విజయనగరం

ప్రత్యేక హోదాతోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఆగస్టు 5: ప్రత్యేక హోదాతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యం అవుతుందని గజపతినగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చప్పా తిరుపతి అన్నారు. శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించనందుకు నిరసనగా గజపతినగరం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఉప్పలపాటి రమేష్, కె.రమణాజీ, దేవర ఈశ్వరరావు, తొత్తడి దేవుడు, న్యాయవాదులు కొల్లూరు శేఖర్, ఆదినారాయణ, గండి అప్పనాయుడు పాల్గొన్నారు.