎండుతున్న
చెరువులు
* అల్లాడుతున్న పశువులు
* వరుణుడి కోసం రైతుల ఎదురుచూపు
బొబ్బిలి(రూరల్), ఏప్రిల్ 1: వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే చెరువులు, కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. మంచినీటి కోనేరులు కొన్ని గ్రామాల్లో ఉన్నప్పటికీ నీరు కలుషితమవుతోంది. దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా చెరువులు, కాలువల్లో నీరు లేకపోవడంతో పశువులను కడిగేందుకు కూడా రైతులు ఆందోళనలకు గురవుతున్నారు. పశువులు తాగేందుకు కూడా నీరు లేకపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో మంచినీటి సౌకర్యం లేక ఓ పక్క ఇబ్బందులకు గురవుతుంటే మరోపక్క పశువులు తాగేందుకు నీటిని ఏర్పాటు చేసేందుకు రైతులు మరిన్ని ఇక్కట్లకు గురవుతున్నారు. వేగావతి నదిలో కూడా పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో ఇంకిపోయింది. అధికారులు తాత్కాలిక చర్యలను చేపట్టకపోవడంతో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కోమటిపల్లి, ముత్తాయివలస, కమ్మవలస, శివడవలస, కొండదేవుపల్లి, కాశిందొరవలస, తదితర ప్రజలకు మంచినీటి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. ఉన్న బోర్లు కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. క్రాష్ ప్రోగ్రాం తూతూ మంత్రంగా నిర్వహించి అధికారులుచేతులు దులుపుకుంటున్నారే తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విఆర్‌ఎస్, పారాది కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మరమ్మతులకు గురైన బోర్లను బాగుచేయాలని కోరుతున్నారు.

ఉత్తమ పంచాయతీలకు నజరానా
ప్రథమ స్థానం రూ. లక్ష * ద్వితీయ స్థానం రూ. 75 వేలు
నెల్లిమర్ల, ఏప్రిల్ 1: ఉత్తమ గ్రామ పం చాయతీలుగా ఎంపికైనగ్రామాలకు ప్రభు త్వం నజరానాలను అందజేస్తుందని ఎంపిడిఓ కె.రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మండల స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపికలో చైర్మన్‌గా ఎంపిడి కన్వీనర్‌గా ఇఓ పిఆర్‌డి వ్యవహరిస్తారని చెప్పారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్న పంచాయతీకి లక్ష రూపాయలు, ద్వితీయస్థానంలో ఉన్న గ్రామానికి 75వేల రూపాయల చొప్పున నజరానా అందిస్తామని చెప్పారు. ఉత్తమ గ్రామ పంచాయ తీల ఎంపికలో శతశాతం ఇంటిపన్నులు వసూలు, ఆన్‌లైన్ లో ధ్రువపత్రాలు అందజేయడం, మరుగుదొడ్లు నిర్మాణం, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించారు. మండల స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాలను జిల్లా కమిటీకి పంపిస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి నజరానాలుఅందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామానికి మూడు లక్షల రూపాయలు, ద్వితీయ స్థానానికి రెండు లక్షల రూపాయలు, తృతీయ స్థానానికి లక్ష రూపాయలు రివార్డు అందజేయనున్నట్లు చెప్పారు.అలాగే జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం లో నిలిచిన గ్రామాలను రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలోనిలిచిన గ్రామానికి ఐదు లక్షల రూపాయలు, ద్వితీయ స్థానానికి రూ. నాలుగు లక్షలు, తృతీయ స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. మూడు లక్షలు బహుమతిగా ఇస్తామని చెప్పారు.

పోలియో ఇంజక్షన్లు
* 25 నుంచి అమలు
గరుగుబిల్లి, ఏప్రిల్ 1: 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఇకపై పోలియో చుక్కలతోపాటు ఇంజక్షన్లు వేస్తామని మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. తెర్లి జగన్మోహనరావు అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం పోలియో ఇంజక్షన్ల కార్యక్రమంపై వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఇంతవరకు పోలియో చుక్కలు వేసేవారమని, అయితే ఈనెల 25వ తేదీ నుంచి పోలియో చుక్కలతోపాటు ఇంజక్షన్లు కూడా వేయాలని సిబ్బందికి సూచించారు. ఈ ఇంజక్షన్లు వేయడం వలన వ్యాధి నివారణ ఇంకా బాగుంటందన్నారు. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లకు శిక్షణ నిర్వహిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రతీ బుధవారం, శనివారం సబ్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఈ ఇంజక్షన్లు వేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ దత్తి స్పందన, సిబ్బంది జనార్దన నాయుడు, వారది మహందాత నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు
* కలెక్టర్ ఎంఎం నాయక్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 1: జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అటవీ, ఇతర సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఎంఎం నాయక్ ఆదేశించారు. అలంకరణకు ఉపయోగించే, స్మృతి వనాల పెంపకానికి అవసరమైన మొక్కలు పెంచేందుకు ప్రోత్సహించాలని సూచించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో శుక్రవారం అటవీ, పంచాయతీరాజ్, విద్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లాలోని జాతీయ, రాష్ట్రీయ రహదారులకు ఇరువైపులా ఉపాధిహమీ పథకం కింద మొక్కలు నాటి వాటిని సంరక్షించటం ద్వారా పేదప్రజలు ఉపాధి పొందేలా కార్యాచరణ రూపొందించాలని అన్నా రు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వివిధ కార్యాలయాలు, హాస్టళ్ల ప్రాంగణాలలో విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామపంచాయతీలకు చెందిన అంతర్గత రోడ్లకు ఇరువైపులా, వ్యవసాయ మార్కె ట్ యార్డులలో మొక్కలు పెంచేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. క్వారీలు, పరిశ్రమల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా చూడాలని తెలిపారు. సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు, పాఠశాలల నర్సరీల లో పెంచిన 1.08కోట్ల మొక్కలు సిద్ధం గా ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్క ర్, డిఎఫ్‌ఓలు రమణమూర్తి, వేణుగోపాల్, డిఆర్‌డిఎ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు ఢిల్లీరావు, ప్రశాంతి, జిల్లాపరిషత్ సిఇఓ రాజకుమారి, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్
సిద్ధం చేయండి
జిల్లాలో వచ్చే ఈ మూడు నెలల్లో వాతావరణంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరి గే అవకాశం ఉందని విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు చేసిన కారణంగా వడగాలులను ఎదుర్కొనేందుకు జిల్లాయంత్రాంగం సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఎంఎం నాయక్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. వడగాల నుండి ఉపశమ నం, సహాయక చర్యలు, వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. వడగాలులతో ఏర్పడే పరిణామాలను తట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్, ఐవి ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ తదితర మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులు, ఆరోగ్యకేంద్రాలలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది 24గంటలపాటు అందుబాటులో ఉండాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఇంటిపన్ను చెల్లింపు గడువు పెంపు
నెల్లిమర్ల, ఏప్రిల్ 1:ఇంటిపన్ను చెల్లింపు గడువు ఈ నెల 30వ తేదీ వర కు పెంచినట్లు ఇఒ పిఆర్‌డి హెచ్. భానోజీరావు చెప్పారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇంటిపన్ను చెల్లింపు గడవు గత నెల 31వ తేదీ ఉండేదని, దీనిని మరోనెల రోజులు పాటు గడువు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. మండలంలో 26 పంచాయతీల్లో ప్రజలు ఇంటిపన్ను కట్టి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. ఇంటి పన్నులను ఆన్‌లైన్ చేస్తారని తెలిపారు. ఏప్రిల్ నెల దాటిన తరువాత ఇంటిపన్నులు చెల్లిస్తే వడ్డీ వస్తుందని అన్నారు. గ్రామాల్లో అక్రమ నీటి కనెక్షన్లు ఉంటే వాటిని కార్యదర్శులు క్రమబద్ధీకరించాలని చెప్పారు. అలాగే పరిశ్రమలకు 10వేల రూపాయలు, వ్యాపార సంస్థలకు ఐదువేల రూపాయలు చొప్పున వసూలు చేస్తామని చెప్పారు. ఇంటి పన్ను పేరు మార్పుకు సంబంధించి కార్యదర్శులను సంప్రదించాలని కోరారు.