విజయనగరం

తేలికపాటి వర్షాలతో రైతుల ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 5: జిల్లాలో గత రెండు రోజులుగా కురస్తున్న తేలికపాటి వర్షాలతో రైతాంగం ఊపిరి పీల్చుకుంటోంది. అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తుండటం, మరో రెండురోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించటంతో రైతులు సేద్యం పనులు జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వరినాట్లు పడిన ప్రాంతాలకు ఈ వర్షాలు రెండువారాల పాటు ఉపశమనం కలిగిస్తుందని రైతులు చెబుతున్నారు. నాట్లు వేయని చోట రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సేద్యం పనులు ప్రారంభించారు. ఈ సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మొదట్లో చేసిన ప్రకటనలతో రైతులు వర్షాలపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఊరిస్తూ.. ఊరిస్తూ కురుస్తున్న వర్షాలతో రైతులు గాభరా పడవలసి వచ్చింది. అధికారుల లెక్కల ప్రకారం జూన్, జూలై నెలలో సాధారణ వర్షపాతానికి మించి ఎక్కువ వర్షం కురిసినట్లు చెబుతున్నా జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం వర్షాధారంగా సేద్యం జరగుతుండటంతో, వర్షానికి..వర్షానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండటంతో రైతులు సేద్యం పనులు ప్రారంభించేందుకు ఇబ్బందులు పడవల్సి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు నీరు వదులుతున్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం పనులు జోరుగా సాగుతున్నా, పలు వర్షాధార ప్రాంతాల్లో వర్షాలు సక్రమంగా లేక పొలంపనులు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల వరినారు ఎండిపోతుందని, మరికొన్ని చోట్ల వేసిన వరిపంట ఎండిపోతుందనే ఆందోళనలు రైతుల నుంచి వ్యకమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో మొత్తం సేద్యం విస్తీర్ణంలో మూడోవంతు భూముల్లో కూడా రైతులు పంటలు వేయలేదని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. ఈ స్థితిలో రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలు రైతులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. గడచిన రెండురోజుల్లో మధ్యలో కాస్త తెరపి ఇచ్చినా తేలికపాటి వర్షం కొనసాగటంతో రైతులు సేద్యం పనులు ప్రారంభించారు. మరికొన్ని రోజులు తేలికపాటి వర్షాలు కొనసాగితే నాట్లు వేసే పనులు అంతరాయాలు లేకుండా కొనసాగుతాయని రైతులు చెబుతున్నారు.